కలియుగం పట్టణంలో.. ఊరిపేరు కాదు, అప్పుడే సీక్వెలా?! | Kaliyugam Pattanamlo Lo Movie Director Ramakanth Reddy Shares Interesting Facts, Deets Inside - Sakshi
Sakshi News home page

Kaliyugam Pattanamlo Lo: అలా చేయొద్దంటే గర్భవతి వినలేదు.. అప్పుడే ఈ కథకు నాంది పడింది!

Mar 24 2024 6:15 PM | Updated on Mar 24 2024 7:03 PM

Kaliyugam Pattanamlo Lo Movie Director Ramakanth Reddy Shares Interesting Facts - Sakshi

అరుంధతి సినిమా షూటింగ్‌లో అసిస్టెంట్‌గా పనిచేశాను. అక్కడి నుంచి సినిమా ఇంట్రస్టు బాగా పెరిగింది. ఆ తర్వాత వైజాగ్‌లో చదువుకునేటప్పుడు సినిమాల్లో తిరిగాను. హైదరాబాద్ వచ్చి వెళ్తూ సినిమాల్లో ట్రై చేస్తూ, కొన్ని

విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. కథ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలను రమాకాంత్ రెడ్డి చూసుకున్నారు. డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌‌ నిర్మించిన ఈ చిత్రం మార్చి 29న రాబోతోంది. దర్శకుడు రమాకాంత్ రెడ్డి ఆదివారం నాడు మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను తెలిపారు.

నంద్యాల బ్యాక్‌డ్రాప్‌లో..
కలియుగం పట్టణంలో అంటే ఊరిపేరు కాదు. మనం కలియుగంలో ఉన్నాం. ఇప్పటి మనుషులు ఎలా ఉన్నారు, ఏంటనేది కథ. ఓ పట్టణంలో అక్కడి మనుషుల గురించి చూపిస్తాము. నంద్యాల దగ్గర్లో నల్లమల ఫారెస్ట్ ఉంటుంది. కథలో అడవికి, ఔషధ మొక్కలకు లింక్ ఉంటుంది. అందుకే నంద్యాల బ్యాక్‌డ్రాప్‌లో చేశాము. గతంలో నేను జాబ్ చేసేటప్పుడు బెంగుళూరు నుంచి బస్సులో ఊరికి వస్తుంటే ఓ గర్భవతి లేడీ సైకాలజీకి చెందిన బుక్ చదువుతుంది. 

గర్భవతికి చెప్పినా వినలేదు
ప్రెగ్నెన్సీ సమయంలో ఇలాంటివి చదవకూడదని చెప్తే, ఆమె.. మేం ఏం చేయాలో మాకు తెలుసు అంది. ఇక నేను మాట్లాడలేదు. ట్రావెలింగ్ మొత్తం ఆమె ఆ బుక్ చదువుతూనే ఉంది. అప్పుడే ఈ కథ ఆలోచన వచ్చింది. అలాగే బయట పిల్లలు ఎలా పెరుగుతున్నారో ఇటీవల చూస్తున్నాం. దాంతో ఈ కథ రాసుకున్నాను. 

సినిమాల్లోకి ఎలా వచ్చానంటే?
నేను డిగ్రీలో ఉన్నప్పుడు కర్నూల్ దగ్గర కోడి రామకృష్ణ గారు అరుంధతి సినిమా తీశారు. అప్పుడు షూటింగ్‌లో అసిస్టెంట్‌గా పనిచేశాను. అక్కడి నుంచి సినిమా ఇంట్రస్టు బాగా పెరిగింది. ఆ తర్వాత వైజాగ్‌లో చదువుకునేటప్పుడు సినిమాల్లో తిరిగాను. హైదరాబాద్ వచ్చి వెళ్తూ సినిమాల్లో ట్రై చేస్తూ, కొన్ని సినిమాలకు పనిచేశాను.

అప్పుడే ఫిక్సయ్యా
కరోనాలో ఫిక్స్ అయి కరోనా తర్వాత పూర్తిగా సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాను. కోడి రామకృష్ణ దగ్గర నుంచి ప్రయాణం మొదలుపెట్టి పలువురు దర్శకుల వద్ద పనిచేశాను. కొన్ని సినిమాలకు ఘోస్ట్ రైటర్‌గా వర్క్‌ చేశాను. కలియుగం పట్టణంలో సినిమాకు సీక్వెల్‌గా కలియుగ నగరంలో తీస్తున్నాను అని చెప్పుకొచ్చాడు.

చదవండి: స్టేడియంలో సిగరెట్‌ తాగిన షారుక్‌.. వీడియో వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement