
ప్రతీ తల్లికి తన కడుపున పుట్టిన బిడ్డే ప్రపంచం. కన్నబిడ్డ తర్వాతే ఎవరికైనా ప్రాధాన్యం ఇచ్చేది. అలాంటిది ఆ తల్లి నుంచి కొడుకును వేరు చేస్తే.. కొన్ని క్షణాలు, రోజుల తరబడి అతడు కనబడకుండా పోతే ఆమె ఎంతగా తల్లడిల్లిపోతుంది.. అతడిని దక్కించుకోవడం కోసం ఎంతగా పోరాడుతుంది అన్నదే "పెంగ్విన్". తల్లి పాత్రలో హీరోయిన్ కీర్తి సురేశ్ అద్భుతంగా నటించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ట్రైలర్‌ను తెలుగులో నాని రిలీజ్ చేయగా తమిళ, మలయాళం భాషల్లో నటులు ధనుష్, మోహన్‌లాల్ విడుదల చేశారు. ట్రైలర్ విషయానికొస్తే.. ఓ అడవిలో కీర్తి కొడుకు తప్పిపోతాడు. అయితే వెయ్యి చ.కి.మీ విస్తీర్ణంలో ఉన్న అరణ్యంలో అతడిని వెతికి పట్టుకురావడం కష్టమేనని పోలీసులు చెప్తారు. ('అందరి కథ మొదలయ్యేది ఆమె నుంచే')
బహుశా అజయ్ చనిపోయాడనుకుంటా.. అని పోలీసులు చెప్పినప్పటికీ కీర్తి వారి మాటలను లెక్క చేయదు. కొడుకు కోసం అన్వేషణ జరుపుతూనే ఉంటుంది. ఇంతలో సైకో కిరాతకంగా గొడ్డలి పట్టుకుని నరుకుతూ కనిపిస్తాడు. పిల్లల్ని దారుణంగా హింసిస్తూ చంపుతున్న సైకోను కీర్తి ఏం చేసింది? చివరికి అజయ్ ప్రాణాలతో బతికి బట్టకట్టాడా? లేదా? అన్న విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇదిలా వుంటే ఇప్పట్లో థియేటర్స్ తెరుచుకునేలా లేకపోవడంతో "పెంగ్విన్" ఓటీటీ బాట పట్టింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూన్ 19న విడుదల కానుంది. ఈశ్వర్ కార్తీక్ రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కార్తీక్ సుబ్బరాజు నిర్మించాడు. సంతోష్ నారాయణ్ సంగీతం అందించాడు.(పెంగ్విన్ కూడా ఓటీటీ వైపే?)
Comments
Please login to add a commentAdd a comment