Shamli
-
పోలీసుల నీచ బుద్ధి.. యువతిపై ఇద్దరు కానిస్టేబుళ్ల అత్యాచారం
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో సభ్య సమాజం తలదించుకునే ఘటన చోటుచేసుకుంది. న్యాయం కోసం వచ్చిన వారికి రక్షణ కల్పించాల్సిన పోలీసులే నీచానికి పాల్పడ్డారు. చట్టాన్ని కాపాడల్సిన వారే వక్ర బుద్ధి చూపించారు. 23 ఓ ఏళ్ల యువతిపై ఇద్దరు పోలీసులు అత్యాచారానికి పాల్పడిన ఉదంతం షమ్లీ జిల్లాలో తాజాగా వెలుగు చూసింది. వివరాలు.. ఇమ్రాన్ మీర్జా అనే వ్యక్తి పిలిభిత్ జిల్లాలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి 2021 మార్చిలో ఫేస్బుక్ ద్వారా యువతి పరిచయమైంది. వీరి మధ్య స్నేహం పెరిగి ప్రేమగా మారింది. ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు హోటళ్లకు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం షమ్లీలో ఫ్లాట్ అద్దెకు తీసుకొని ఆమెకు వసతి కల్పించాడు. అయితే అక్కడ నివసించే సమయంలో మీర్జా సోదరుడు ఫుర్కాన్(కానిస్టేబుల్) కూడా తనపై అత్యాచారం చేశాడని యువతి ఆరోపించింది. ఇద్దరు సోదరులైన కానిస్టేబుళ్లు తనను రోజుల తరబడి నిర్భంధంలో ఉంచి అనేకసార్లు అత్యాచారానికి పాల్పడినట్లు బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేగాక రెండుసార్లు గర్భవతి కాగా.. బలవంతంగా అబార్షన్ చేయించినట్లు ఆరోపించింది. ఈ విషయాన్ని బయటికి చెప్పేందుకు ప్రయత్నించగా.. ఇమ్రాన్ తనను దారుణంగా కొట్టారని తెలిపింది. దీంతో రెండేళ్ల నుంచి వారి అరాచకాలు భరిస్తూ మైనంగా ఉన్నట్లు చెప్పింది. ఇటీవల కామాంధుడి వేధింపులు ఎక్కువయ్యాయని, తరుచూ తనపై చేయిచేసుకున్నట్లు తెలపింది. ఈ క్రమంలోనే వారిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకొని.. కేసు నమోదు చేసినట్లు పేర్కొంది.. అయితే ఇప్పుడు కూడా కేసును ఉపసంహరించుకోవాలని ఇమ్రా,న్ అతని సోదరుడు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు వాపోయింది. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పిలిభిత్ ఎస్పీ అతుల్ శర్మ తెలిపారు. ఇద్దరు కానిస్టేబుళ్లు దోషులుగా తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చదవండి: రోడ్డు ప్రమాదంలో ఎస్సై, డ్రైవర్ దుర్మరణం.. -
దారుణం.. మామిడిపండు అడిగిందని గొంతుకోసి..
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ శామ్లీలోని ఖేడా కుర్‌తార్ గ్రామంలో అత్యంత దారుణ ఘటన జరిగింది. అన్నం తినే సమయంలో మామిడిపండు అడిగిందనే కారణంతో ఐదేళ్ల మేనకోడల్ని దారుణంగా హత్య చేశాడు ఓ వ్యక్తి. ఆమె పదే పదే మామిడిపండు కావాలని అడుగుతుందని చిరాకుపడి ఈ కిరాతక చర్యకు పాల్పడ్డాడు. మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో నిందితుడు మొదట చిన్నారి తలపై రాడ్డుతో కొట్టాడు. ఆ తర్వాత కత్తితో ఆమె గొంతు కోశాడు. శవాన్ని సంచిలో చుట్టి ఇంట్లోనే దాచాడు. పాప కన్పించకపోయేసరికి గ్రామస్థులంతా ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. నిందితుడు కూడా ఏమీ తెలియన్నట్లు వారితో కలిసి పాపను వెతుకుతున్నట్లు నటించాడు. అయితే చిన్నారి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారికి నిందితుడిపై అనుమానం వచ్చింది. దీంతో అతడు గ్రామం వదిలి పారిపోయాడు. అతని ఇల్లు వెతికిన పోలీసులకు సంచిలో బాలిక మృతదేహం లభించింది. పోలీసులు నిందితుడి కోసం ముమ్మర గాలింపు చేపట్టి గురువారం రాత్రి ఓ అడవి సమీపంలో అరెస్టు చేశారు. ఈ దారుణ ఘటనలో హత్యకు గురైన చిన్నారి పేరు ఖైరు నిషా.. కాగా నిందితుడి పేరు ఉమర్దీన్ అని పోలీసులు తెలిపారు. చదవండి: ఎన్నో కలలు..మరెన్నో ఆశలు.. పెళ్లై ఏడు నెలలు తిరగక ముందే.. -
పోలింగ్ కేంద్రం వద్ద గాల్లోకి కాల్పులు
లక్నో: పోలింగ్ కేంద్రంలో చెలరేగిన ఘర్షణను తగ్గించడానికి సరిహద్దు భద్రతా సిబ్బంది గాలిలోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని షమ్లీ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మొదటి దశ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా షమ్లీ జిల్లా గుర్జాన్ గ్రామంలోని గురువారం పోలింగ్ జరిగింది. పోలింగ్ జరుగుతుండగా.. మధ్యాహ్నం 12 గంటల సమయంలో కొందరు వ్యక్తులు పోలింగ్ కేంద్రంలోకి చొచ్చుకుని వచ్చారు. ఓటరు ఐడీ లేకపోయినప్పటికీ వారు ఓటు వేసేందుకు ప్రయత్నించడంతో అధికారులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆందోళనకారులకు, అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కొద్దిసేపటికే ఈ గొడవ తీవ్రస్థాయికి చేరింది. దీంతో పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి బీఎస్ఎఫ్ జవాన్లు గాలిలో 5 రౌండ్లపాటు కాల్పులు జరిపారు. ఆందోళనకారులను చెదరగొట్టిన అనంతరం అక్కడ పోలింగ్ తిరిగి ప్రారంభమైంది. పోలింగ్ అధికార్లకు, ఆందోళనకారుల మధ్య వివాదం చాలసేపటి నుంచి ఉద్రిక్తత కొనసాగుతుండటంతోనే బీఎస్ఎఫ్ జవాన్లు గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చిందని జిల్లా ఎస్పీ అజయ్ కుమార్ తెలిపారు. -
బావ నన్ను ఒక్క చాన్స్ అడిగారు
మా బావ అజిత్ ఒక చాన్స్ ఇప్పించమని నన్ను అడిగారు అని ఆయన మరదలు, నటి షాలిని చెల్లెలు షామిలి అన్నారు. అజిత్ ఏమిటీ షామిలిని అవకాశం అడగడం ఏమిటి? కాస్త విడ్డూరంగా ఉంది కదూ! ఆ మతలబు ఏమిటో చూద్దామా. షామిలి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం అని అనుకోవడం లేదు. కారణం బాల నటిగానే అబ్బుర పరచిన లిటిల్‌స్టార్ తాజాగా కథానాయకి అవతారమెత్తుతున్న షామిలి. అయితే ఇంతకు ముందే తెలుగులో ఓయ్ అంటూ కథానాయకిగా పలకరించి సుమారు ఐదేళ్ల తరువాత తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో కథానాయకిగా మూడు చిత్రాల్లో నటిస్తూ నటనకు అంకితం అయిన షామిలితో చిన్న భేటీ... ప్ర: కథానాయికిగా తెలుగు చిత్రంలో మెరిసి ఆ తరువాత మాయం అయ్యారే? జ: ఆ మాయం అయిన కాలాన్ని సింగపూర్‌లో విద్యాభ్యాసం కోసం వెచ్చించాను. విస్కామ్ పూర్తి చేసిన తరువాత అదే రంగంలో ఉన్నత విద్యను చదవాలని ఆశించాను. కుటుంబ సభ్యులు ఆశీర్వదించి సింగపూర్ పంపారు. అక్కడ చదువు పూర్తి చేసి ఇటీవలే చెన్నైకి తిరిగొచ్చాను. ప్ర: అంత చదివి మళ్లీ నటనకే వచ్చారే? జ: నేను బాల తారగానే జాతీయ అవార్డును గెలుచుకున్న నటిని. అదే విధంగా అతి పిన్న వయసులోనే ఇన్‌కంటాక్స్ కట్టిన బాల నటిని బహుశ నేనే అనుకుంటా. అప్పట్లో చదువు కోసం నటనకు దూరం అవ్వాలని నిర్ణయించుకున్నా పలు అవకాశాలు వచ్చాయి. చదువు విజ్ఞానానికి నటన ఇష్టానికి అన్నది నా పాలసీ. చదువు పూర్తి అయింది. ఇప్పుడు ఇష్టమైన నటనకు సిద్ధమయ్యాను. ఇకపై ఎలాంటి కమిట్మెంట్స్ లేవు. నటన..నటన..నటనే ప్ర: మీ కథానాయకులు ధనుష్, విక్రమ్ప్రభులో పోలికలు? జ: అసలు వారిని ఎందుకు పోల్చాలి? వారిద్దరూ కేరీర్లో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. ఇక్కడ మీకో విషయం చెప్పాలి. విక్రమ్‌ప్రభు చెల్లెలు నా క్లాస్మేట్. అందువల్ల శివాజీ కుటుంబంతో నాకు కొంచెం సాన్నిహిత్యం ఉంది. ప్ర: ఏ హీరోతో నటించాలని ఆశిస్తున్నారు? జ; నటి అన్న తరువాత ఏ హీరోతో అయినా నటించడానికి సిద్ధం కావాలి. పాత్ర స్వభావాన్ని అర్థం చేసుకుని అంకితభావంతో నటించడానికి కృషి చేయాలి. ప్ర: అత్యంత అభిమానగణం కలిగిన మీ బావ అజిత్ గురించి? జ: అందరు అభిమానులకు మాదిరిగానే ఆయన నాకు తల నే. మా బావ ఫొటోగ్రఫీ కళ గురించి ఇప్పుడు మీడియా ప్రచారం చేస్తోంది గానీ దీనా చిత్ర షూటింగ్ సమయంలోనే ఆ చిత్ర చాయాగ్రాహకుడు అరవిందన్ ఒక కెమెరాను బహుమతిగా ఇచ్చారు. అప్పటి నుంచి బావకు ఫొటోగ్రఫీపై ఆసక్తి పెరిగింది. ఈ మధ్య కూడా మా కుటుంబ సన్నిహితురాలు సుహాసిని అనే 90 ఏళ్ల బామ్మ ఫొటోను అద్భుతంగా తీశారు. ఇటీవలే శ్రుతిహాసన్, అప్పుకుట్టి తదితర సహ నటీనటులను తన కెమెరాలో బంధించారు. అంతెందుకు నేను నటిస్తున్నానన్న విషయం తెలియగానే వచ్చేసి నాకు ఫొటో సెషన్ చేసే అవకాశం ఇవ్వాలని నన్ను అడిగారు. నా లేటెస్ట్ ఫొటో ఆల్బమ్‌లో మా బావ తీసిన ఫొటోలే ఉన్నాయి. ప్ర: చివరి ప్రశ్న గ్లామర్ గురించి? జ: నన్ను చూసి కూడా ఇలాంటి ప్రశ్నా? నా విషయంలో గ్లామర్ చాన్సేలేదు. నాదీ అక్క బాటే. -
మా బావ నన్ను నటించొద్దన్నారు
మా బావ నన్ను నటించొద్దన్నారు. ఇలా చెప్పింది ఎవరో కాదు. ఒక నాడు ముద్దు ముద్దు మాటలతో ముచ్చటైన నటనతో నట కళామతల్లినే మురిపించి, బాల నటిగా జాతీయ అ వార్డు అందుకున్న నేటి అందాల భామ షామిలి. ఇక ఈమె అక్క ఎవరో, బావ ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటా. ఎస్.. నేటి ప్రముఖ నటుడు శాలిని భర్త అజిత్‌నే. షామిలిని నటించొద్దన్నారట. అయినా కథానాయికి గా నటించడానికి తయారవుతున్న షామిలి దీని గురించి చెబుతూ తాను ఓయ్ అనే ఒకే ఒక్క తెలుగు చిత్రం హీరోయిన్గా నటించాను. ఆ తరువాత ఎందుకు నటించలేదని చాలా మంది అడుగుతున్నారు. కారణం అంటూ పెద్దగా ఏమీ లేదు. నేను బాల్యం నుంచే నటించడం వల్ల పాఠశాల జీవితాన్ని కోల్పోయాను. అందుకే ఉన్నత చదువు కోసం విదేశాలకు వెళ్లాను. ఇటీవలే చెన్నైకి తిరిగి వచ్చాను. ఇప్పటికీ నేను నటించడం మా బావ అజిత్‌కు ఇష్టం లేదు. అయితే నటిస్తానన్న నా ఆసక్తిని తెలపగా ఆయన పచ్చజెండా ఊపడంతో పాటు స్వయంగా ఫొటోసెషన్ ఏర్పాటు చేసి తనే నన్ను ఫొటోలు తీశారు. నాకంతా అక్కా బావే. నా బాగోగులు చూసుకునేది వారే. నా హితవు కోరే బావ ముందు నటించవద్దన్నారు. ఆ తరువాత నా ఇష్టాన్ని గ్రహించి సమ్మతించారు. ప్రస్తుతం తొలిసారిగా తమిళంలో రెండు చిత్రాలను అంగీకరించాను. వాటిలో ఒకటి విక్రమ్‌ప్రభు సరసన వీరశివాజీ చిత్రం కా గా రెండోది ధనుష్‌కు జంటగా నటిస్తున్నాను. వీరశివాజీ పూర్తి వినోదభరిత కథా చిత్రం. నా పాత్రకు ప్రా ముఖ్యత ఉంటుంది. ఇక ధనుష్‌తో నటించే చిత్రం పొలిటికల్ అంశాలతో కూడినథ్రిల్లర్ కథా చిత్రం. ఇం దులోనూ నా పాత్ర చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంటుంది. అలాగే ఎలాంటి పాత్రలు చెయ్యాలనుకుంటున్నార ని అడుగుతున్నారు. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర ఏదయినా చెయ్యడానికి రెడీ. నేను గ్లామర్‌కు వ్యతిరేకిని కాను. అయితే స్కిన్ ఎక్స్ఫోజ్కు నేను దూరం. -
విక్రమ్‌ప్రభుతో షామిలి రొమాన్స్
15 ఏళ్ల క్రితం నట బాల మేధావిగా ప్రశంసలు అందుకున్న షామిలి గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అమెరికాలో సినిమాకు సంబంధించిన విద్య నభ్యసించిన నటి షాలిని చెల్లలు. అజిత్ మరదలు షామిలి గురించి కచ్చితంగా చెప్పుకోవాలి. కారణం కోలీవుడ్‌లో హీరోయిన్గా ఆమె తెరంగేట్రం విషయమై సమీప కాలంలో చాలా రకాలుగా ప్రచారం జరుగుతోంది.15 ఏళ్ల క్రితం నటించిన కండుకొండేన్ కండుకొండేన్ బాల నటిగా షామిలి చివరి చిత్రం. ఆ తరువాత ఆమె కోలీవుడ్‌లో నటించలేదు. అయితే కథానాయకిగా తెలుగులో ఓయ్ అనే చిత్రంతో పరిచయం అయ్యారు. హీరోయిన్గా షామిలి ఏకైక చిత్రం అదొక్కటే. ఈ మధ్యనే అమెరికా నుంచి తిరిగొచ్చిన ఈ బ్యూటీ నటించడానికి రెడీ అనడంతో చాలా మంది తమిళ చిత్ర దర్శక నిర్మాతలు తమ చిత్రాల్లో నటింపజేయడానికి ప్రయత్నాలు మొదలెట్టారు. ఇక తాజా సమాచారం ఏమిటంటే సక్సెస్ చిత్రాల యువ నటుడు, మహా నటుడు శివాజీగణేశన్ మనవడు, ప్రభు వారసుడు విక్రమ్‌ప్రభుతో జత కట్టడానికి షామిలి సిద్ధం అవుతున్నారన్నది. దీనికి వీరశివాజీ అనే పేరును నిర్ణయించినట్లు సమాచారం. ఇంతకు ముందు తగరారు చిత్రాన్ని తెరకెక్కించిన గణేశ్వినయన్ ఈ చిత్రానికి దర్శకత్వం బాధ్యతల్ని చేపట్టనున్నారు. కామెడీ,యాక్షన్ ప్రధానాంశాలుగా రూపొందనున్న ఈ చిత్రానికి చాయాగ్రహణాన్ని సుకుమార్, కళాదర్శకత్వాన్ని ఇళయరాజా,కూర్పు బాధ్యతన్ని రూబెన్ నిర్వహించనున్నారు. -
విశాల్‌కు జంటగా షామిలి
తమిళసినిమా: నటుడు విశాల్ నూతన చిత్రంలో ఆయనకు జంటగా నటుడు అజిత్ మరదలు, షాలిని చెల్లెలు షామిలి నటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. విశాల్ ప్రస్తుతం పాయుమ్ పులి చిత్రాన్ని పూర్తి చేసి దర్శకుడు పాండిరాజ్ దర్శకత్వంలో నటిస్తున్నారు. తదుపరి లింగసామి దర్శకత్వంలో సండైకోలి 2 చిత్రంతో నటించనున్నారు. ఇందులో హీరోయిన్గా తమన్న, నయనతార పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా నటి షామిలి పేరు తెరపైకి వచ్చింది. ఆమె విదేశాల్లో సినిమాకు సంబంధించిన కోర్స్ చదివి ఇటీవలే చెన్నైకి తిరిగొచ్చారు. మళ్లీ నటించడానికి సిద్ధమై మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. షామిలి ఫొటోలను నెట్లో చూసిన దర్శకుడు లింగుసామి తన సండైకోళి చిత్రంలో హీరోయిన్ పాత్రకు సరిగ్గా నప్పుతారని భావించి ఆమెను నటింపజేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు. సండైకోళి చిత్రంలో నటించిన నటి మీరాజాస్మిన్, నటుడు రాజ్‌కిరణ్ ఈ చిత్రంలోనూ ముఖ్యపాత్రలు పోషించనున్నారు. డి ఇమాన్ సంగీతం అందించనున్న ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. -
ముజఫర్‌నగర్‌లో కర్ఫ్యూ సడలింపు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్‌నగర్ పరిసర ప్రాంతాల్లో అల్లర్లు సద్దుమణిగాయి. దాంతో అయా ప్రాంతాల్లో శనివారం ప్రశాంత వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ముజఫర్‌నగర్ పరిసర ప్రాంతాల్లో గతంలో విధించిన కర్ఫ్యూను ఈ రోజు 12 గంటలపాటు సడలిస్తున్నట్లు ఉన్నతాధికారులు శనివారం ఇక్కడ వెల్లడించారు. ఉదయం 7.00 గంటల నుంచి సాయంత్రం 7.00 గంటల వరకు కర్ఫ్యూను ఎత్తివేసినట్లు చెప్పారు. అయితే ముజఫర్‌నగర్ పరిసరాల్లోని గ్రామాల్లో మాత్రం ఇంకా పరిస్థితులు ఆందోళనగా ఉన్నాయని తెలిపారు. అందులోభాగంగా భద్రతను కట్టుదిట్టం చేసినట్లు వివరించారు. ముజఫర్‌నగర్, షామిలి జిల్లాలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో దాదాపు నాలుగు వేల మంది ప్రజలు తలదాచుకున్నారని చెప్పారు. వారందరికి ఆహారం, పాలు, మందులు అన్నింటిని అందజేస్తున్నట్లు చెప్పారు. ఇటీవల చోటు చేసుకున్న అల్లర్లలో ముజఫర్‌నగర్‌లోనే అత్యధికంగా 38 మంది మరణించారన్నారు. అలాగే షామిలిలో 3, షారణ్పూర్లో 1, బగ్పట్ 3, మీరట్‌లో 2 మృతిచెందారన్నారు. ఆ అల్లర్లలో భాగంగా 11 వేల మందిని నిర్బంధంలోకి తీసుకున్నట్లు చెప్పారు. అలాగే 187 మందిని అరెస్ట్ చేశామని,11 మందిపై హత్య కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు.