మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’. పదో శతాబ్ధంలో చోళ రాజ్యంలోని స్వర్ణయుగాన్ని మణిరత్నం తెరపై ఆవిష్కరించబోతున్నారు. ఇక రెండు భాగాలుగా తెరకెక్కితున్న ఈ మూవీ తొలి భాగం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 30న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఈమూవీ ఓటీటీ, డిజిటల్ రైట్స్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర అప్‌డేట్ సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. తాజా బజ్ ప్రకారం ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైం వీడియోస్ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు సమాచారం.
చదవండి: కృష్ణంరాజు ముగ్గురు కూతుళ్ల గురించి ఈ ఆసక్తిర విషయాలు తెలుసా?
అలాగే డిజిటల్ రైట్స్ కూడా భారీ రేట్‌కు విక్రయించినట్లు తెలుస్తోంది. కాగా పొన్నియన్ సెల్వన్ రెండు భాగాలను ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ రూ. 120 కోట్లకు దక్కించుకోగా.. డిజిటల్, శాటిలైట్‌ను రైట్స్‌ను అమెజాన్‌తో పాటు సన్‌టీవీ కూడా విక్రయించారట. అయితే ఎంతమొత్తానికి అనేది క్లారిటీ రావాల్సి ఉంది. కాగా కల్కి కృష్ణమూర్తి రచించిన పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో చియాన్ విక్రమ్, ‘జయం’ రవి, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిషలు, ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాళ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు.
చదవండి: ఓటీటీ రిలీజ్‌కు రెడీ అవుతున్న కార్తికేయ 2! ఎప్పుడు, ఎక్కడంటే..
Comments
Please login to add a commentAdd a comment