విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. కొత్త కాన్సెప్ట్‌తో రాబోతోన్న ఈ మూవీకి రమాకాంత్ రెడ్డి దర్శకత్వం వహించారు. నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ బ్యానర్లపై డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌లు నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం చిత్రబృందం మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. ఈ సందర్భంగా ఈ సినిమాలో కీలక పాత్ర నరేన్ రామ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
నరేన్ రామ మాట్లాడుతూ.. 'ఛాన్సుల కోసం వెతుకుతుండగా నన్ను పిలిచి మరి ఆఫర్ ఇప్పించారు. డైరెక్టర్ రమాకాంత్ రెడ్డి నా ప్రొఫైల్ చూసి ఓకే చెప్పారు. నా పాత్ర బాగుంటుంది. నాకు కథ నచ్చడంతోనే చేశాను. భవిష్యత్తులో ఈ డైరెక్టర్‌తో ఇంకా వర్క్ చేయాలని ఉంది. హీరో విశ్వ కార్తికేయ చైల్డ్ ఆర్టిస్ట్‌గా చాలా సినిమాలు చేశాడు. మా ఇద్దరి మధ్య కాంబినేషన్ సీన్స్ అయితే చాలా బాగా వచ్చాయి. హీరోయిన్ అయుషీ మంచి అమ్మాయి. ఇది ఒక థ్రిల్లర్ మూవీ. థియేటర్లో చూసి ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా షూటింగ్ కోసం నేను ఫస్ట్ టైం కడపకు వెళ్లా. చాలా వరకు అక్కడే షూట్ జరిగింది. సినిమాల్లో కడప అంటే ఫ్యాక్షన్ అలా చూపించారు. కానీ అక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. ప్రజలు కూడా బాగా సపోర్ట్ చేశారు' అని అన్నారు.
కాగా.. నరేన్ రామ త్వరలోనే తెలుగులో WHO అనే సినిమాతో రాబోతున్నారు. తమిళంలో కొన్ని సినిమాలు ఆయన చేతిలో ఉన్నాయి. నరేన్ రామ సీనియర్ నటుడు గుమ్మడికి బంధువు. గుమ్మడి నరేన్‌కు తాతయ్య వరుస అవుతారు. అలా మొదట్నుంచి సినిమాల మీద ఆసక్తి ఏర్పడింది. తెలుగు వారైనా నరేన్ తల్లి తండ్రులు చెన్నైలో స్థిరపడటంతో అక్కడ తమిళ పరిశ్రమలో ప్రయత్నాలు మొదలుపెట్టారు. నరేన్ తమిళంలో మూడు సినిమాలు హీరోగా, ఒక సినిమాలో విలన్‌గా చేశారు. తెలుగులో కలియుగ పట్టణంలో సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment