
విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ హీరో హీరోయిన్లుగా తాజా చిత్రం‘కలియుగ పట్టణంలో’. నాని మూవీ వర్క్స్ అండ్ రామా క్రియేషన్స్ పతాకంపై రమాకాంత్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ డాక్టర్ కె.చంద్ర ఓబుల్ రెడ్డి, జి మహేశ్వరరెడ్డి, కాటం రమేష్ లు కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ చిత్రం టైటిల్ లోగోని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అంజద్ బాషా చేతుల మీదగా రిలీజ్ చేయగా.. మంచి స్పందల లభించింది.
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కడప జిల్లాలోని అందమైన లొకేషన్లలో జరుగుతోంది. ఒకే షెడ్యూల్‌లో ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేస్తామని నిర్మాతలు చెప్పారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ సినిమాను మేకర్లు రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు అజయ్ అరసాద సంగీతాన్ని అందిస్తుండగా.. చరణ్ మాధవనేని కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. గ్యారీ బీ.హెచ్. ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని మేకర్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment