Maniratnam Ponniyin Selvan OTT Rights Release Date Details: స్టార్ డైరెక్టర్ డ్రీమ్ ప్రాజెక్ట్ చిత్రం 'పొన్నియన్ సెల్వన్' చిత్రం. మద్రాస్ టాకీస్తో కలిసి లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిష ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 30న 'పొన్నియన్ సెల్వన్' పార్ట్ 1ను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నారు మేకర్స్. అయితే 'పొన్నియన్ సెల్వన్' అనే నవల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ రిలీజ్‌కు ముందే సూపర్ ప్రిరిలీజ్ బిజినెస్ చేసింది.
'పొన్నియన్ సెల్వన్' సినిమా రెండు భాగాల డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు కొనుగోలు చేసింది. సుమారు రూ. 125 కోట్లకు ఈ రైట్స్ సాధించినట్లు సమాచారం. కాగా ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తోంది. ఈ పాన్ ఇండియా చిత్రాలతో సూపర్ హిట్ కొట్టి తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ఒక మంచి సక్సెస్ సాధిస్తే యావత్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందొచ్చని భావిస్తున్న తమిళ ఇండస్ట్రీ ఈ మూవీపై ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
చదవండి: మహేశ్ ఫ్యాన్స్‌కు ట్రీట్, 105 షాట్స్‌తో ‘సర్కారు వారి పాట’ ట్రైలర్
సీనియర్ నటి రాధిక సినిమాలో హీరోగా చిరంజీవి..
Ponniyin Selvan OTT Release: మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ 'పొన్నియన్ సెల్వన్'.. భారీ ధరకు ఓటీటీ రైట్స్
Published Mon, May 2 2022 4:35 PM | Last Updated on Mon, May 2 2022 7:05 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment