సల్మాన్కు ఇన్ఫెక్షన్.. షూటింగుకు డుమ్మా! | Infection kept Salman away from shooting in Kashmir | Sakshi
Sakshi News home page

సల్మాన్కు ఇన్ఫెక్షన్.. షూటింగుకు డుమ్మా!

Published Tue, Apr 21 2015 7:31 PM | Last Updated on Sun, Sep 3 2017 12:38 AM

సల్మాన్కు ఇన్ఫెక్షన్.. షూటింగుకు డుమ్మా!

సల్మాన్కు ఇన్ఫెక్షన్.. షూటింగుకు డుమ్మా!

కండల వీరుడు సల్మాన్ఖాన్ గత రెండు రోజులుగా చెవి ఇన్ఫెక్షన్, సైనసైటిస్తో బాధపడుతున్నాడట. ప్రస్తుతం 'బజరంగీ భాయీజాన్' సినిమా షూటింగు కోసం కాశ్మీర్లో ఉన్న సల్లూభాయ్.. గత రెండు రోజులుగా షూటింగుకు కూడా వెళ్లడం లేదట. సల్మాన్ ఖాన్ బాగా ఇబ్బంది పడుతున్నాడని, ప్రస్తుతం పెయిన్ కిల్లర్స్ వాడుతున్నాడని సినిమాకు సంబంధించిన ప్రతినిధులు చెప్పారు.

కాశ్మీర్లో ఈ సినిమా షూటింగు షెడ్యూలు 40 రోజులు ఉంది. కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కరీనా కపూర్, నవాజుద్దీన్ సిద్దిఖీ కూడా నటిస్తున్నారు. రాక్లైన్ వెంకటేశ్తో కలిసి సల్మాన్ ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement