దాదాపుగా 50కి పైగా చిత్రాల్లో బాలనటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు విశ్వ కార్తికేయ. జై సేన, కళాపోషకులు, అల్లంత దూరాన వంటి సినిమాలతో తనదైన నటనతో మెప్పించారు. ప్రస్తుతం కలియుగం పట్టణంలో అనే ఎమోషనల్ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో విశ్వ కార్తికేయకు జోడిగా ఆయుషి పటేల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగానే మరో ఇండోనేషియన్ ప్రాజెక్ట్‌లో వీరిద్దరు క్రేజీ ఆఫర్ పట్టేశారు.
‘శూన్యం చాప్టర్ -1’ అంటూ రాబోతోన్న ఈ మూవీలో హిందీ, ఇండోనేషియన్ భాషల్లోని నటీనటులు ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. అతీంద్రీయ శక్తుల కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రాబోతోంది. సిల్వర్ బ్లైండ్స్ (ఇండోనేషియా) బ్యానర్ మీద రాబోతోన్న ఈ మూవీకి దర్శక, నిర్మాణ బాధ్యతలను సీకే గౌస్ మోదిన్ నిర్వర్తిస్తున్నారు. ఉన్ని రవి (యూఎస్ఏ) కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. తెలుగు, హిందీ, బహస (ఇండోనేషియన్ భాష) భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది మార్చిలో సెట్స్ మీదకు వెళ్లనుంది.
Comments
Please login to add a commentAdd a comment