మాలికాపురం ఓటీటీలో అదరగొట్టిన మలయాళ సినిమా. ఇందులో ఉన్ని ముకుందన్ హీరోగా నటించాడు. చైల్డ్ ఆర్టిస్ట్ దేవానంద ప్రధాన పాత్రలో మెప్పించింది. ఈ బాలనటి నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత 2018, నైమర్, అరణ్మనై 4 వంటి చిత్రాల్లో నటించింది. ఆమె నటించిన గు అనే హారర్ మూవీ ఈ మధ్యే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ చిన్నారి ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. అది కూడా తన ఇంటి దగ్గరే ఇంటర్వ్యూ ఇచ్చింది.
నటిపై ట్రోలింగ్
అయితే సదరు యూట్యూబ్ ఛానల్‌లో ప్రసారమైన వీడియోను కొందరు ఇష్టారీతిన కట్ చేస్తూ తప్పుడు థంబ్‌నైల్స్ పెడుతున్నారట! తను అన్న మాటలను వక్రీకరిస్తున్నారట! దీనిపై నటి తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంటర్వ్యూలోని ఒక పార్ట్‌ను మాత్రమే కట్ చేసుకుని తన కూతురిపై బురద చల్లుతున్నారని మండిపడ్డాడు. విద్వేషపూరిత ప్రచారం చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మానసికంగా..
ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో తన కూతుర్ని కించపరుస్తూ మాట్లాడుతున్నారని పేర్కొన్నాడు. దీనివల్ల తన పదేళ్ల చిన్నారి మానసిక ఆవేదనకు లోనవుతోందని తెలిపాడు. తన కూతురిపై ద్వేషం చిమ్మిన వీడియోలును వెంటనే సదరు ఛానల్స్ డిలీట్ చేయాలని డిమాండ్ చేయాలని లేని పక్షంలో వారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు.
సినిమా కోసం ఉపవాసం
కాగా దేవానంద ప్రస్తుతం ఐదో తరగతి చదువుతోంది. తొట్టప్పన్(2019) చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఆమె మై సాంటా, మిన్నాల్ మురళి, టీచర్, మాలికాపురం వంటి అనేక చిత్రాల్లో నటించింది. మాలికాపురం సినిమాలో ఈ బాలనటి ఎలాగైనా శబరిమల వెళ్లాలనుకుంటుంది. చివరకు పేరెంట్స్ సాయం లేకుండా అనుకున్నది సాధిస్తుంది. అయితే ఈ సినిమా కోసం 75 రోజులపాటు ఉపవాసం ఉంది. పైగా తను శబరిమల వెళ్లడం కూడా అదే తొలిసారి అని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.
చదవండి: పెళ్లయి మూడు నెలలు కాలేదు.. వెడ్డింగ్ పిక్స్ డిలీట్ చేసిన నటి
Comments
Please login to add a commentAdd a comment