మా బావ నన్ను నటించొద్దన్నారు | Ajit said not to act in movies | Sakshi
Sakshi News home page

మా బావ నన్ను నటించొద్దన్నారు

Published Tue, Sep 8 2015 4:35 AM | Last Updated on Sun, Sep 3 2017 8:56 AM

మా బావ నన్ను నటించొద్దన్నారు

మా బావ నన్ను నటించొద్దన్నారు

మా బావ నన్ను నటించొద్దన్నారు. ఇలా చెప్పింది ఎవరో కాదు. ఒక నాడు ముద్దు ముద్దు మాటలతో ముచ్చటైన నటనతో నట కళామతల్లినే మురిపించి, బాల నటిగా జాతీయ అ వార్డు అందుకున్న నేటి అందాల భామ షామిలి. ఇక ఈమె అక్క ఎవరో, బావ ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటా. ఎస్.. నేటి ప్రముఖ నటుడు శాలిని భర్త అజిత్‌నే. షామిలిని నటించొద్దన్నారట. అయినా కథానాయికి గా నటించడానికి తయారవుతున్న షామిలి దీని గురించి చెబుతూ తాను ఓయ్ అనే ఒకే ఒక్క తెలుగు చిత్రం హీరోయిన్‌గా నటించాను.

ఆ తరువాత ఎందుకు నటించలేదని చాలా మంది అడుగుతున్నారు. కారణం అంటూ పెద్దగా ఏమీ లేదు. నేను బాల్యం నుంచే నటించడం వల్ల పాఠశాల జీవితాన్ని కోల్పోయాను. అందుకే ఉన్నత చదువు కోసం విదేశాలకు వెళ్లాను. ఇటీవలే చెన్నైకి తిరిగి వచ్చాను. ఇప్పటికీ నేను నటించడం మా బావ అజిత్‌కు ఇష్టం లేదు. అయితే నటిస్తానన్న నా ఆసక్తిని తెలపగా ఆయన పచ్చజెండా ఊపడంతో పాటు స్వయంగా ఫొటోసెషన్ ఏర్పాటు చేసి తనే నన్ను ఫొటోలు తీశారు. నాకంతా అక్కా బావే.

నా బాగోగులు చూసుకునేది వారే. నా హితవు కోరే బావ ముందు నటించవద్దన్నారు. ఆ తరువాత నా ఇష్టాన్ని గ్రహించి సమ్మతించారు. ప్రస్తుతం తొలిసారిగా తమిళంలో రెండు చిత్రాలను అంగీకరించాను. వాటిలో ఒకటి విక్రమ్‌ప్రభు సరసన వీరశివాజీ చిత్రం కా గా రెండోది ధనుష్‌కు జంటగా నటిస్తున్నాను. వీరశివాజీ పూర్తి వినోదభరిత కథా చిత్రం.

నా పాత్రకు ప్రా ముఖ్యత ఉంటుంది. ఇక ధనుష్‌తో నటించే చిత్రం పొలిటికల్ అంశాలతో కూడినథ్రిల్లర్ కథా చిత్రం. ఇం దులోనూ నా పాత్ర చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంటుంది. అలాగే ఎలాంటి పాత్రలు చెయ్యాలనుకుంటున్నార ని అడుగుతున్నారు. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర ఏదయినా చెయ్యడానికి రెడీ. నేను గ్లామర్‌కు వ్యతిరేకిని కాను. అయితే స్కిన్ ఎక్స్‌ఫోజ్‌కు నేను దూరం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement