Bajrangi Bhaijaan Child Artist Harshaali Malhotra Dance To Salman Khan Song Video - Sakshi
Sakshi News home page

'భజరంగీ భాయ్‌జాన్‌' చిన్నారి వీడియో.. సో క్యూట్‌ అంటున్న నెటిజన్స్‌

Published Thu, Oct 28 2021 1:24 PM | Last Updated on Thu, Oct 28 2021 2:59 PM

Viral Video: Bajrangi Bhaijaan Harshaali Malhotra Salman Khan Veer Song - Sakshi

2015లో విడుదలైన 'భజరంగీ భాయ్‌జాన్‌' సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తన పాత్రతో ప్రేక్షకుల హృదయాల్ని కదిలించిన చిన్నారి మున్నీ పాత్ర గుర్తుందా? అదేనండి సల్మాన్‌ ఖాన్‌ భుజాల మీద వేసుకుని ఆడిపించుకునేవాడు, ఎంతో క్యూట్‌గా, అమాయకంగా కనిపించిన హర్షలి మల్హోత్రా. 

ఈ ఏడాది జూన్‌లో 13న తన పుట్టిన రోజు జరుపుకుని టీనేజ్‌లోకి అడుగుపెట్టిన హర్షలి... ఇటీవలే తన ఇన్‌స్టాగ్రామ్‌లో 15 లక్షల మంది ఫాలోయర్లను సంపాదించుకుని సోషల్‌మీడియాలో సెన్సేషన్‌గా మారుతోంది. తరచూ తన డాన్స్ వీడియోలతో నెట్టింట హల్‌చల్‌ చేస్తున్న హర్షలి తాజాగా సల్మాన్ ఖాన్ నటించిన ‘వీర్‌’ సినిమాలోని సలామ్ ఆర్య పాటకు లింప్ సింక్ చేసిన వీడియోను తన ఇన్‌స్టాలో షేర్‌ చేసింది.

ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారి నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. కాగా ‘వీర్‌’ సినిమా 2010లో వచ్చింది. ఇందులో సల్మాన్ ఖాన్, జరీన్ ఖాన్ లీడ్ రోల్స్ చేశారు. హర్షాలి తాజాగా చేసిన ఈ వీడియోని 1.49 లక్షల మందికి పైగా లైక్ చేయగా, 20 లక్షల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘వెరీ క్యూట్‌’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

చదవండి: RRR: జక్కన్న భారీ ప్లాన్‌.. 1000 కోట్లే లక్ష్యం.. ప్రమోషన్స్‌కే రూ.20 కోట్లు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement