తలైవా సినిమా షూటింగ్‌లో హీరోయిన్‌కు గాయాలు! | Rajinikanth Co Star Ritika Singh Injured During Shoot | Sakshi
Sakshi News home page

Ritika Singh: అందరూ హెచ్చరించారు.. క్షణాల్లో జరిగిపోయింది.. వీడియో రిలీజ్‌ చేసిన హీరోయిన్‌

Published Mon, Dec 4 2023 4:08 PM | Last Updated on Mon, Dec 4 2023 4:33 PM

Rajinikanth Co Star Ritika Singh Injured During Shoot - Sakshi

గురు సినిమాతో తెలుగువారికి దగ్గరైంది రితికా సింగ్‌. సౌత్‌లో పలు సినిమాల్లో హీరోయిన్‌గా చేసినా తనకు పెద్ద క్రేజ్‌ అయితే రాలేదు. దీంతో ఐటం సాంగ్‌ చేయడానికి కూడా వెనుకాడల్లేదు. కింగ్‌ ఆఫ్‌ కొత్త మూవీలో ఐటం సాంగ్‌లో ఆడిపాడిన ఈ బ్యూటీ ప్రస్తుతం సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ 170వ మూవీలో నటిస్తోంది.

ఈ సినిమా చిత్రీకరణలో రితికా సింగ్‌ గాయపడినట్లు తెలుస్తోంది. చేతులపై అక్కడక్కడా గీసుకుపోయి రక్తం వస్తున్న ఫోటోను ఆమె సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. అప్పటికే అందరూ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నా తను గాయాలపాలైనట్లు వెల్లడించింది. అక్కడ ఉన్న ఓ గాజు అద్దం వల్లే ఇదంతా జరిగింది. బట్‌, ఇట్స్‌ ఓకే.. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు క్షణాల్లో జరిగిపోయేవాటిని మనం ఆపలేము. నేను పట్టు కోల్పోవడం వల్లే ఇలా జరిగింది అని వీడియో రిలీజ్‌ చేసింది.

ఈ గాయం వల్ల షూటింగ్‌ నుంచి బ్రేక్‌ తీసుకున్నట్లు తెలిపింది. దీన్నుంచి కోలుకున్న తర్వాతే తిరిగి సెట్స్‌లో పాల్గొంటానని పేర్కొంది. కాగా రితికా కిక్‌ బాక్సర్‌ అన్న విషయం తెలిసిందే! ఇరుది చుట్రు అనే సినిమాతో కథానాయికగా పరిచయం అయింది. ఈ మూవీ హిందీలో సాలా ఖాదూస్‌గా డబ్‌ అయింది. తెలుగులో గురుగా రీమేక్‌ అయింది. ఇటీవల ఆమె ఇన్‌ కార్‌, కోలై సినిమాల్లో నటించింది.

చదవండి: ఓ వ్యక్తి చేసినదానికి ఇండస్ట్రీని తిట్టొద్దు.. సంతోషం అవార్డుల వివాదంపై నిర్మాత సీరియస్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement