హీరోయిన్ రితికా సింగ్‌ను లక్కీ ఛాన్స్ వరించింది. రియల్ బాక్సర్ అయిన ఈ ఉత్తరాది చిన్నది ఇరుదుచుట్రు చిత్రం ద్వారా కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. సుధాకొంగర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాధవన్ కథానాయకుడిగా నటించారు. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో అదే చిత్రం తెలుగు రీమేక్ 'గురు'లోనూ రితికాసింగ్ హీరోయిన్‌గా నటించింది. అక్కడ మంచి విజయాన్ని అందుకున్న ఈ భామ తమిళంలో విజయ్‌సేతుపతికి జంటగా ఆండవన్ కట్టలై, రాఘవా లారెన్స్ సరసన శివలింగా, అశోక్ సెల్వన్‌తో ఓ మై కడవులే తదితర సక్సెస్‌ఫుల్ చిత్రాల్లో నటించింది.
కాగా ఈ మధ్య అవకాశాలు ముఖం చాటేయడంతో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన కింగ్ ఆఫ్ కొత్త చిత్రంలో ఐటమ్ సాంగ్ చేయడానికీ వెనుకాడలేదు. ఇకపోతే ఇన్‌స్ట్రాగామ్‌లో తనకు సంబంధించిన ఫొటోలు, వర్కౌట్స్ చేసిన వీడియోలను పోస్ట్ చేస్తూ అభిమానులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. అలా నాలుగు మిలియన్ల ఫాలోవర్స్‌ను సంపాదించుకుంది. మొత్తం మీద తాజాగా మరో భారీ అవకాశాన్ని పొందింది.
సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రంలో కీలక పాత్రను పోషిస్తోంది. జై భీమ్ చిత్రం ఫేమ్ జ్ఙానవేల్ దర్శకత్వంలో లైకా సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో ఇప్పటికే నటి మంజువారియర్, బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, తెలుగు నటుడు రానా, నటి దుషారా విజయన్ తదితర ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. ఇప్పుడు వీరి సరసన నటి రితికాసింగ్ చేరారు. ఇది ఈమెకు నిజంగా లక్కీఛాన్స్‌నే అవుతుంది.
చదవండి: ప్రియుడితో జబర్దస్త్ పవిత్ర నిశ్చితార్థం.. త్వరలోనే పెళ్లి..
Comments
Please login to add a commentAdd a comment