వృద్ధి విశాల్.. ఈ పాప పేరు వృద్ధి విశాల్. ఆరేళ్ల వయసుకే స్టార్ అయిపోయింది. ఇటు సీరియల్స్.. అటు సిరీస్‌తో బిజీ బిజీగా ఉంటున్న ఈ చిన్నారి పరిచయం బ్రీఫ్‌గా..
వృద్ధి విశాల్ సొంతూరు.. కేరళ, కోచీలోని కుంబళంగి. నాన్న.. విశాల్ కణ్ణన్, అమ్మ.. గాయత్రి విశాల్. ఇద్దరూ కొరియోగ్రాఫర్లే. వృద్ధికి ఒక తమ్ముడున్నాడు. పేరు.. విద్యుత్ విశాల్. ఓ పెళ్లి వేడుకలో ‘రాములో రాములా.., వాతి కమింగ్’ పాటలకు వృద్ధి చేసిన డ్యాన్స్‌తో ఆ అమ్మాయి పాపులర్ అయింది. ఆ ఫాలోయింగ్ ఈ బేబీకి వాణిజ్య ప్రకటనల్లో మెరిసే ఛాన్స్‌ను ఇచ్చింది. వాణిజ్య ప్రకటనలు సీరియల్స్, సినిమా అవకాశాలను తెచ్చిపెట్టాయి.
‘మంజిల్ విరింజ పువ్వు’ అనే సీరియల్ ద్వారా తొలిసారి బుల్లితెర మీద కనిపించింది. తర్వాత మలయాళ చిత్రం ‘సారా’తో వెండితెరపై రంగప్రవేశం చేసింది. ‘పీకాబు’, ‘2018’, ‘కడువా’ సినిమాల్లో నటించింది. తమిళ్ సినిమా ‘కాఫీ విత్ కాదల్’లోనూ యాక్ట్ చేసింది. ఇటీవలే ‘తీరా కాదల్’తో వెబ్‌తెర మీదా ఎంట్రీ ఇచ్చింది. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది.
చదవండి: చిరంజీవి కంటే ఐదు రెట్లు ఎక్కువ పారితోషికం అందుకున్న చంద్రమోహన్.. ఏ సినిమాకో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment