రితికా సింగ్.. ముందు క్రీడాకారిణిగానే తెలుసు! తర్వాతే నటిగా పరిచయం. ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఎంట్రీ ఇచ్చిన ఆమె గురించి కొన్ని మాటలు.
► మహారాష్ట్రలో పుట్టి పెరిగిన రితికా.. చిన్న వయసు నుంచే మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుంది.
► ఒకరోజు ఆమెను చూసిన దర్శకురాలు సుధా కొంగర తన దర్శకత్వంలోని ‘ఇరుది సుట్రు’లో అవకాశమిచ్చారు. ఈ చిత్రాన్నే తెలుగులో ‘గురు’, హిందీలో ‘సాలా ఖడూస్’గా రీమేక్ చేశారు.
► తెలుగు, తమిళ, హిందీలో తెరకెక్కిన ఈ చిత్రంలో రితికా బాక్సర్ పాత్రను పోషించింది. ఆమె నటనకు మూడు భాషల్లోనూ ఫిల్మ్‌ఫేర్ అవార్డుతోపాటు మరెన్నో అవార్డులు వరించాయి.
► తర్వాత రాఘవ లారెన్స్ ‘శివలింగ’, ‘నీవెవరో’, ‘ఓ మై కడవులే’, ‘ఇన్కార్’ సినిమాల్లో నటించింది.
► ‘స్టోరీ ఆఫ్ థింగ్స్’ వెబ్ సిరీస్‌తో వెబ్ ప్రేక్షకుల ముందుకొచ్చింది.
► మళ్లీ చాలారోజుల తర్వాత ‘కింగ్ ఆఫ్ కొత్త’తో వెండితెర మీదా మెరిసింది.
ఒకప్పుడు సోషల్ మీడియా ట్రోల్స్, డబుల్ మీనింగ్ డైలాగ్స్ నన్ను చాలా ఇబ్బంది పెట్టేవి. నేను కోరుకునేది ఒక్కటే ఆడవారిని అందరూ గౌరవించాలి. మిడిల్ క్లాస్ అయినా.. సెలబ్రిటీ అయినా సమానంగా చూడాలి. అమ్మాయిలకు కచ్చితంగా సెల్ఫ్ డిఫెన్స్ రావాలి!
– రితికా సింగ్
చదవండి: విక్రమ్- ప్రశాంత్ విభేదాలు ఈనాటివి కావు.. వారిద్దరి మధ్య ఉన్న రక్తసంబంధం ఏంటి?
Comments
Please login to add a commentAdd a comment