Penguin Movie
-
పెంగ్విన్ మూవీ రివ్యూ
టైటిల్: పెంగ్విన్ జానర్: సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ నటీటులు: కీర్తి సురేష్, లింగా, మదంపట్టి రంగరాజ్, మాస్టర్ అద్వైత్, నిత్య తదితరులు నిర్మాత: కార్తీక్ సుబ్బరాజ్, కార్తికేయన్ సంతానం, సుధన్ సుందరం, జయరాం రచన- దర్శకత్వం: ఈశ్వర్ కార్తీక్ సంగీతం: సంతోష్ నారాయణ్ ఛాయాగ్రహణం: కార్తీక్ పళని బ్యానర్: స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, ఫ్యాషన్ స్టూడియోస్ విడుదల: అమెజాన్ ప్రైమ్ (జూన్ 19) లాక్డౌన్ సినిమా పరిశ్రమకు లాక్ వేసింది. దీంతో కొన్ని షూటింగ్‌లు ఆగిపోగా మరికొన్ని విడుదల వాయిదా వేసుకున్నాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం ఓటీటీ బాట పట్టాయి. ఇప్పటికే "అమృతరామమ్" చిత్రం ఓటీటీలో రిలీజైన విషయం తెలిసిందే. తాజాగా మహానటి కీర్తి సురేష్ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ పెంగ్విన్ కూడా ఓటీటీకే ఓటేసింది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రూపొందిన ఈ సినిమా జూన్ 19న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? దీన్ని ప్రేక్షకులు ఆదరిస్తారా? లేదా? వంటి విషయాలను తెలుసుకుందాం.. కథ: రిథమ్(కీర్తి సురేష్), రఘు(లింగ)ల ఒక్కగానొక్క కొడుకు అజయ్. అజయ్ అంటే రిథమ్‌కు పంచప్రాణాలు. ఓ రోజు అజయ్ కిడ్నాప్ అవుతాడు. దీంతో అతడి కోసం తల్లిదండ్రులిద్దరూ అడవిలో అంగుళం అంగుళం జల్లెడ పట్టినప్పటికీ అజయ్ జాడ దొరకదు. పైగా ట్రైలర్లో చూపినట్లు అజయ్ దుస్తులు కనిపించగానే అతడు చనిపోయాడని అందరూ భావిస్తారు.. రిథమ్ తప్ప! ఇదే సమయంలో అజయ్ కోసం మానసికంగా కుంగిపోతున్న రిథమ్ నుంచి రఘు విడాకులు తీసుకుంటాడు. అయిన్పటికీ ఆమె తన అన్వేషణ మానదు. ఈ క్రమంలో ఆమె గౌతమ్(రంగరాజ్)ను వివాహం చేసుకుని గర్భం దాల్చుతుంది. అయితే ఓరోజు సడన్‌గా రిథమ్‌కు అజయ్ కనిపిస్తాడు. ఇన్నిరోజులు అజయ్ ఏమైపోయాడు? అతనితోపాటు అపహరణకు గురైన ఆరుగురు పిల్లలు బతికే ఉన్నారా? అసలు వీరిని ఎందుకు కిడ్నాప్ చేశారు? చార్లీ చాప్లిన్ ముసుగు ధరించిన సీరియల్ కిల్లర్ ఎవరు? గర్భంతో ఉన్న కీర్తి అతడిని ఎలా ఎదుర్కొంది? అన్న విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. (లాక్డౌన్ ఎఫెక్ట్: అమెజాన్‌లో ఏడు సినిమాలు) విశ్లేషణ: ప్రారంభ సన్నివేశంలోనే దర్శకుడు కథను ముందుగా పరిచయం చేస్తాడు. దీంతో ప్రేక్షకుడు స్టోరీ లైన్ అర్థమై కథలో లీనమయ్యేందుకు సిద్ధపడతాడు. తల్లి ప్రేమ కథతో సినిమాను ఎమోషనల్‌గా నడిపిస్తూనే సస్పెన్స్ క్రియేట్ చేశాడు. ప్రథమార్థంలో పట్టును చూపించినప్పటికీ.. ద్వితీయార్థంలో మాత్రం అక్కడక్కడా తేలిపోయాడు. ఎక్కువగా దర్శకుడు రిథమ్(కీర్తి)ని హైలెట్ చేయడానికే ప్రయత్నించాడని కొట్టొచినట్లు కనిపిస్తుంది. సినిమా ఇంకాస్త ఎడిటింగ్ చేస్తే బాగుండనిపిస్తుంది. సాంకేతికంగా సినిమా బాగుంది. సంతోష్ నారాయణ్ అందించిన సంగీతం ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. కథ బాగానే ఉన్న కథనంలో కొన్ని లోపాలతో కొన్నిచోట్ల గజిబిజిగా అనిపిస్తుంది. ఇక సినిమాలో దాదాపు తెలుగు ప్రేక్షకులకు తెలియని నటీనటులే ఉండటం కూడా ఓ మైనస్. (మిసెస్ సీరియల్ కిల్లర్: ఒక్కసారి చూడ్డమే ఎక్కువ) కథ చివర్లో వచ్చే ట్విస్ట్ చూసి ప్రేక్షకులు పెదవి విరవడం ఖాయం. పైగా మొదటి నుంచి సీరియల్ కిల్లర్‌ను భయంకరంగా చూపిస్తూ చివర్లో మాత్రం కీర్తి కోసం అతడి బలాన్ని తక్కువ చేసినట్లు అనిపిస్తుంది. అజయ్‌ను ఎత్తుకుపోవడానికి గల కారణం కూడా సిల్లీగా అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో వచ్చే ఈ అంశాలను పక్కపెడితే థ్రిల్లర్ చిత్రాలిష్టపడేవారు తప్పకుండా ఓ సారి "పెంగ్విన్"ను చూసేయొచ్చు. నటనా పరంగా చూస్తే ఈ సినిమాను కీర్తి సురేశ్ తన భుజాలమీద మోసిందనడంలో ఎటువంటి సందేహం లేదు. కీర్తి ముందు మిగతా పాత్రలేవీ పెద్దగా కనిపించవు. ఈ చిత్రంలో ఉన్న ఏకైక పాట.. ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. (అజయ్ గురించి ఏమైనా తెలిసిందా?) ప్లస్ పాయింట్స్ కీర్తి సురేష్ నటన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సాంకేతిక బృందం పనితీరు మైనస్ పాయింట్స్ క్లైమాక్స్ ద్వితీయార్ధంలో కొన్ని సన్నివేశాలు -
రేపే ప్రేక్షకుల ముందుకు ‘పెంగ్విన్’
సాక్షి, న్యూఢిల్లీ : తెలుగు వెండి తెర వేల్పు సావిత్రి జీవితంపై తీసిన బయోపిక్ ‘మహానటి’లో సావిత్రిగా నటించి తెలుగుతోపాటు తమిళ ప్రేక్షకులను విశేషంగా ఆకర్శించిన 27 ఏళ్ల కీర్తి సురేశ్ ‘పెంగ్విన్’ చలన చిత్రంతో జూన్ 19వ తేదీన ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ‘మహానటి’ తెలుగు చిత్రం తర్వాత ఫాషన్ డిజైనింగ్ కోర్స్ కోసం చెన్నై వెళ్లిన ఆమె ప్రస్తుతం కరోనా లాక్డౌన్ కారణంగా కేరళలోని తన ఇంటికే అంకితం అయ్యారు. కీర్తి సురేశ్ చెన్నైలో ఉండగానే ‘పెంగ్విన్’ అనే తమిళ చిత్రంలో నటించేందుకు అంగీకరించారు. తమిళనాడు సంచలన చిత్రాల నిర్మాతగా గుర్తింపు పొందిన కార్తీక్ సుబ్బరాజ్ తీసిన ‘పెంగ్విన్’ చిత్రానికి ఈశ్వర్ దర్శకత్వం వహించారు. తనను నుంచి తప్పిపోయిన కొడుకు కోసం నాలుగు రోజులపాటు అవిశ్రాంతంగా వెతికే త్రిల్లర్ సినిమాలో నటించినందుకు తనకు త్రిల్లింగా ఉందని కీర్తి సురేశ్ మీడియాకు తెలిపారు. ఓ తల్లికి, కొడుకుకు మధ్యనున్న అనుబంధాన్ని అచ్చు గుద్దినంటూ చూపించే కథనానికి తాను స్పందించి ఈ చిత్రానికి అంగీకరించానని ఆమె చెప్పారు. మొత్తం కొడైకెనాల్లో నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ కేవలం 40 రోజుల్లో పూర్తయిందని ఆమె తెలిపారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ రంగప్రవేశం చేసిన కీర్తి సురేశ్ 2013లో గీతాంజలి లీడ్ రోల్ ద్వారా తెలుగు, తమిళ చిత్రాలకు పరిచయం అయ్యారు. లాక్డౌన్ కారణంగా సినిమా థియేటర్లు మూత పడడంతో నెట్‌ఫ్లిక్స్. అమెజాన్ లాంటి ఆన్లైన్ మూవీ సైట్లకు ప్రేక్షకులు భారీగా పెరిగారు. -
అజయ్ గురించి ఏమైనా తెలిసిందా?
... అంటూ కొడుకు గురించి కీర్తీ సురేష్ అడగ్గానే... ‘ఈ అడవి విస్తీర్ణం వెయ్యి చదరపు కిలోమీటర్లు.. ఈ అడవిలో వాణ్ణి ఎక్కడని వెతుకుతాం.. అజయ్ చనిపోయి ఉంటాడు’ అంటాడు పోలీసాధికారి. ‘వాడికి ఏమీ అయ్యుండదు’ అంటుంది కీర్తీ సురేశ్. ‘పెంగ్విన్’ చిత్రం టీజర్‌లోని డైలాగులు ఇవి. కీర్తీ సురేశ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘పెంగ్విన్’. కార్తీక్ ఈశ్వర్ దర్శకత్వం వహించారు. స్టోన్ బెంచ్ ఫిల్మ్, ప్యాషన్ స్టూడియోస్ పతాకంపై దర్శక–నిర్మాత కార్తీక్ సుబ్బరాజు నిర్మించారు. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో రూపొందిన ఈ సినిమా ఈ నెల 19న అమెజాన్ ప్రైమ్‌లో నేరుగా విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆయా భాషల ట్రైలర్స్‌ని గురువారం సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. తమిళ ట్రైలర్‌ని హీరో ధనుష్, మలయాళ ట్రైలర్‌ని హీరో మోహన్‌లాల్, తెలుగు ట్రైలర్‌ని హీరో నాని రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు. -
పిల్లల్ని హింసిస్తూ చంపుతున్న సైకో..
ప్రతీ తల్లికి తన కడుపున పుట్టిన బిడ్డే ప్రపంచం. కన్నబిడ్డ తర్వాతే ఎవరికైనా ప్రాధాన్యం ఇచ్చేది. అలాంటిది ఆ తల్లి నుంచి కొడుకును వేరు చేస్తే.. కొన్ని క్షణాలు, రోజుల తరబడి అతడు కనబడకుండా పోతే ఆమె ఎంతగా తల్లడిల్లిపోతుంది.. అతడిని దక్కించుకోవడం కోసం ఎంతగా పోరాడుతుంది అన్నదే "పెంగ్విన్". తల్లి పాత్రలో హీరోయిన్ కీర్తి సురేశ్ అద్భుతంగా నటించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ట్రైలర్‌ను తెలుగులో నాని రిలీజ్ చేయగా తమిళ, మలయాళం భాషల్లో నటులు ధనుష్, మోహన్‌లాల్ విడుదల చేశారు. ట్రైలర్ విషయానికొస్తే.. ఓ అడవిలో కీర్తి కొడుకు తప్పిపోతాడు. అయితే వెయ్యి చ.కి.మీ విస్తీర్ణంలో ఉన్న అరణ్యంలో అతడిని వెతికి పట్టుకురావడం కష్టమేనని పోలీసులు చెప్తారు. ('అందరి కథ మొదలయ్యేది ఆమె నుంచే') బహుశా అజయ్ చనిపోయాడనుకుంటా.. అని పోలీసులు చెప్పినప్పటికీ కీర్తి వారి మాటలను లెక్క చేయదు. కొడుకు కోసం అన్వేషణ జరుపుతూనే ఉంటుంది. ఇంతలో సైకో కిరాతకంగా గొడ్డలి పట్టుకుని నరుకుతూ కనిపిస్తాడు. పిల్లల్ని దారుణంగా హింసిస్తూ చంపుతున్న సైకోను కీర్తి ఏం చేసింది? చివరికి అజయ్ ప్రాణాలతో బతికి బట్టకట్టాడా? లేదా? అన్న విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇదిలా వుంటే ఇప్పట్లో థియేటర్స్ తెరుచుకునేలా లేకపోవడంతో "పెంగ్విన్" ఓటీటీ బాట పట్టింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూన్ 19న విడుదల కానుంది. ఈశ్వర్ కార్తీక్ రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కార్తీక్ సుబ్బరాజు నిర్మించాడు. సంతోష్ నారాయణ్ సంగీతం అందించాడు.(పెంగ్విన్ కూడా ఓటీటీ వైపే?) -
పెంగ్విన్ టీజర్: సైకో ఎవరు?
'పెంగ్విన్'.. ఓ తల్లి ప్రేమ కథ.. అంటే, ఆటలు, పాటలు, అల్లర్లతో సాగే సంతోషకరమైన కథ కాదు. అపహరణకు గురైన కొడుకు కోసం తల్లి పడే వేదన, కొడుకును దక్కించుకునేందుకు చేసే పోరాటం.. వెరసి ఇదో సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. మహానటితో ఉత్తమ జాతీయ నటిగా అవార్డు అందుకున్న కీర్తి సురేశ్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. తెలుగులో ప్రముఖ హీరోయిన్ సమంత సోమవారం ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేసింది. హిందీలో తాప్సీ, తమిళ్లో త్రిష, మలయాళ టీజర్‌ను మంజు వారియర్ విడుదల చేశారు. 'మీ అందరి కథల వెనుక ఓ అమ్మ కథ ఉంది. ఎందుకంటే మీ ప్రయాణం ప్రారంభించేది ఆమె నుంచే..' అని టీజర్లో చూపించారు. (పెంగ్విన్ కూడా ఓటీటీ వైపే?) పెంగ్విన్ టీజర్లో కీర్తి తప్పిపోయిన తన కొడుకు కోసం వెతుకుతున్నట్లు కనిపిస్తోంది. టీజర్ చివరిలో ఎవరినో నరుకుతూ కనిపించిన సైకో ఎవరు? అనేది ప్రేక్షకులకు ఆసక్తిని కలిగిస్తోంది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఈ టీజర్‌కు యూట్యూబ్‌లో మంచి స్పందన వస్తోంది. ఈ నెల 11న పెంగ్విన్ ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. నూతన దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను "పేట" దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు నిర్మించారు. సినిమా ఎక్కువ శాతం షూటింగ్ ఊటీలో జరిపారు. లాక్డౌన్ కారణంగా ఈ చిత్రం డిజిట్ ప్లాట్ఫామ్లో రిలీజ్ అవుతోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో జూన్ 19న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. (ఉప్మా తినేసింది.. హీరోయిన్ అయ్యింది..)