సినీ ఇండస్ట్రీలో ఫేమ్ రావాలంటే అంతా ఈజీ కాదు. అది ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించాలంటే ఏదైనా అదృష్టం కలిసి రావాల్సిందే. కానీ ఆమెకు చిన్న వయసులోనే ఓ రేంజ్‌లో దశ తిరిగిపోయింది. కేవలం 17 ఏళ్ల వయసులోనే ఈ స్టార్ కిడ్ అరుదైన ఘనతను సాధించింది. ఆమె ఎవరో కాదు.. నటుడు రాజ్ అర్జున్ కుమార్తె సారా అర్జున్. ఈ ఏడాది రిలీజైన మణిరత్నం బ్లాక్‌బస్టర్ మూవీ పొన్నియిన్ సెల్వన్‌లో నటించిన సంగతి తెలిసిందే.
(ఇది చదవండి: షారుఖ్ రిస్కీ ఫైట్స్.. నయన్‌కు ఫస్ట్.. అట్లీ సెకండ్.. ‘జవాన్’విశేషాలివీ!)
సారా అర్జున్ ఆరేళ్ల వయసులోనే వాణిజ్య ప్రకటనలతో పాటు హిందీ చిత్రంలోనూ కనిపించింది. 2010లో విజయ్ చిత్రం దైవ తిరుమగల్‌లో ప్రధాన పాత్రను పోషించింది. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ జై హో, ఇమ్రాన్ హష్మీ ఏక్ థీ దయాన్, ఐశ్వర్య రాయ్ జజ్బా సూపర్ స్టార్స్ నటించిన భారీ బడ్జెట్ చిత్రాలలో కనిపించింది. తమిళం, హిందీతో పాటు తెలుగు, మలయాళంలో కూడా నటించింది. శైవం చిత్రంలో బాలనటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో రాజేంద్రప్రసాద్ నటించిన దాగుడుమూతలు దండాకోర్ చిత్రంలో కనిపించింది.
సారా అర్జున్ ఇప్పటివరకు అత్యధికంగా అర్జించిన బాలనటిగా రికార్డు సృష్టించింది. మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ పార్ట్-1లో యువ నందిని(ఐశ్వర్యరాయ్ పాత్రకు)గా కనిపించింది. ఈ క్యారెక్టర్ సారాకు మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత పార్ట్-2లోనూ మరింత అందంగా కనిపించింది. సారా అర్జున్ 2023 నాటికి రూ.10 కోట్లతో భారతదేశంలోనే రిచెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నిలిచింది. పొన్నియన్ సెల్వన్ రెండు భాగాలు కలిపి బాక్సాఫీస్ వద్ద రూ.800 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే.
(ఇది చదవండి: ఆ తప్పు చేయడం వల్లే కెరీర్ నాశనం: ధనుశ్)
దీంతో సారాకు పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపును తెచ్చిపెట్టింది. తన రాబోయే ప్రాజెక్ట్‌లో దళపతి విజయ్ సినిమాలో నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. సారా అర్జున్ తండ్రి రాజ్ అర్జున్ రెండు దశాబ్దాలుగా తెలుగు, హిందీ చిత్రాల్లో నటించారు. బ్లాక్ ఫ్రైడే చిత్రంతో అరంగేట్రం చేసిన అతను రౌడీ రాథోడ్, రయీస్, సీక్రెట్ సూపర్ స్టార్, డియర్ కామ్రేడ్, తలైవి వంటి చిత్రాల్లో కనిపించారు.
Comments
Please login to add a commentAdd a comment