Masuda Teaser Launched By Natural Star Nani - Sakshi
Sakshi News home page

Hero Nani-Masuda Teaser: 'గంగోత్రి' బాలనటి కావ్య హీరోయిన్‌గా 'మసూద'..

Published Tue, Aug 2 2022 9:05 PM | Last Updated on Wed, Aug 3 2022 9:24 AM

Masuda Teaser Launched By Natural Star Nani - Sakshi

Masuda Teaser Launched By Natural Star Nani: ‘మ‌ళ్లీ రావా’, ‘ఏజెంట్ సాయిశ్రీ‌నివాస ఆత్రేయ’ చిత్రాలతో సక్సెస్‌ఫుల్ బ్యానర్‌గా పేరు తెచ్చుకుంది స్వధ‌ర్మ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌. ఈ ప్రొడక్షన్‌లో తెరకెక్కుతోన్న మూడో చిత్రం ‘మ‌సూద‌’. ఇప్పటికే విడుదలైన టైటిల్ లుక్ పోస్టర్‌ మంచి రెస్పాన్స్‌ని సొంతం చేసుకోగా.. మంగళవారం (ఆగస్టు 2) నేచురల్ స్టార్ నాని ఈ చిత్ర టీజర్‌ని ఆవిష్కరించారు. ఈ టీజర్ ప్రామిసింగ్‌గా ఉందని, ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టి ఈ చిత్రంలో చేసినట్లుగా అనిపిస్తుందని, ఎప్పుడెప్పుడు సినిమాని చూద్దామా అని అనిపిస్తుందని నాని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. 

తొలి రెండు సినిమాలతో గౌతమ్ తిన్ననూరి, స్వరూప్‌లను టాలీవుడ్‌కు పరిచయం చేసిన నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా.. హర్రర్ డ్రామా జోనర్‌లో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంతో సాయికిరణ్ అనే మరో నూతన డైరెక్టర్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. హీరోగా ‘జార్జిరెడ్డి’ ఫేమ్ తిరువీర్ (ల‌లన్‌ సింగ్ పాత్రధారి) న‌టిస్తుండగా.. ‘గంగోత్రి’ చిత్రంలో బాల‌న‌టిగా అల‌రించిన కావ్య క‌ల్యాణ్‌రామ్ ఈ చిత్రంతో హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. సీనియర్ నటి సంగీత అత్యంత ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు.

టీజర్ విడుదల సందర్భంగా నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా మాట్లాడుతూ.. ‘‘ముందుగా మా చిత్ర టీజర్‌ను విడుదల చేసిన నేచురల్ స్టార్ నానికి మా టీమ్ తరఫున ధన్యవాదాలు. ఆయనకు టీజర్ నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మా సంస్థలో వస్తున్న ఈ మూడో చిత్రం కూడా ప్రేక్షకులను చక్కగా ఎంటర్‌టైన్ చేస్తుంది. ఈ చిత్రంతో సాయికిరణ్ అనే దర్శకుడిని పరిచయం చేస్తున్నాము. సాయికిరణ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించి తీరు.. ప్రేక్షకులందరినీ మెప్పిస్తుంది. చిత్రంలో నటించిన నటీనటులకు, అలాగే పనిచేసిన సాంకేతిక నిపుణులకు, సహకరించిన అందరికీ ధన్యవాదాలు. త్వరలోనే ఈ చిత్ర ట్రైలర్‌, అలాగే మూవీ విడుదలకు సంబంధించిన వివరాలను తెలియజేస్తాం’’ అని తెలిపారు.



No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement