Child actress
-
హిట్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడేమో ట్రెండింగ్ క్వీన్‌గా గుర్తింపు (ఫోటోలు)
-
ఆరేళ్ల వయసుకే స్టార్‌గా మారిన చిన్నారి.. సినిమాలు, వెబ్‌సిరీస్‌తో బిజీ!
వృద్ధి విశాల్.. ఈ పాప పేరు వృద్ధి విశాల్. ఆరేళ్ల వయసుకే స్టార్ అయిపోయింది. ఇటు సీరియల్స్.. అటు సిరీస్‌తో బిజీ బిజీగా ఉంటున్న ఈ చిన్నారి పరిచయం బ్రీఫ్‌గా.. వృద్ధి విశాల్ సొంతూరు.. కేరళ, కోచీలోని కుంబళంగి. నాన్న.. విశాల్ కణ్ణన్, అమ్మ.. గాయత్రి విశాల్. ఇద్దరూ కొరియోగ్రాఫర్లే. వృద్ధికి ఒక తమ్ముడున్నాడు. పేరు.. విద్యుత్ విశాల్. ఓ పెళ్లి వేడుకలో ‘రాములో రాములా.., వాతి కమింగ్’ పాటలకు వృద్ధి చేసిన డ్యాన్స్‌తో ఆ అమ్మాయి పాపులర్ అయింది. ఆ ఫాలోయింగ్ ఈ బేబీకి వాణిజ్య ప్రకటనల్లో మెరిసే ఛాన్స్‌ను ఇచ్చింది. వాణిజ్య ప్రకటనలు సీరియల్స్, సినిమా అవకాశాలను తెచ్చిపెట్టాయి. ‘మంజిల్ విరింజ పువ్వు’ అనే సీరియల్ ద్వారా తొలిసారి బుల్లితెర మీద కనిపించింది. తర్వాత మలయాళ చిత్రం ‘సారా’తో వెండితెరపై రంగప్రవేశం చేసింది. ‘పీకాబు’, ‘2018’, ‘కడువా’ సినిమాల్లో నటించింది. తమిళ్ సినిమా ‘కాఫీ విత్ కాదల్’లోనూ యాక్ట్ చేసింది. ఇటీవలే ‘తీరా కాదల్’తో వెబ్‌తెర మీదా ఎంట్రీ ఇచ్చింది. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. View this post on Instagram A post shared by Vriddhi Vishal (@_vriddhi_) చదవండి: చిరంజీవి కంటే ఐదు రెట్లు ఎక్కువ పారితోషికం అందుకున్న చంద్రమోహన్.. ఏ సినిమాకో తెలుసా? -
'గంగోత్రి' బాలనటి హీరోయిన్గా 'మసూద'.. భయపెట్టేలా టీజర్
Masuda Teaser Launched By Natural Star Nani: ‘మళ్లీ రావా’, ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’ చిత్రాలతో సక్సెస్ఫుల్ బ్యానర్‌గా పేరు తెచ్చుకుంది స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్. ఈ ప్రొడక్షన్లో తెరకెక్కుతోన్న మూడో చిత్రం ‘మసూద’. ఇప్పటికే విడుదలైన టైటిల్ లుక్ పోస్టర్ మంచి రెస్పాన్స్ని సొంతం చేసుకోగా.. మంగళవారం (ఆగస్టు 2) నేచురల్ స్టార్ నాని ఈ చిత్ర టీజర్‌ని ఆవిష్కరించారు. ఈ టీజర్ ప్రామిసింగ్‌గా ఉందని, ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టి ఈ చిత్రంలో చేసినట్లుగా అనిపిస్తుందని, ఎప్పుడెప్పుడు సినిమాని చూద్దామా అని అనిపిస్తుందని నాని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. తొలి రెండు సినిమాలతో గౌతమ్ తిన్ననూరి, స్వరూప్‌లను టాలీవుడ్‌కు పరిచయం చేసిన నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా.. హర్రర్ డ్రామా జోనర్లో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంతో సాయికిరణ్ అనే మరో నూతన డైరెక్టర్ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. హీరోగా ‘జార్జిరెడ్డి’ ఫేమ్ తిరువీర్ (లలన్ సింగ్ పాత్రధారి) నటిస్తుండగా.. ‘గంగోత్రి’ చిత్రంలో బాలనటిగా అలరించిన కావ్య కల్యాణ్‌రామ్ ఈ చిత్రంతో హీరోయిన్గా పరిచయమవుతున్నారు. సీనియర్ నటి సంగీత అత్యంత ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. టీజర్ విడుదల సందర్భంగా నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా మాట్లాడుతూ.. ‘‘ముందుగా మా చిత్ర టీజర్‌ను విడుదల చేసిన నేచురల్ స్టార్ నానికి మా టీమ్ తరఫున ధన్యవాదాలు. ఆయనకు టీజర్ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మా సంస్థలో వస్తున్న ఈ మూడో చిత్రం కూడా ప్రేక్షకులను చక్కగా ఎంటర్టైన్ చేస్తుంది. ఈ చిత్రంతో సాయికిరణ్ అనే దర్శకుడిని పరిచయం చేస్తున్నాము. సాయికిరణ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించి తీరు.. ప్రేక్షకులందరినీ మెప్పిస్తుంది. చిత్రంలో నటించిన నటీనటులకు, అలాగే పనిచేసిన సాంకేతిక నిపుణులకు, సహకరించిన అందరికీ ధన్యవాదాలు. త్వరలోనే ఈ చిత్ర ట్రైలర్, అలాగే మూవీ విడుదలకు సంబంధించిన వివరాలను తెలియజేస్తాం’’ అని తెలిపారు. -
సంప్రదాయ సిరి
బాలనటిగా వెండితెరపై మెరిసి, సీరియల్ నటిగా బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకుంటుంది బ్యూటిఫుల్ గీతాంజలి. జీ తెలుగులో వస్తున్న ‘సూర్యవంశం’ సీరియల్లో ‘సిరి’గా టీవీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. కూచిపూడి నృత్యం అన్నా, చక్కని కథలన్నా, సంప్రదాయ దుస్తులన్నా ప్రాణం అంటూ గీతాంజలి పంచుకున్న కబుర్లు ఇవి. ‘చిన్నప్పుడు సినిమా చూసిన ప్రతీసారి నేనూ సినిమాలో కనిపిస్తా’ అని అమ్మనాన్నలతో చెప్పేదాన్ని. నా ఆసక్తి గమనించిన అమ్మ చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ పరిశ్రమకు పరిచయం చేసింది. అమ్మనాన్నల సపోర్ట్‌తో ‘మహాత్మ, మొగుడు, ఉయ్యాలా జంపాలా..’ వంటి సినిమాల్లో బాలనటిగా చేశాను. అలాగే టీవీ సీరియల్స్‌లోనూ బాలనటిగా చేశాను. ఇప్పుడు టీవీ ఆర్టిస్ట్‌గా మీ అందరికీ పరిచయం అయ్యాను. సింగిల్ రోల్ మొదట ‘అగ్నిపూలు’ సీరియల్లో లీడ్ రోల్ చేశాను. చాలా మంచి పేరొచ్చింది. ఇప్పుడు ‘సూర్యవంశం’లో సిరి పాత్రలో నటిస్తున్నాను. లంగా ఓణీ పాత్రల్లో పల్లెటూరి అమ్మాయిలా ఉండటం అంటే చాలా ఇష్టం. అలాంటి పాత్రలు వస్తే మాత్రం వదులుకోలేను. సంప్రదాయ బద్ధంగా ఉండే ఆ కాస్ట్యూమ్స్‌ని బాగా ఇష్టపడతా. అలాగే, అల్లరిగా గడుసుగా ఉండే అమ్మాయిలా నటించాలని ఉంది. ఇప్పుడు సీరియల్స్‌లోనూ ఇద్దరు–మగ్గురు హీరోయిన్లు ఉంటున్నారు. సింగిల్ హీరోయిన్ కథ వస్తే చేయాలనుంది. అలాగే అవకాశాలు వస్తే సినిమాల్లోనూ మంచి పాత్రల్లో నటించి పేరు తెచ్చుకుంటాను. చదువును వదల్లేదు ‘డ్యాన్స్ అంటే ఉన్న ఇష్టంతో కూచిపూడి నేర్చుకున్నాను. బాలనటిగా చేస్తూనే స్కూల్ చదువు పూర్తి చేశాను. ఆ తర్వాత వరుస షూటింగ్స్‌తో చదువు కుదరలేదు. అయినా, నేను చదువుకు దూరం కాలేదు. దూరవిద్య ద్వారా డిగ్రీ సెకండియర్ చదువుతున్నాను. పుట్టిపెరిగిందంతా హైదరాబాద్‌లోనే. నాన్న లోకేశ్వర్ బ్యాంక్ ఉద్యోగి. నాన్నది వైజాగ్ కానీ, హైదరాబాద్‌లోనే స్థిరపడ్డారు. అమ్మ అరుణ గృహిణి. తమ్ముడు చదువుకుంటున్నాడు. నేనీ రోజు ఇంత సంతోషంగా ఉన్నానంటే మా అమ్మనాన్నల సపోర్టే కారణం. సీరియల్స్ అంటే మొదట్లో అమ్మనాన్న అంతగా చూసేవారు కాదు. ఇప్పుడు నా ప్రతీ ఎపిసోడ్‌ని మిస్ కాకుండా చూస్తూ ఎంకరేజ్ ఏస్తారు. మార్పులు ఉంటే చెప్పేస్తారు. చిన్నమ్మాయి అన్నారు చైల్డ్ ఆరిస్ట్‌గా ఈ పరిశ్రమలోకి వచ్చాను కాబట్టి బయట యాక్టింగ్‌కి ఎలాంటి క్లాసులు తీసుకోలేదు. బాలనటిగా ఉన్న ఎక్స్పీరియన్స్ ఇప్పటికీ ఉపయోగపడుతుంది. అలాగని నా సొంత నటనే మీదనే పూర్తి నమ్మకం పెట్టుకోను. సీనియర్ ఆర్టిస్టుల నటన గమనిస్తూ ఉంటాను. వారిని చూసి నా నటనలో మార్పులు చేసుకుంటూ ఉంటాను. ‘సూర్యవంశం’ సీరియల్‌కి తీసుకున్నప్పుడు చిన్నమ్మాయిలా ఉన్నానని అన్నారు. కానీ, ఇప్పుడు నా నటన చూసి బెస్ట్ అంటున్నారు. ఈ సీరియల్స్‌లో ముగ్గురు అక్కచెల్లెళ్ల మధ్య స్టోరీ నడుస్తుంది. ఈ ముగ్గురిలో అక్క మీన కి నేను చెల్లెల్లిని. పేరు సిరి. చదువంటే చాలా ఇష్టం. బాగా చదివి కలెక్టర్‌ని అవ్వాలని సిరి కోరిక. అందుకు అక్క బాగా సాయం చేస్తుంటుంది. కానీ, అనుకోని పరిస్థితుల్లో సిరికి ఓ వ్యక్తితో పెళ్లవుతుంది. దీంతో సిరి అక్క, చెల్లితో విడిపోతుంది. అక్కకు దగ్గరవడం కోసం సిరి చాలా ప్రయత్నాలు చేస్తుంటుంది. సెట్స్‌లోనే కాదు బయట కూడా మేం ముగ్గురం కలిశామంటే ఫ్యామిలీ మెంబర్స్‌లా హడావిడి చేస్తాం. బెస్ట్ ఫ్రెండ్స్‌లా ఉంటాం. అక్కచెల్లెళ్లు లేని లోటు ఈ సీరియల్ ద్వారా తీరింది. – నిర్మలారెడ్డి -
మా మంచి వదినమ్మ
బాలనటిగా మురిపించింది. సినిమా నటిగా మెరిపించింది. టీవీ నటిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. కేరళ కుట్టి అయినా తెలుగమ్మాయే అనిపించింది. ఇప్పుడు తెలుగిళ్లలో ‘మా’టీవీ ద్వారా ‘వదినమ్మ’గా తన స్థానం సుస్థిరం చేసుకోనుంది. ఆ వదినమ్మ పేరు సుజిత. తీరైన కట్టూ బొట్టుతో.. నిండైన రూపంతో ఆకట్టుకుంటున్న సుజిత ‘సాక్షి’ పాఠకులతో పంచుకుంటున్న భావాలు ఇవి. ‘బాలనటిగా, నటిగా అన్ని భాషల సినిమాల్లోనూ చేశాను. కానీ, ఎక్కువ సినిమాలు చేసింది తెలుగులోనే. అలా తెలుగువారికి నేను బాగా కనెక్ట్ అయ్యాను. సినిమాల్లో చేసినా నన్ను ఇంటింటికీ చేరవేసింది మాత్రం ‘కలిసుందాం రా’ సీరియల్. అప్పడు నేను తొమ్మిదవ తరగతిలో చేరబోతున్నాను. ఆ సమయంలో బాలాజీ టెలీఫిలిమ్స్ నుంచి ఈ ఆఫర్ వచ్చింది. అంత చిన్న వయసులో కాలేజీ చదివే అమ్మాయిలా, ఆ తర్వాత భార్యగా, ఉమ్మడి కుటుంబంలో కోడలిగా.. లీడ్ రోల్ పోషించాను. వయసుకు మించి మెచ్యూరిటీ చూపించడం ఆ సీరియల్ నాకు నేర్పింది. ఇప్పుడు 30 ఫ్లస్‌లో ఎలా ఉన్నానో అలా ఆ వయసులోనే సీరియల్లో కనిపిస్తాను. సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి, కుటుంబసభ్యులతో ఎలా ఉండాలి... ఇలా ఎన్నో విషయాలను ఆ సీరియల్ నాకు నేర్పించింది. కాలేజీ చదువు మిస్ అయ్యాను స్కూల్ ఏజ్‌లోనే సీరియల్స్‌లోకి ఎంటర్ అయినప్పటికీ ఎప్పుడూ స్కూల్ డేస్‌ని మిస్ అవలేదు. అలా ప్లాన్ చేశారు అమ్మానాన్న. స్కూల్ ఉన్నప్పుడు క్లాస్‌కి, లేదంటే షూటింగ్‌కి అన్నట్టుగా ఉండేది. ఆ తర్వాత కాలేజీ చదువు మాత్రం రెగ్యులర్‌గా వెళ్లడం కుదరక మద్రాస్ యూనివర్శిటీ నుంచి ప్రైవేట్‌గా కట్టి చదివాను. మా చెల్లెలి కాలేజీ లైఫ్ చూశాక మాత్రం నేను కాలేజీ చదువుని, టీనేజ్ లైఫ్‌ని మిస్ అయ్యాను అని చాలా బాధపడ్డాను. టీవీ వదినమ్మ ‘పండియాన్ స్టోర్స్’ అని తమిళ్లో సీరియల్ చేస్తున్నాను. అది 200 ఎపిసోడ్స్ వైపుగా వెళుతూ మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సీరియల్‌ను తెలుగులో ‘వదినమ్మ’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ ఆఫర్ వచ్చినప్పుడు కొంచెం ఆలోచించాను. ఫ్యామిలీతో గడిపే సమయం తగ్గిపోతుందని. కానీ, ఈ విధంగా మరోసారి తెలుగువారికి దగ్గరకావచ్చు అనిపించింది. అదీ గాక వదినమ్మ రోల్ నన్ను బాగా ఆకట్టుకుంది. మన సంస్కృతి ప్రత్యేకత అంతా ఉమ్మడి కుటుంబంలోనే ఉంటుంది. అమ్మకు సమానంగా ఉంటుంది ఆ రోల్. ఆ కుటుంబం అంతా ఆమె చెప్పినట్టుగా వింటుంది. ‘వదినమ్మ’ సీరియల్లో వదిన పాత్ర పేరు ధనలక్ష్మి. పల్లెటూరిలో పుట్టిపెరిగిన అమాయకత్వం గల అమ్మాయి. కుటుంబం అంటే ఎంతో అభిమానం. సంప్రదాయ బద్ధంగా చీరకట్టు, పెద్ద బొట్టు, గాజులు.. చూడగానే దండం పెట్టాల్సినంత గౌరవంగా ఉంటుంది ఆ పాత్ర. రియల్ లైఫ్‌లో వదినమ్మ మా వారికి తోబుట్టువు ఒక్కరే. అది కూడా తనకు అక్క. మా ఆడపడుచు నాకు వదిన. అమ్మవాళ్లింట్లోనూ అన్నయ్య పెద్ద. (నవ్వుతూ) రియల్ లైఫ్‌లో వదినని కాలేకపోయాను. కానీ, వదిన రోల్ మాత్రం చాలా విలువైనది. వర్క్ – ప్యామిలీ బ్యాలెన్స్ పెళ్లికి ముందు ఒకే టైమ్‌లో 2–3 సీరియల్స్ చేసేదాన్ని. పెళ్లయ్యాక మాత్రం ఒకటే సీరియల్ చేస్తూ అది పూర్తయ్యాకనే మరోటి ఎంచుకుంటున్నాను. ఆ విధంగా నెలలో 10 రోజులు వర్క్‌కి, మిగతా 20 రోజులు ఫ్యామిలీకి అనుకున్నాను. ఇప్పుడు మా బాబు తన్విన్ యూకేజీ చదువుతున్నాడు. వర్క్ పేరుతో వాడిని మిస్ అవ్వకూడదు అనుకున్నాను. కానీ, ఇప్పుడు తమిళ్, తెలుగు సీరియల్స్ రెండింటి వల్ల వాడిని కొంచెం మిస్ అవుతున్నాను అనిపిస్తోంది. అయితే, ఈ విధంగా తెలుగు ప్రేక్షకులకు చేరువ అవుతున్నానని ఆనందంగా ఉంది. ఈ సీరియల్‌ని ఒప్పుకోవడానికి ముందు మా ఆయన ధనుష్‌తో, అమ్మతో మాట్లాడాను. బాబు పెద్దయి హయ్యర్ స్టడీస్‌కి వచ్చాక ఎలాగూ వాడికే కేటాయించాలి. అందుకే ఈ టైమ్‌లో ఇలా అవకాశాలు వస్తున్నాయి అనుకున్నాను. కోడలుగా అత్తగారితో మా అత్తగారు పూర్తిగా పల్లెటూరి వాతావరణం నుంచి వచ్చిన ఆవిడ. ఆమెనూ అమ్మ అనే పిలుస్తాను. ఆమెతో ఏదైనా సరే మాట్లాడటానికి మొహమాటపడను. ఇద్దరమూ చాలా బాగా ఉంటాం. నాకేదైనా నచ్చకపోతే వెంటనే చెప్పేస్తాను. మా అత్తగారు తమిళ్ సీరియల్స్ బాగా చూస్తారు. సలహాలు మాత్రం ఇవ్వరు. మా వారు మాత్రం నా డ్రెస్సింగ్ కలర్ కాంబినేషన్స్ గురించి చెబుతారు. మా వారు యాడ్ ఫిల్మ్ మేకర్. తన యాడ్ మేకింగ్‌లోనూ నా సజెషన్స్ ఉంటాయి. క్యాస్టింగ్ కౌచ్ దాదాపు నేను పుట్టిన దగ్గర నుంచి ఈ ఇండస్ట్రీలో ఉన్నాను. నాకంతా గ్రీన్‌గానే ఉంది. ఇండస్ట్రీ అద్దం లాంటిది. మనం ఎలా ఉంటే అది అలా చూపెడుతుంది. గౌరవం వదిలేసుకొని ఎవరూ గౌరవించడం లేదనుకోవడం కరెక్ట్ కాదు. ఇప్పుడున్న అమ్మాయిలకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. ఫైనాన్షియల్ పరంగానూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఉండే అవకాశాలు చాలా తక్కువ. ఇష్టాయిష్టాలు ఖాళీ సమయం దొరికితే సినిమా చూడటం బాగా ఇష్టం. ఎంత అలసటగా ఉన్నా సినిమా చూస్తే చాలు రీ ఫ్రెష్ అయిపోతాను. సినిమా తర్వాత లాంగ్ డ్రైవ్ అంటే పిచ్చి. నా లైఫ్ యాంబిషన్ ఈ లోకం చివరి అంచుల దాకా వెళ్లి చూడాలి. ట్రావెలింగ్ అంటే అంత ఇష్టం. ఇప్పటికి కొన్ని ప్లేస్లే చూశాను. ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి. ఎక్కడకైనా వెళితే నాకు ఫుడ్ ప్రాబ్లమ్ లేదు, వాతావరణం మార్పుల గురించి చింత లేదు. అందుకే టైమ్ దొరికితే ట్రావెలింగ్ వైపు మొగ్గు చూపుతాను.’ – నిర్మలారెడ్డి -
రమణీయ వాణి
1967లో బాల నటిగా పాల కడలిపై శేషతల్పమున నట జీవితం ప్రారంభించారు...కథానాయికగా ఏ దివిలో విరిసిన పారిజాతమో అనిపించారు...వయసుకు మించిన పెద్ద పాత్రలో నిన్ను కన్న కథ అంటూ ప్రేక్షకుల కంట తడి పెట్టించారు...వివాహానంతరం 1984 నుంచి అదృశ్యరూపంలో తన గొంతును వందల మంది కథానాయికలలో పలికించారు...గాయని అవుదామనుకున్నారు... కాని అదృశ్యవాణి అయ్యారు...ఆమె అలనాటి నటి శ్రీమతి రోజారమణి...తన అదృశ్య వాణి గురించి సాక్షితో అనేక విషయాలు ముచ్చటించారు...భక్త ప్రహ్లాదలో నటించి యాభై సంవత్సరాలు గడిచిన సందర్భంగా మీకు ముందుగా సాక్షి తరఫు నుంచి శుభాకాంక్షలు. డబ్బింగ్ ఆర్టిస్టుగా మీ కెరీర్ గురించి.... నా ఐదో ఏట నట జీవితం ప్రారంభించాను. బాలనటిగా, హీరోయిన్గా ఎన్నో సినిమాలు చేశాను. నేను డైలాగ్ చెప్పే విధానం బాగుంటుందని నాకు మంచి పేరు వచ్చింది. 1981లో వివాహానంతరం కొంతకాలం విరామం తీసుకున్నాను. అప్పట్లో నన్ను డబ్బింగ్ చెప్పమని చాలామంది అడిగారు. నా వాయిస్ వేరే వారికి ఇవ్వడం ఎందుకు అన్న స్వార్థం కొంతకాలం నన్ను డబ్బింగ్‌కు దూరంగా ఉంచింది. కాని ఆ గొంతుతో నన్ను నేను చూసుకోవచ్చు కదా అనుకున్నాను. ఆ సమయంలో అంటే 1984లో మురళీమోహన్ తీస్తున్న ‘నిర్దోషి’ చిత్రంలో ‘హీరోయిన్గా నటిస్తున్న సుహాసినికి డబ్బింగ్ చెప్పమని అడిగారు. ఓకే చెప్పాను. సుహాసినికి నా గొంతు సరిపోవడంతో, నన్ను కొనసాగించారు. అలా నేను సినిమాకు దూరం కాకుండా, కుటుంబం చూసుకుంటూ ఆనందంగా గడిపాను. చివరకు డబ్బింగ్ నా ప్రొఫెషన్ అయిపోయింది. డబ్బింగ్‌తో ఉండే సౌలభ్యం... సినిమా అంటే వందమందితో కలిసి చాలారోజులు పగలు రాత్రి తేడా లేకుండా, ఔట్‌డోర్ షూటింగ్ కూడా చేయాలి. డబ్బింగ్ అంటే ఒకటి రెండు రోజులు చెబితే ఒక సినిమా అయిపోతుంది. కమర్షియల్ అయితే రెండు రోజులు. హీరోయిన్ ఓరియెంటెడ్ అయితే మూడు రోజులు. డబ్బింగ్ విధానం నాడు – నేడు అప్పట్లో డిజిటల్ సిస్టమ్ లేదు కదా. టేప్ చేసిన రికార్డు వినిపించేవారు. సినిమాతో పాటు గొంతు వినిపించదు. ఇప్పుడు విధానం మారిపోయింది. ప్రతి డైలాగ్ చెప్పిన తరవాత ప్లే చేస్తారు. బాగుందో లేదో చూసుకుని, అవసరమైతే మార్చుకుంటాం. అందువల్ల గొంతు సరిపోయిందా లేదా చూసి సరిచేసుకోవచ్చు. మీరు డబ్బింగ్ చెప్పిన చిత్రాలు కథానాయికల వివరాలు... ఇప్పటికి సుమారు 500 చిత్రాలకు డబ్బింగ్ చెప్పాను. 32 సంవత్సరాల క్రితమే నా కెరీర్ ప్రారంభించాను. 20 సంవత్సరాల పాటు, బిజీగా నంబర్ ఒన్‌గా నిలిచాను. రిపీటెడ్ హీరోయిన్లు 100 మందిని తీసేసినా, మొత్తంగా 350 మంది కథానాయికలకు చెప్పాను. శోభన, రజని, యమున, రోజా, రాధిక, విజయశాంతి, రాధ, భానుప్రియ, రమ్యకృష్ణ, వాణీవిశ్వనాథ్, సౌందర్య, ఉత్తరాది వారికి చాలామందికి చెప్పాను. దివ్యభారుతి, దీప్తి భట్నాగర్, మీనాక్షి శేషాద్రి, మీనా, శిల్పాశెట్టి, ఖుష్బూ... చాలామందికి చెప్పాను. మీనాకు సుమారు పాతిక సినిమాలు చెప్పాను. డబ్బింగ్ ఆర్టిస్టుగా మీ అనుభవాలు... ‘చిన్నకోడలు చిత్రంలో నెల్లూరు యాసలో మాట్లాడినప్పుడు కొద్దిగా ఇబ్బంది పడ్డాను. కో డైరెక్టర్ నెల్లూరుకి చెందినవారు కావడంతో ఆయన చాలా బాగా నేర్పారు. పక్కా తెలుగుదనం ఉన్నా, స్టయిలిష్‌గా ఉన్నా సమస్య ఉండదు. నెల్లూరు, శ్రీకాకుళం, గోదావరి... వంటి యాసలు వచ్చిన ప్పుడు, రెండు మూడు డైలాగులు కష్టపడ్డాక, ఇంక ఇబ్బంది అనిపించదు. గొంతును ప్రొడ్యూస్ చేయడం నాకు చాలా ఇష్టం. అది నా మనసులో ఉండిపోయింది కానీ నేను డబ్బింగ్ చెబుతాననుకోలేదు. నాకు సరైన సమయంలో అవకాశం వచ్చింది. నా మనసులోనిలిచిపోయిన కొన్ని పాత్రలుు... మౌనపోరాటం (యమున),అంకురం (రేవతి), ఊర్మిళ (మాలాశ్రీ),కంటే కూతుర్నే కనాలి (రమ్యకృష్ణ),నిరీక్షణ (అర్చన), అల్లుడుగారు (శోభన),(సీతారామయ్యగారి మనవరాలు(మీనా)... ఇంకా చెప్పాలంటే 30 – 40 వస్తాయి. చిరంజీవి నటించిన ముగ్గురు మొనగాళ్లు చిత్రంలో నగ్మా, రమ్యకృష్ణ, రోజా ముగ్గురికీ చెప్పాను.. రమ్యకృష్ణకి బ్రాహ్మణ భాష, చాలా జాగ్రత్త పడ్డాను∙ ‘చిత్రం భళారే విచిత్రం’ చిత్రంలో నరేశ్‌కి, ‘ఓహోనా పెళ్లంట’ చిత్రంలో హరీష్‌కి చెప్పాను ∙‘కాశ్మోరా’ చిత్రంలో భానుప్రియకు గొంతు ఇచ్చాను. అందులో బాగా గట్టిగట్టిగా, పిచ్చిపిచ్చిగా అరుపులు కేకలు ఉంటాయి. ఆ డైలాగులకు కొంచెం ఇబ్బంది పడ్డాను ∙అన్వేషిత సీరియల్‌కి డబ్బింగ్ చెప్పాను ∙ భానుమతి తీసిన టెలీఫిల్మ్లో నటించాను ∙రేడియోలో మాట్లాడాను ∙కొన్ని ప్రమోషన్ల కోసం చిన్న చిన్న స్కిట్స్ వేసాను. – పురాణపండ వైజయంతి -
ఆ వీడియో..బాలనటికి కష్టాలు
-
ఆ వీడియో.. బాలనటికి కష్టాలు
త్రివేండ్రం, కేరళ : సినిమా ప్రమోషన్ల కోసం ప్రస్తుతం అందరూ సోషల్ మీడియాపై ఆధారపడుతున్నారు. మలయాళ బాలనటి మీనాక్షి(12) కూడా తన క్యారెక్టర్‌ను ప్రమోట్ చేసుకునేందుకు ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. అయితే, ఆ పోస్టు ఆమెకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. 1.1 నిమిషాల నిడివి గల ఈ వీడియోలో 2255 అనే నంబర్ ప్లేటు గల కారును నడుపుతున్న మీనాక్షి ఒక చోట ఆగి.. మోహన్‌లాల్ ఫేమస్ డైలాగ్ ‘ నా ఫోన్ నంబర్ 2255’ అంటూ ఆయన్ని అనుకరించేందుకు ప్రయత్నించారు. సుమారు ఒక లక్ష మంది ఈ వీడియోను వీక్షించారు. వీరిలో కొందరు మీనాక్షిని మెచ్చుకోగా.. చాలా మంది మాత్రం నువ్వు చేసింది కరెక్ట్ కాదంటూ కామెంట్ చేశారు. ‘నువ్వు మైనర్‌వి. ఇలాంటి వీడియోలు పోస్ట్ చేయడం వల్ల చట్టపరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ’ కొందరు సలహా ఇవ్వగా... ‘ఇలాంటి వీడియోలు ఇంకెప్పుడూ పోస్ట్ చేయకు.. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన నువ్వు ఇలా చేయడమేమిటి’ అంటూ మరొకరు కామెంట్ చేశారు. ‘రోడ్లపైనైనా ప్రైవేట్ లాండ్లోనైనా లైసెన్స్ లేకుండా కారు నడపడం నేరమంటూ.. మైనర్ కారు నడుపుతున్న వీడియోను ఎలా పోస్ట్ చేస్తారు. అయినా మీరెలా చట్టం నుంచి తప్పించుకోగలిగారని’ మరొకరు కామెంట్ చేశారు. దీంతో కంగుతిన్న మీనాక్షి వివరణ ఇచ్చారు. మ్యూజికల్ రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ‘మోహన్‌లాల్’ సినిమా ఏప్రిల్ 14న విడుదల కానుంది. గతంలో మోహన్‌లాల్ హీరోగా తెరకెక్కిన ఒప్పం (తెలుగులో కనుపాప) సినిమాలో బాలనటిగా కనిపించిన మీనాక్షి ప్రస్తుతం మోహన్ లాల్ పేరుతో తెరకెక్కుతున్న సినిమాలో నటించటం విశేషం. -
మా బావ నన్ను నటించొద్దన్నారు
మా బావ నన్ను నటించొద్దన్నారు. ఇలా చెప్పింది ఎవరో కాదు. ఒక నాడు ముద్దు ముద్దు మాటలతో ముచ్చటైన నటనతో నట కళామతల్లినే మురిపించి, బాల నటిగా జాతీయ అ వార్డు అందుకున్న నేటి అందాల భామ షామిలి. ఇక ఈమె అక్క ఎవరో, బావ ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటా. ఎస్.. నేటి ప్రముఖ నటుడు శాలిని భర్త అజిత్‌నే. షామిలిని నటించొద్దన్నారట. అయినా కథానాయికి గా నటించడానికి తయారవుతున్న షామిలి దీని గురించి చెబుతూ తాను ఓయ్ అనే ఒకే ఒక్క తెలుగు చిత్రం హీరోయిన్గా నటించాను. ఆ తరువాత ఎందుకు నటించలేదని చాలా మంది అడుగుతున్నారు. కారణం అంటూ పెద్దగా ఏమీ లేదు. నేను బాల్యం నుంచే నటించడం వల్ల పాఠశాల జీవితాన్ని కోల్పోయాను. అందుకే ఉన్నత చదువు కోసం విదేశాలకు వెళ్లాను. ఇటీవలే చెన్నైకి తిరిగి వచ్చాను. ఇప్పటికీ నేను నటించడం మా బావ అజిత్‌కు ఇష్టం లేదు. అయితే నటిస్తానన్న నా ఆసక్తిని తెలపగా ఆయన పచ్చజెండా ఊపడంతో పాటు స్వయంగా ఫొటోసెషన్ ఏర్పాటు చేసి తనే నన్ను ఫొటోలు తీశారు. నాకంతా అక్కా బావే. నా బాగోగులు చూసుకునేది వారే. నా హితవు కోరే బావ ముందు నటించవద్దన్నారు. ఆ తరువాత నా ఇష్టాన్ని గ్రహించి సమ్మతించారు. ప్రస్తుతం తొలిసారిగా తమిళంలో రెండు చిత్రాలను అంగీకరించాను. వాటిలో ఒకటి విక్రమ్‌ప్రభు సరసన వీరశివాజీ చిత్రం కా గా రెండోది ధనుష్‌కు జంటగా నటిస్తున్నాను. వీరశివాజీ పూర్తి వినోదభరిత కథా చిత్రం. నా పాత్రకు ప్రా ముఖ్యత ఉంటుంది. ఇక ధనుష్‌తో నటించే చిత్రం పొలిటికల్ అంశాలతో కూడినథ్రిల్లర్ కథా చిత్రం. ఇం దులోనూ నా పాత్ర చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంటుంది. అలాగే ఎలాంటి పాత్రలు చెయ్యాలనుకుంటున్నార ని అడుగుతున్నారు. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర ఏదయినా చెయ్యడానికి రెడీ. నేను గ్లామర్‌కు వ్యతిరేకిని కాను. అయితే స్కిన్ ఎక్స్ఫోజ్కు నేను దూరం. -
హీరోయిన్ కావడమే లక్ష్యం
బాలనటిగా రాణిస్తున్న అమలాపురం బాలిక 15 చిత్రాల్లో నటించి ప్రతిభ చూపిన శ్రీయవర్మ నాట్యంలో జాతీయస్థాయి అవార్డు కైవసం అమలాపురం టౌన్ : ఆ చిన్నారి నటన, నర్తనలను రెండు కళ్లుగా భావించి ఆ రెండు రంగాల్లో రాణించేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఆ ప్రయత్నంలో చాలా వరకూ సఫలమైంది. మరిన్ని ఉన్నత లక్ష్యాలు చేరాలని అటు నటనలో, ఇటు నర్తనలో శిక్షణ పొందుతోంది. అమలాపురం కె.అగ్రహారం రవీంద్రనగర్‌కు చెందిన శ్రీయవర్మ బాలనటిగా పలు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. కూచిపూడి నృత్యంలోనూ పురస్కారాలందుకుంటోంది. ఆక్వా రైతు సరిపెల్ల శ్రీరామరాజు, లక్ష్మీసౌమ్య దంపతుల కుమార్తె శ్రీయవర్మ ప్రస్తుతం ఏడో తరగతి చదువుతోంది. 12 ఏళ్ల ఆ పాప గత ఆరేళ్లుగా ఇప్పటివరకూ 15 సినిమాల్లో బాలనటిగా నటించింది. ‘మనసారా, కరెంట్, స్నేహితుడా, ఆ ఒక్కడు, శంఖం, ఏం పిల్లో... ఏం పిల్లడో, జయీభవ, నమో వెంకటేశ, శంభో శివ శంభో, డా ర్లింగ్, రాజన్న తదితర చిత్రాల్లో నటించింది. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన జాతీయ కూచిపూడి నృత్య పోటీల్లో సోలో విభాగంలో జాతీయస్థాయిలో ప్రథమ స్థానం సాధించింది. అమలాపురంలో శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన అభినందన సభలో శ్రీయ చేసిన నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. బహుముఖ ప్రతిభ శ్రీయ చదువులో చురుగ్గా ఉండడమే కాక పలు రంగాల్లోనూ ప్రతిభ చూపుతోంది. టెన్నిస్ క్రీడాకారిణిగా రాణిస్తోంది. స్విమ్మింగ్‌లోనూ దిట్టే. పలు ఈత పోటీల్లో పాల్గొని బహుమతులూ గెలుచుకుంది. శ్రీయ పలు యాడ్ ఫిలిమ్స్‌లోనూ నటించింది. బిగ్ బజార్, త్రిబుల్ ఎక్స్ సోప్, రావు బ్రదర్స్ చిట్‌ఫండ్స్, అపర్ణ సరోవర రియల్ ఎస్టేట్ యాడ్స్‌ల్లో మోడల్‌గా నటించింది. మా టీవీ ధారావాహికంగా ప్రసారం చేసిన ‘చిట్టి కథల చింటూ’ కార్యక్రమానికి యాంకరింగ్ చేసింది. 2010లో సెలికాన్ ఆంధ్ర జీనియస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. శ్రీదేవి అంటే ఇష్టం, హీరోయిన్ కావడమే లక్ష్యం తనకు అలనాటి అందాల తార శ్రీదేవి అంటే ఇష్టమని శ్రీయ చెప్పింది. బాలనటిగా శ్రీదేవి చిత్రాలు చూసే తనలా బాలనటి కావాలన్న ఆకాంక్షతో... మా అమ్మా నాన్న ప్రోత్సాహంతో చిత్రసీమలో అడుగు పెట్టానంది. భవిష్యత్‌లో హీరోయిన్ కావాలన్న లక్ష్యంతో ఉన్నానంది. అమ్మానాన్నల ప్రోత్సాహంతో హీరోయిన్ కాగలనన్న ధీమా వ్యక్తం చేసింది. ఎప్పటికైనా శోభానాయుడు అంతటి నృత్యకారిణి కావాలన్నదీ తన ధ్యేయమంటోంది.