Kaliyugam Pattanamlo Movie
-
సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్ సినిమా
విశ్వ కార్తీక్, ఆయూషి పటేల్ జంటగా నూతన దర్శకుడు రమాకాంత్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో కందుల గ్రూప్ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి. మహేశ్వర రెడ్డి, కాటం రమేశ్ నిర్మించారు. ఈ సినిమా మార్చి 29న విడుదలైంది. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో చిన్న సినిమాగా ప్రేక్షకులముందుకు వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. అయితే, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సైలెంట్‌గా ఓటీటీలో రిలీజ్ చేశారు మేకర్స్. అమెజాన్ ప్రైమ్ వీడియోలో మే 23 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. పిల్లలను క్రమశిక్షణతో పెంచకపోతే వారు సొసైటీకి ఎలాంటి అనర్థాలు కలిగిస్తారో చాలా చక్కగా చెప్పాడు డైరెక్టర్. నేను శైలజ సినిమాలో కేజీ క్రేజీ ఫీలింగ్ అనే సాంగ్‌తో మెప్పించిన చిత్ర శుక్లా.. ఈ సినిమాలో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. ఎలాంటి బోరింగ్ లేకుంగా సాగే ‘కలియుగం పట్టణంలో’ కథను మీరు చూసేయండి. -
‘కలియుగం పట్టణంలో’ మూవీ రివ్యూ
టైటిల్: కలియుగం పట్టణంలో నటీనటులు: విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్, దేవీ ప్రసాద్, రూప లక్ష్మీ నిర్మాణ సంస్థ:నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ నిర్మాతలు: డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్ రచన-దర్శకత్వం: రమాకాంత్ రెడ్డి సంగీతం: అజయ్ సినిమాటోగ్రఫీ: చరణ్ విడుదల తేది: మార్చి 29, 2024 కథేంటంటే.. నంద్యాలకు చెందిన మోహన్(దేవీ ప్రసాద్), కల్పన(రూప లక్ష్మీ) దంపతులకు కవల పిల్లలు జన్మిస్తారు. పేర్లు విజయ్(విశ్వ కార్తికేయ), సాగర్(విశ్వ కార్తికేయ). వీరిద్దరిలో సాగర్‌కి చిన్నప్పటి నుంచే ఓ సైకాలజీకల్ ప్రాబ్లం ఉంటుంది. రక్త చూసి ఆనందపడుతుంటాడు. తన సైకో ప్రవర్తన చూసి భయపడిపోయిన మోహన్..అతన్ని మెంటల్ ఆస్పత్రిలో జాయిన్ చేస్తాడు. విజయ్ మాత్రం చక్కగా చదువుకుంటుంటాడు. కాలేజీలో శ్రావణి(ఆయుషి పటేల్) అతన్ని ఇష్టపడుతుంది. కానీ ఆ విషయాన్ని మూడేళ్ల పాటుగా విజయ్‌తో చెప్పలేకపోతుంది. మరోవైపు నంద్యాలలో వరుస హత్యలతో పాటు ఆడపిల్లలు బయటకు చెప్పుకోలేని ఘోరాలు జరుగుతుంటాయి. వాటి వెనుక ఉన్నదెవరో కనిపెట్టేందుకు పోలీస్ అధికారి (చిత్రా శుక్లా) నంద్యాలకు వస్తుంది. ఆమె కనిపెట్టిన విషయాలు ఏంటి? అమ్మాయిలపై అత్యాచారాలకు పాల్పడుతున్న దుండగులను చంపుతున్నదెవరు? హత్యలతో పాటు అక్కడ జరుగుతున్న మరో ఘోరం ఏంటి? సాగర్, విజయ్‌లలో ఎవరు మంచి వారు? నంద్యాలలో జరిగే ఘోరాలకు వీరికి ఉన్న సంబంధం ఏంటి? చివరకు పోలీసులు నంద్యాల క్రైంకి ఎలా చెక్ పెట్టారు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. తల్లిదండ్రులు పెంచే తీరుతోనే పిల్లలు ఎదుగుతారు. పెంపకం వల్లే పిల్లలు మంచివారుగా, చెడ్డవారుగా తయారవుతారు.ప్రతీ మనిషిలో సైకిక్ ఫీలింగ్ ఉంటుంది. కానీ తల్లిదండ్రుల పెంపకం వల్లే అది తగ్గుతుంది. ఇదే విషయాన్ని ‘కలియుగం పట్టణంలో’ చూపించాడు దర్శకుడు రమాకాంత్ రెడ్డి. దర్శకుడు ఓ మంచి పాయింట్‌ని ఎంచుకొని దాని చుట్టు ఆసక్తికరమైన కథను అల్లుకున్నాడు. ప్రతీ ఒక్క పాత్రకు డిఫరెంట్ షేడ్స్ ఉండేలా జాగ్రత్త పడ్డాడు. కానీ తెరపై తాను అనుకున్నది అనుకున్నట్లుగా చూపించడంలో కాస్త తడబడ్డాడు. సంబంధం సీన్లను చూపిస్తూ.. ఫస్టాఫ్ అంతా ప్రశ్నలు, చిక్కుముల్లతోనే సాగించాడు. నిజంగా నంద్యాలలో ఏం జరుగుతుంది? అనేది ప్రేక్షకుడికి కూడా ఫస్టాఫ్‌లో తెలియదు. ప్రతి పాత్రపై అనుమానం కలిగిస్తూ.. సెకండాఫ్‌పై ఆసక్తికలిగించేలా చేశాడు. ఫస్టాఫ్‌లోని ప్రశ్నలన్నింటికి సెకండాఫ్‌లో సమాధానం దొరుకుతుంది. ట్విస్టుల ఒక్కోటి రీవీల్ అవుతుంటే ప్రేక్షకుల మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. క్లైమాక్స్ ట్విస్టులు, రెండో పార్ట్ కోసం పెట్టుకున్న కథ బాగుంది. స్క్రీన్‌ప్లేను ఇంకాస్త బలంగా రాసుకొని, పేరున్న నటీనటులను పెట్టుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. విజయ్, సాగర్ పాత్రల్లో విశ్వ కార్తికేయ చక్కగా నటించాడు. రెండు విభిన్న పాత్రలో కనిపించిన రామ్.. ప్రతి పాత్రలోనూ వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు.ఆయుషి పటేల్ కి ఇది తొలి సినిమానే అయినా చక్కగా నటించింది. ఆమె పాత్ర ఇచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. పోలీసు అధికారిణిగా చిత్రా శుక్లా తొలిసారి డిఫరెంట్ రోల్ ప్లే చేసి ఆకట్టుకుంది. ఇక నరేన్ తన పాత్రలో అద్భుతంగా నటించేశాడు. దేవీ ప్రసాద్, రూప లక్ష్మి, అనీష్ కురువిల్ల ఇలా అన్ని పాత్రలు ఓకే అనిపిస్తాయి. టెక్నికల్ గా కలియుగం పట్టణంలో మెప్పిస్తుంది. అజయ్ పాటలు, అర్ అర్ సినిమాకి ప్లస్. చరణ్ సినిమాటోగ్రఫీ బాగుంది. మాటలు కొన్ని చోట్ల మెప్పిస్తాయి. ఆలోచింపజేస్తాయి. నిర్మాణ పరంగా సినిమా బాగుంటుంది. లైవ్ లొకేషన్స్ వల్ల ఫ్రేమ్స్ అన్నీ కూడా ఎంతో సహజంగా అనిపిస్తాయి. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారని అర్థం అవుతోంది. -
లిప్ లాక్, ఎక్స్పోజింగ్ వంటివి నచ్చవు: తెలుగు బ్యూటీ ఆయుషి పటేల్
-
కడపను సినిమాల్లో అలా చూపించారు.. కానీ: నరేన్ రామ్
విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. కొత్త కాన్సెప్ట్‌తో రాబోతోన్న ఈ మూవీకి రమాకాంత్ రెడ్డి దర్శకత్వం వహించారు. నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ బ్యానర్లపై డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌లు నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం చిత్రబృందం మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. ఈ సందర్భంగా ఈ సినిమాలో కీలక పాత్ర నరేన్ రామ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నరేన్ రామ మాట్లాడుతూ.. 'ఛాన్సుల కోసం వెతుకుతుండగా నన్ను పిలిచి మరి ఆఫర్ ఇప్పించారు. డైరెక్టర్ రమాకాంత్ రెడ్డి నా ప్రొఫైల్ చూసి ఓకే చెప్పారు. నా పాత్ర బాగుంటుంది. నాకు కథ నచ్చడంతోనే చేశాను. భవిష్యత్తులో ఈ డైరెక్టర్‌తో ఇంకా వర్క్ చేయాలని ఉంది. హీరో విశ్వ కార్తికేయ చైల్డ్ ఆర్టిస్ట్‌గా చాలా సినిమాలు చేశాడు. మా ఇద్దరి మధ్య కాంబినేషన్ సీన్స్ అయితే చాలా బాగా వచ్చాయి. హీరోయిన్ అయుషీ మంచి అమ్మాయి. ఇది ఒక థ్రిల్లర్ మూవీ. థియేటర్లో చూసి ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా షూటింగ్ కోసం నేను ఫస్ట్ టైం కడపకు వెళ్లా. చాలా వరకు అక్కడే షూట్ జరిగింది. సినిమాల్లో కడప అంటే ఫ్యాక్షన్ అలా చూపించారు. కానీ అక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. ప్రజలు కూడా బాగా సపోర్ట్ చేశారు' అని అన్నారు. కాగా.. నరేన్ రామ త్వరలోనే తెలుగులో WHO అనే సినిమాతో రాబోతున్నారు. తమిళంలో కొన్ని సినిమాలు ఆయన చేతిలో ఉన్నాయి. నరేన్ రామ సీనియర్ నటుడు గుమ్మడికి బంధువు. గుమ్మడి నరేన్‌కు తాతయ్య వరుస అవుతారు. అలా మొదట్నుంచి సినిమాల మీద ఆసక్తి ఏర్పడింది. తెలుగు వారైనా నరేన్ తల్లి తండ్రులు చెన్నైలో స్థిరపడటంతో అక్కడ తమిళ పరిశ్రమలో ప్రయత్నాలు మొదలుపెట్టారు. నరేన్ తమిళంలో మూడు సినిమాలు హీరోగా, ఒక సినిమాలో విలన్‌గా చేశారు. తెలుగులో కలియుగ పట్టణంలో సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. -
కలియుగం పట్టణంలో.. ఊరిపేరు కాదు, అప్పుడే సీక్వెలా?!
విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. కథ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలను రమాకాంత్ రెడ్డి చూసుకున్నారు. డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్ నిర్మించిన ఈ చిత్రం మార్చి 29న రాబోతోంది. దర్శకుడు రమాకాంత్ రెడ్డి ఆదివారం నాడు మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను తెలిపారు. నంద్యాల బ్యాక్‌డ్రాప్‌లో.. కలియుగం పట్టణంలో అంటే ఊరిపేరు కాదు. మనం కలియుగంలో ఉన్నాం. ఇప్పటి మనుషులు ఎలా ఉన్నారు, ఏంటనేది కథ. ఓ పట్టణంలో అక్కడి మనుషుల గురించి చూపిస్తాము. నంద్యాల దగ్గర్లో నల్లమల ఫారెస్ట్ ఉంటుంది. కథలో అడవికి, ఔషధ మొక్కలకు లింక్ ఉంటుంది. అందుకే నంద్యాల బ్యాక్‌డ్రాప్‌లో చేశాము. గతంలో నేను జాబ్ చేసేటప్పుడు బెంగుళూరు నుంచి బస్సులో ఊరికి వస్తుంటే ఓ గర్భవతి లేడీ సైకాలజీకి చెందిన బుక్ చదువుతుంది. గర్భవతికి చెప్పినా వినలేదు ప్రెగ్నెన్సీ సమయంలో ఇలాంటివి చదవకూడదని చెప్తే, ఆమె.. మేం ఏం చేయాలో మాకు తెలుసు అంది. ఇక నేను మాట్లాడలేదు. ట్రావెలింగ్ మొత్తం ఆమె ఆ బుక్ చదువుతూనే ఉంది. అప్పుడే ఈ కథ ఆలోచన వచ్చింది. అలాగే బయట పిల్లలు ఎలా పెరుగుతున్నారో ఇటీవల చూస్తున్నాం. దాంతో ఈ కథ రాసుకున్నాను. సినిమాల్లోకి ఎలా వచ్చానంటే? నేను డిగ్రీలో ఉన్నప్పుడు కర్నూల్ దగ్గర కోడి రామకృష్ణ గారు అరుంధతి సినిమా తీశారు. అప్పుడు షూటింగ్లో అసిస్టెంట్‌గా పనిచేశాను. అక్కడి నుంచి సినిమా ఇంట్రస్టు బాగా పెరిగింది. ఆ తర్వాత వైజాగ్‌లో చదువుకునేటప్పుడు సినిమాల్లో తిరిగాను. హైదరాబాద్ వచ్చి వెళ్తూ సినిమాల్లో ట్రై చేస్తూ, కొన్ని సినిమాలకు పనిచేశాను. అప్పుడే ఫిక్సయ్యా కరోనాలో ఫిక్స్ అయి కరోనా తర్వాత పూర్తిగా సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాను. కోడి రామకృష్ణ దగ్గర నుంచి ప్రయాణం మొదలుపెట్టి పలువురు దర్శకుల వద్ద పనిచేశాను. కొన్ని సినిమాలకు ఘోస్ట్ రైటర్‌గా వర్క్ చేశాను. కలియుగం పట్టణంలో సినిమాకు సీక్వెల్‌గా కలియుగ నగరంలో తీస్తున్నాను అని చెప్పుకొచ్చాడు. చదవండి: స్టేడియంలో సిగరెట్ తాగిన షారుక్.. వీడియో వైరల్ -
'మీకు నంద్యాల తెలుసు కదా'.. అక్కడేదో ఊహించనిది జరుగుతోంది..!
విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ జంటగా నటించిన చిత్రం కలియుగం పట్టణంలో. ఈ సినిమాతో రమాకాంత్ రెడ్డి దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ బ్యానర్స్‌పై డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌లు ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే రాయలసీమ నంద్యాల ప్రాంతంలోని నల్లమల అటవీ ప్రాంతంలోని సంఘటనలతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ప్రధానంగా మదర్ సెంటిమెంట్‌తో పాటు సస్పెన్ష్ థ్రిల్లర్‌గా రూపొందించినట్లు అర్థమవుతోంది. నల్లమల ప్రాంతంలో జరిగే సస్పెన్ష్ సంఘటనలతో ట్రైలర్ చూపించారు. చివర్లో ‘ఏ యుగంలోనూ తల్లిని చంపే రాక్షసుడు ఇంకా పుట్టలేదమ్మా’ అని హీరో చెప్పే డైలాగ్.. ఇది కలియుగం అని కౌంటర్ చెప్పడం ఈ సినిమాపై ఆసక్తి పెంచుతోంది. ఈ సినిమా మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
కలియుగం పట్టణంలో మూవీ.. ఆ సాంగ్ వచ్చేసింది!
విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతోన్న ఈ చిత్రాన్ని నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ బ్యానర్స్‌పై డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి నిర్మించారు. ఈ మూవీకి రమాకాంత్ రెడ్డి దర్శకత్వం చూసుకున్నారు. ప్రస్తుతం మూవీ విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ ప్రారభించింంది చిత్రబృందం. ఈక్రమంలోనే ఈ చిత్రం నుంచి వరుసగా పాటలు రిలీజ్ చేస్తున్నారు. మదర్ సెంటిమెంట్, లవ్ సాంగ్స్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా చంద్రబోస్ రాసిన గీతాన్ని మేకర్స్ రిలీజ్ చేశారు. కలియుగం పట్టణంలో టైటిల్ సాంగ్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ పాటను విజయ్ ప్రకాష్ ఆలపించారు. అజయ్ అరసాద అందించిన బాణీలు అందించారు. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. -
ఆకట్టుకుంటోన్న 'కలియుగం పట్టణంలో' సినిమా పాట
విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'కలియుగం పట్టణంలో'. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తీసిన ఈ చిత్రాన్ని డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి నిర్మిస్తున్నారు. కథ, డైలాగ్స్ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలను రమాకాంత్ రెడ్డి చూసుకుంటున్నారు. (ఇదీ చదవండి: పబ్‌లో హీరోయిన్ సాయిపల్లవి మాస్ డ్యాన్స్.. వీడియో వైరల్) మార్చి 22న రాబోతోన్న ఈ మూవీలో చిత్రా శుక్లా ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. ఇటీవలే విడుదల చేసిన మూవీ టీజర్ అందరినీ ఆకట్టుకుంది. టీజర్‌తో సినిమా మీద అంచనాలు రెట్టింపు అయ్యాయి. తాజాగా ప్రమోషన్స్ సందర్భంగా ఈ చిత్రంలోని మెలోడీ సాంగ్ రిలీజ్ చేశారు. 'నీ వలనే' అంటూ సాగే ఈ పాటను ఎం.ఎం.మానసీ ఆలపించారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన మూడు క్రేజీ సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) -
అమ్మ పాట రిలీజ్ చేసిన 'విశ్వంభర' డైరెక్టర్ వశిష్ట
విశ్వ కార్తిక్, ఆయూషి పటేల్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా 'కలియుగం పట్టణంలో'. చిత్రా శుక్లా కీలక పాత్రలో నటించారు. కందుల గ్రూప్ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీకి కథ, డైలాగ్స్ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలను రమాకాంత్ రెడ్డి చూసుకున్నారు. మార్చి 22న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'ఊరు పేరు భైరవకోన'.. స్ట్రీమింగ్ అప్పుడేనా?) ఈ సినిమాలోని 'జో జో లాలీ అమ్మ' అంటూ సాగే మదర్ సెంటిమెంట్ పాటని ప్రముఖ దర్శకుడు వశిష్ట రిలీజ్ చేశారు. పాట చాలా బాగుందని చిత్రయూనిట్‌ను అభినందించారు. సినిమా పెద్ద హిట్ అవ్వాలని యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు.. అవేంటో తెలుసా?) -
మార్చిలోనే ‘కలియుగం పట్టణం’
విశ్వ కార్తీక్, ఆయూషి పటేల్ జంటగా నూతన దర్శకుడు రమాకాంత్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ఆధ్వర్యంలో కందుల గ్రూప్ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి. మహేశ్వర రెడ్డి, కాటం రమేశ్ నిర్మించారు. ఈ సినిమాని మార్చి 22న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ‘‘సరికొత్త పాయింట్‌తో మంచి సందేశాన్ని ఇస్తూ కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రంగా ‘కలియుగం పట్టణంలో’ రూపొందింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి’’ అన్నారు నిర్మాతలు. చిత్రా శుక్లా ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రానికి సంగీతం: అజయ్ అరసాడ, కెమెరా: చరణ్ మాధవనేని. -
డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ‘కలియుగం పట్టణంలో’
విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ హీరో హీరోయిన్లుగా తాజా చిత్రం‘కలియుగ పట్టణంలో’. నాని మూవీ వర్క్స్ అండ్ రామా క్రియేషన్స్ పతాకంపై రమాకాంత్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ డాక్టర్ కె.చంద్ర ఓబుల్ రెడ్డి, జి మహేశ్వరరెడ్డి, కాటం రమేష్ లు కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ చిత్రం టైటిల్ లోగోని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అంజద్ బాషా చేతుల మీదగా రిలీజ్ చేయగా.. మంచి స్పందల లభించింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కడప జిల్లాలోని అందమైన లొకేషన్లలో జరుగుతోంది. ఒకే షెడ్యూల్లో ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేస్తామని నిర్మాతలు చెప్పారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ సినిమాను మేకర్లు రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు అజయ్ అరసాద సంగీతాన్ని అందిస్తుండగా.. చరణ్ మాధవనేని కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. గ్యారీ బీ.హెచ్. ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని మేకర్లు తెలిపారు.