bajarangi bhaijaan
-
నెట్టింట హల్చల్ చేస్తున్న 'భజరంగీ భాయ్‌జాన్' చిన్నారి వీడియో
2015లో విడుదలైన 'భజరంగీ భాయ్‌జాన్' సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తన పాత్రతో ప్రేక్షకుల హృదయాల్ని కదిలించిన చిన్నారి మున్నీ పాత్ర గుర్తుందా? అదేనండి సల్మాన్ ఖాన్ భుజాల మీద వేసుకుని ఆడిపించుకునేవాడు, ఎంతో క్యూట్‌గా, అమాయకంగా కనిపించిన హర్షలి మల్హోత్రా. ఈ ఏడాది జూన్‌లో 13న తన పుట్టిన రోజు జరుపుకుని టీనేజ్‌లోకి అడుగుపెట్టిన హర్షలి... ఇటీవలే తన ఇన్‌స్టాగ్రామ్‌లో 15 లక్షల మంది ఫాలోయర్లను సంపాదించుకుని సోషల్‌మీడియాలో సెన్సేషన్‌గా మారుతోంది. తరచూ తన డాన్స్ వీడియోలతో నెట్టింట హల్చల్ చేస్తున్న హర్షలి తాజాగా సల్మాన్ ఖాన్ నటించిన ‘వీర్’ సినిమాలోని సలామ్ ఆర్య పాటకు లింప్ సింక్ చేసిన వీడియోను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారి నెట్టింట హల్చల్ చేస్తోంది. కాగా ‘వీర్’ సినిమా 2010లో వచ్చింది. ఇందులో సల్మాన్ ఖాన్, జరీన్ ఖాన్ లీడ్ రోల్స్ చేశారు. హర్షాలి తాజాగా చేసిన ఈ వీడియోని 1.49 లక్షల మందికి పైగా లైక్ చేయగా, 20 లక్షల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘వెరీ క్యూట్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram A post shared by Harshaali Malhotra (@harshaalimalhotra_03) చదవండి: RRR: జక్కన్న భారీ ప్లాన్.. 1000 కోట్లే లక్ష్యం.. ప్రమోషన్స్‌కే రూ.20 కోట్లు! -
ఆర్థిక సమస్యల్లో సీనియర్ నటి..‘బతకడం చాలా కష్టంగా ఉంది’
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో 2015లో విడుదలైన చిత్రం బజరంగీ బాయిజాన్. ఇండియా, పాకిస్థాన్ మధ్య ఓ సున్నితమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మూవీలో సల్మాన్‌తో కలిసి నటించిన ప్రముఖ నటి సునీత శిరోల్(85) అందరికి గుర్తుండే ఉంటుంది. ఈ సీనియర్ నటిని తాజాగా ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. 85 ఏళ్ల ఈ నటి కిడ్నీ ఇన్ఫెక్షన్లు, ఇతర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. సినిమాలతోపాటు టెలివిజన్‌లోనూ పనిచేసిన ఆమె ప్రస్తుతం బతకడమే కష్టంగా ఉందని, ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. చదవండి: Crazy Uncles: వివాదంలో శ్రీముఖి ‘క్రేజీ అంకుల్స్’! కాగా మూడు దశాబ్దాలుగా అటు బుల్లితెర, ఇటు వెండితెరపై తనదైన ముద్ర వేసుకున్నారు సునీత శిరోల్. కోవిడ్ ముందు వరకు తాను పనిచేశానని, అయితే అనేక ఆరోగ్య సమస్యల కారణంగా ఇకపై సినీ పరిశ్రమలో తన పనిని కొనసాగించలేనని సునీత వెల్లడించారు. ప్రస్తుతం ముంబైలోని నటి నూపూర్ అలంకార్ ఇంట్లో సునీత నివసిస్తున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. కరోనా వచ్చే ముందు వరకు నేను సినిమాలు, టీవీల్లో నటించానని, ఇప్పటి వరకు దాచుకున్న మొత్తాన్ని కోవిడ్ సమయంలో ఖర్చు చేశానన్నారు. దురదృష్టవశాత్తు, అదే సమయంలో తనకు మూత్రపిండాల ఇన్ఫెక్షన్, తీవ్రమైన మోకాలి నొప్పితో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందన్నారు. చదవండి: లవ్ యూ మరిది గారూ.. భావోద్వేగానికి గురైన సోనం ‘ఇదే కాకుండా రెండు ఆసుపత్రిలో పడిపోయాను. నా ఎడమకాలు విరిగింది. ఇకపై వంగలేను. గతంలో యాంజియోప్లాస్టీ చేయించుకున్నాను. ఇంకా అనేక ఇతరర వ్యాధులతో కూడా పోరాడుతున్నాను. నేను ప్రస్తుతం ఒక ఫ్లాట్‌లో పేయింగ్ గెస్ట్‌గా ఉంటున్నాను, కానీ నా దగ్గర డబ్బులు లేనందున వారికి మూడు నెలలగా అద్దె చెల్లించలేకపోయాను. ఆ సమయంలో నాకు సహాయం చేయడానికి సినీ, టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ముందుకొచ్చింది. నాకు సాయపడటానికి నటి నూపుర్ అలంకర్‌ను పంపారు. వారికి నేను కృతజ్ఙురాలిని. తను నన్ను ముంబైలోని వాళ్ల ఇంటికి తీసుకువచ్చింది. నా కోసం ఒక నర్సును కూడా నియమించింది.’ అని వెల్లడించారు. చదవండి: టక్ జగదీష్ ఓటీటీ రిలీజ్‌పై నాని కామెంట్స్ తనకున్న ఇతర ఆరోగ్య సమస్యల గురించి వివరిస్తూ.. ‘నేను నా పనిని మళ్లీ ప్రారంభించాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు డబ్బులు అవసరం. కానీ నా కాలు పరిస్థితి క్షీణిస్తోంది. నేను మళ్లీ నడవగలనో లేదో నాకు తెలియదు. నేను నా కాళ్లపై నేను నిలబడే వరకు నాకు ఆర్థిక సహాయం కావాలి. నా సంపాదనలో ఎక్కువగా నా భర్తతో కలిసి ఏర్పాటు చేసిన వ్యాపారంలో పెట్టుబడి పెట్టాను. అయితే గిడ్డంగిలో మంటలు చెలరేగడంతో అన్నీ కోల్పోయాము. అతనూ 2003లో తుదిశ్వాస విడిచాడు. కష్ట సమయం కోసం డబ్బు ఆదా చేయలేనందుకు, ముంబైలో సొంత ఇల్లు లేనందుకు ఎంతో బాధపడుతున్నాను’ అని భావోద్వేగానికి లోనయ్యారు. కాగా సునీల్ శిరోల్.. బజరంగీ బాయిజాన్, షాపిట్, ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్, మేడ్ ఇన్ చైనా, కిస్ దేస్ మే హాయ్ మేరా దిల్, శ్రీమతి కౌశిక్‌కి పాంచ్ బహుయిన్ వంటి అనేక సినిమాలతోపాటు టీవీ షోలలో పనిచేశారు. -
250 కోట్లు దాటిన బజరంగీ
సల్మాన్ ఖాన్ హీరోగా.. రంజాన్ కానుకగా వచ్చిన బజరంగీ భాయీజాన్ సినిమా కలెక్షన్ల రికార్డులు బద్దలుకొడుతోంది. రెండో వారానికే 250 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి సరికొత్త విజయాల దిశగా దూసుకెళ్తోంది. ఈ విషయాన్ని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఈ నెలంతా చాలా బాగుందని, బాహుబలి, బజరంగీ రెండు సినిమాలు బాగా ఆడాయని, ఇక దృశ్యం విడుదలైతే దాని విషయం చూడాల్సి ఉందని కూడా తరణ్ ఆదర్శ్ అన్నారు. ఆ సినిమాపై కూడా మంచి అంచనాలున్నాయి. తొలుత మళయాళంలో వచ్చిన దృశ్యం.. ఆ తర్వాత వివిధ భాషల్లోకి రీమేక్ అయినా అన్నిచోట్లా మంచి విజయాలు సాధించింది. దాంతో ఇప్పుడు హిందీలో అజయ్ దేవ్‌గణ్, శ్రియ జంటగా ఈ సినిమాను అదే పేరుతో తీస్తున్న విషయం తెలిసిందే. #BajrangiBhaijaan remains SUPER-STRONG. [Week 2] Fri 12.80 cr, Sat 19.25 cr, Sun 24.05 cr, Mon 9.30 cr. Total: ₹ 250.02 cr. ATBB. — taran adarsh (@taran_adarsh) July 28, 2015 -
బజరంగీ.. కలెక్షన్ల సునామీ
ఎస్ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథ అందించిన బాలీవుడ్ సినిమా బజరంగీ భాయీజాన్ రికార్డులు సృష్టిస్తోంది. కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే బాలీవుడ్‌లోని అనేక రికార్డులను అది బద్దలు కొట్టింది. భారతదేశంలో ఇప్పటివరకు రూ. 102.60 కోట్ల నెట్ వసూళ్లు, అలాగే ఓవర్సీస్లో కూడా 51 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. వందకోట్ల వసూళ్లు అత్యంత తక్కువ సమయంలో సాధించిన తొలి బాలీవుడ్ సినిమా ఇదేనని దీని గ్లోబల్ డిస్ట్రిబ్యూటర్ ఇరోస్ ఇంటర్నేషనల్ మీడియా తెలిపింది. అలాగే, విడుదలైన మూడోరోజు ఈ సినిమా సాధించిన రూ. 38.75 కోట్లు కూడా ఒకరోజు హిందీ సినిమాలు సాధించిన అత్యధిక కలెక్షన్ అని చెప్పింది. శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా మొత్తం 4,900 స్క్రీన్లలో విడుదలైన బజరంగీ భాయీజాన్ సినిమా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. సల్మాన్ ఖాన్ ఇప్పటివరకు నటించిన సినిమాలన్నింటిలోకీ దీనికే అత్యధిక వసూళ్లు వస్తాయని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే దబాంగ్, బాడీగార్డ్ రికార్డులు దాటిందని, ఇక దబాంగ్ 2, ఏక్ థా టైగర్, కిక్ సినిమాల వసూళ్లను దాటాల్సి ఉందని ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. సల్మాన్‌ఖాన్ ఫిల్మ్స్, రాక్‌లైన్ వెంకటేశ్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. -
సల్మాన్‌కు ఇన్ఫెక్షన్.. షూటింగుకు డుమ్మా!
కండల వీరుడు సల్మాన్‌ఖాన్ గత రెండు రోజులుగా చెవి ఇన్ఫెక్షన్, సైనసైటిస్‌తో బాధపడుతున్నాడట. ప్రస్తుతం 'బజరంగీ భాయీజాన్' సినిమా షూటింగు కోసం కాశ్మీర్లో ఉన్న సల్లూభాయ్.. గత రెండు రోజులుగా షూటింగుకు కూడా వెళ్లడం లేదట. సల్మాన్ ఖాన్ బాగా ఇబ్బంది పడుతున్నాడని, ప్రస్తుతం పెయిన్ కిల్లర్స్ వాడుతున్నాడని సినిమాకు సంబంధించిన ప్రతినిధులు చెప్పారు. కాశ్మీర్లో ఈ సినిమా షూటింగు షెడ్యూలు 40 రోజులు ఉంది. కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కరీనా కపూర్, నవాజుద్దీన్ సిద్దిఖీ కూడా నటిస్తున్నారు. రాక్‌లైన్ వెంకటేశ్‌తో కలిసి సల్మాన్ ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.