చైల్డ్ ఆర్టిస్ట్ టూ హీరో.. 20 ఏళ్లు పూర్తి చేసుకున్న విశ్వ కార్తికేయ! | Child Actor Turned Hero Vishva Karthikeya Completes 20 Years In Tollywood | Sakshi
Sakshi News home page

Vishva Karthikeya: ఇండస్ట్రీలో 20 ఏళ్లు.. ఏకంగా పాన్ ఇండియా చిత్రం!

Published Tue, Sep 12 2023 6:41 PM | Last Updated on Tue, Sep 12 2023 7:05 PM

Child Actor Turned Hero Vishva Karthikeya Completes 20 Years In Tollywood - Sakshi

బాల నటుడిగా కెరీర్ ప్రారంభించిన నటుడు విశ్వ కార్తికేయ. ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఈ రోజుతో 20 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. బాలకృష్ణ, రాజశేఖర్, బాపు, రాజేంద్ర ప్రసాద్ స్టార్స్‌ వద్ద  చైల్డ్ ఆర్టిస్ట్‌గా పని చేశారు. బాలనటుడిగా దాదాపు 50కి పైగా చిత్రాల్లో నటించారు. గోరింటాకు, జానకి వెడ్స్ శ్రీరామ్, విష్ణు, లేత మనసులు, శివ శంకర్, అధినాయకుడు లాంటి చిత్రాల్లో కనిపించారు. అంతే తన నటనతో నంది, ఇతర అంతర్జాతీయ , ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అవార్డులు సొంతం చేసుకున్నాడు.

(ఇది చదవండి: అమల-నాగార్జున ప్రేమలో పడింది ఆ సినిమాతోనే!)

బాల్యనటుడిగానే కాదు.. జై సేన చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు విశ్వ కార్తికేయ. కళాపోషకులు, అల్లంత దూరాన వంటి సినిమాల్లో నటనతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం కలియుగం పట్టణంలో అంటూ ఓ ఇంటెన్స్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నాడు. నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ప్రొడక్షన్ అధినేతలు డా. కే. చంద్ర ఓబుల్ రెడ్డి, జీ మహేశ్వర రెడ్డి, కట్టం రమేష్  సంయుక్తంగా కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ఆయూషి పటేల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

రమాకాంత్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సింగిల్ షెడ్యూల్‌లోనే సినిమాను పూర్తి చేయబోతున్నారు.ఈ చిత్రానికి అజయ్ అరసాడ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సందర్భంగా విశ్వ కార్తికేయ 20 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో టీం అంతా కంగ్రాట్స్ తెలిపింది.

(ఇది చదవండి: పిచ్చి పిచ్చి నామినేషన్స్‌ ప్రాసెస్‌ కాదిక్కడ?.. ఓ రేంజ్‌లో రతిక ఫైర్!)

ఇవన్నీ ఇలా ఉంటే.. ఎన్త్‌ ‍అవర్ (Nth Hour) అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో విశ్వ కార్తికేయ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. యాక్షన్ అడ్వెంచర్‌గా రాబోతున్న ఈ మూవీ దర్శక నిర్మాణ బాధ్యతలను రాజు గుడిగుంట్ల తీసుకున్నారు. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement