
కీర్తీ సురేశ్
... అంటూ కొడుకు గురించి కీర్తీ సురేష్ అడగ్గానే... ‘ఈ అడవి విస్తీర్ణం వెయ్యి చదరపు కిలోమీటర్లు.. ఈ అడవిలో వాణ్ణి ఎక్కడని వెతుకుతాం.. అజయ్ చనిపోయి ఉంటాడు’ అంటాడు పోలీసాధికారి. ‘వాడికి ఏమీ అయ్యుండదు’ అంటుంది కీర్తీ సురేశ్. ‘పెంగ్విన్’ చిత్రం టీజర్‌లోని డైలాగులు ఇవి. కీర్తీ సురేశ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘పెంగ్విన్’.
కార్తీక్ ఈశ్వర్ దర్శకత్వం వహించారు. స్టోన్ బెంచ్ ఫిల్మ్, ప్యాషన్ స్టూడియోస్ పతాకంపై దర్శక–నిర్మాత కార్తీక్ సుబ్బరాజు నిర్మించారు. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో రూపొందిన ఈ సినిమా ఈ నెల 19న అమెజాన్ ప్రైమ్‌లో నేరుగా విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆయా భాషల ట్రైలర్స్‌ని గురువారం సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. తమిళ ట్రైలర్‌ని హీరో ధనుష్, మలయాళ ట్రైలర్‌ని హీరో మోహన్‌లాల్, తెలుగు ట్రైలర్‌ని హీరో నాని రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment