ఇటీవల ఓటీటీలు అద్భుతమైన కంటెంట్ అందిస్తున్నాయి. చిన్న సినిమాలైనా సరే కథ, కథనం బాగుంటే చాలు. ఇలాంటి సినిమాలే ఓటీటీల్లో దూసుకెళ్తున్నాయి. కొన్ని చిన్న చిత్రాలైతే థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. తెలుగులోనూ అలా విడుదలయ్యే ట్రెండ్ ఇప్పుడిప్పుడే మరింత ఊపందుకుంటోంది.
తాజాగా మరో టాలీవుడ్ సినిమా ఓటీటీలోనే విడుదలయ్యేందుకు సిద్ధమైంది. 35 చిన్న కథ కాదు హీరో విశ్వదేవ్ నటించిన లేటేస్ట్ మూవీ నీలి మేఘ శ్యామ. ఈ మూవీలో పాయల్ రాధాకృష్ణ హీరోయిన్‌గా కనిపించనుంది. రవి ఎస్ వర్మ డైరెక్షన్‌లో తెరకెక్కించిన ఈ చిత్రానికి అర్జున్-కార్తిక్ కథను అందించారు. ఈ చిత్రాన్ని రొమాంటిక్ కామెడీ మూవీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్. గతంలోనే అనౌన్స్ ఓటీటీకి వస్తుందని ప్రకటించిన చిత్రబృందం.. స్ట్రీమింగ్ తేదీని రివీల్ చేసింది. ఈ నెల 9వ తేదీ నుంచి ఆహాలో అందుబాటులోకి రానుందని ప్రకటించారు. ఈ మూవీకి సంబంధించిన టీజర్ చూస్తే లవ్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది.
కాగా.. ఈ సినిమాకు శరణ్ భరద్వాజ్ మ్యూజిక్ అందించాడు. మొదట థియేటర్లలో రిలీజ్ చేయడానికి చాలా రోజులు ప్రయత్నించినా.. తర్వాత నేరుగా ఓటీటీలోకి తీసుకురావాలని మేకర్స్ నిర్ణయించారు. ఇటీవల 35 చిన్న కథ కాదు మూవీతో మెప్పించిన విశ్వదేవ్ రాచకొండ ఇటీవల విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ మూవీలో నటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment