
బాలనటుడిగా పలు సినిమాల్లో నటించిన దీపక్ సరోజ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘సిద్ధార్థ్ రాయ్’. ఈ చిత్రాన్ని వి. యశస్వి దర్శకత్వంలో జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయిన నిర్మిస్తున్నారు.
రధన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘లైఫ్ ఈజ్ దిస్ బ్యూటిఫుల్..’ (జీవితం ఇంతందంగా ఉంది) అంటూ సాగేపాటని నిర్మాత ‘దిల్’ రాజు విడుదల చేసి,పాట బాగుందని యూనిట్‌ని అభినందించారు. వి. యశస్వి సాహిత్యం అందించిన ఈపాటని కార్తీక్, శ్రీనిషా జయశీలన్‌పాడారు. తన్వి నేగి, నందిని, ఆనంద్, కల్యాణీ నటరాజన్, మాథ్యూ వర్గీస్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్ కె. నాయుడు, లైన్ ప్రో డ్యూసర్: బి. శ్యామ్ కుమార్.