Natural Star Nani Interesting Comments On Dasara Movie - Sakshi
Sakshi News home page

Hero Nani: ఆ సీన్స్‌లో నిజంగానే మందు కొట్టి నటించారట, నిజమెంత? నాని క్లారిటీ

Published Tue, Mar 21 2023 9:52 AM | Last Updated on Tue, Mar 21 2023 11:11 AM

Hero Nani Interesting Comments on Dasara Movie in Latest Interview - Sakshi

నేచరల్‌ స్టార్‌గా హీరో నాని ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం నాని నటించిన దసరా మూవీ మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. పాన్‌ ఇండియాగా రాబోతున్న ఈ మూవీ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక మూవీ విడుదల దగ్గర పడుతుండటంతో హీరో నాని, చిత్ర బృందం ప్రమోషన్స్‌ స్టార్ట్‌ చేసింది. ఈ క్రమంలో తాజాగా ఓ చానల్‌తో ముచ్చటించిన నాని దసరా మూవీ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

చదవండి: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు హఠాన్మరణం

ఈ సందర్భంగా దసరా కొన్ని సీన్స్‌ మందు కొట్టి చేశారని టాక్‌ వినిపిస్తోంది, నిజమెంత అని యాంకర్‌ నాని ప్రశ్నించారు. దీనికి నాని స్పందిస్తూ.. కథ, పాత్ర డిమాండ్‌ చేస్తే నటుడు ఎలాంటి రిస్క్‌ అయినా తీసుకోవాల్సి ఉంటుందన్నాడు. ‘ఇందులో కొన్ని మందు కొట్టి నటించాలని డైరెక్టర్ చెప్పాడు. నీకేమైనా అభ్యంతరం ఉందా? అని అడిగాడు శ్రీకాంత్. నాకేం అభ్యంతరం లేదు అని చెప్పాను. అందుకే అవసరం ఉన్న సీన్స్ లో నిజంగానే మందు కొట్టి నటించాను” అంటూ షాకింగ్ విషయాలు వెల్లడించాడు.

చదవండి: మోహన్‌ బాబు బర్త్‌డేలో కొత్త కోడలు మౌనిక సందడి! విష్ణు ఫ్యామిలీ ఎక్కడా?

ఆ సీన్స్‌లో కళ్లు ఎర్రగా ఉండాలి.. మందు కొట్టే మ్యానరిజం ఉండాలన్నాడు. అందుకే పాత్ర డిమాండ్‌ మేరకు నిజంగా మందు తాగాల్సి వచ్చిందని నాని వివరణ ఇచ్చాడు. ఇక దసరా మూవీలో డైరెక్టర్‌ శ్రీకాంత్‌ నన్ను కావాల్సినంత గట్టిగా వాడుకున్నాడంటూ నవ్వులు చిందించాడు. కాగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాని జోడిగా కీర్తి సురేశ​ నటించింది. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో నాని పూర్థి స్థాయి మాస్‌ లుక్‌లో కనిపించనున్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement