
విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ జంటగా నటించిన చిత్రం కలియుగం పట్టణంలో. ఈ సినిమాతో రమాకాంత్ రెడ్డి దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ బ్యానర్స్‌పై డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌లు ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ట్రైలర్ చూస్తే రాయలసీమ నంద్యాల ప్రాంతంలోని నల్లమల అటవీ ప్రాంతంలోని సంఘటనలతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ప్రధానంగా మదర్ సెంటిమెంట్‌తో పాటు సస్పెన్ష్ థ్రిల్లర్‌గా రూపొందించినట్లు అర్థమవుతోంది. నల్లమల ప్రాంతంలో జరిగే సస్పెన్ష్ సంఘటనలతో ట్రైలర్ చూపించారు. చివర్లో ‘ఏ యుగంలోనూ తల్లిని చంపే రాక్షసుడు ఇంకా పుట్టలేదమ్మా’ అని హీరో చెప్పే డైలాగ్.. ఇది కలియుగం అని కౌంటర్ చెప్పడం ఈ సినిమాపై ఆసక్తి పెంచుతోంది. ఈ సినిమా మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment