Kamal Haasan Gives Voice Over to Ponniyin Selvan Movie - Sakshi
Sakshi News home page

Kamal Hassan-Maniratnam: ‘పొన్నియిన్‌ సెల్వన్‌’.. మణిరత్నం కోసం రంగంలోకి కమల్‌

Published Sat, Jul 9 2022 2:15 PM | Last Updated on Sat, Jul 9 2022 2:55 PM

Kamal Haasan Gives Voice Over to Ponniyin Selvan Movie - Sakshi

ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన తాజా చిత్రం 'పొన్నియన్​ సెల్వన్: పార్ట్‌ 1'. మద్రాస్​ టాకీస్​తో కలిసి లైకా ప్రొడక్షన్స్​ భారీ బడ్జెట్​తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో విక్రమ్​, జయం రవి, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిష ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. 1955లో కల్కి కృష్ణమూర్తి రచించిన నవల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు మణిరత్నం. భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 30న తెలుగు, హిందీ తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నారు.

చదవండి: ‘విక్రమ్‌’ మేకింగ్‌ వీడియో చూశారా?.. డైరెక్టర్‌ ఫోకస్‌కు నెటిజన్లు ఫిదా!

ఇక మూవీ ప్రమోషన్లో భాగంగా ఇందులోని ప్రధాన పాత్రలకు సంబంధించిన లుక్‌ను ఒక్కొక్కొటిగా విడుదల చేస్తూ మూవీపై అంచనాలను పెంచుతోంది చిత్ర బృందం. అయితే ఈ సినిమా ప్రధాన పాత్రలకు సంబంధించిన పలు సన్నివేశాలను అక్కడక్కడా కలుపుతూ వాయిస్ ఓవర్ ఉంటుందట. అయితే తమిళంలో ఈ స్పెషల్‌ సీన్స్‌కు కమల్‌తో వాయిస్‌ ఓవర్‌ ఇప్పిస్తున్నాడు మణిరత్నం. అంతేకాదు ఇతర భాషల్లో కూడా ఆయా స్టార్‌ను ఎంచుకుని వాయిస్‌ ఓవర్‌ చెప్పించేందుకు మూవీ టీం ప్లాన్‌ చేస్తోంది. ఈ నేపథ్యంలో తమిళంలో కమల్‌ చెబితే బాగుటుందని మూవీ టీం భావిస్తోందట. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement