తెలుగులో సినిమా ఛాన్సులు రావట్లేదా? హీరోయిన్‌ ఆన్సరిదే! | Ritika Singh About Not Getting Offers In Telugu | Sakshi

Ritika Singh: తెలుగు సినిమాల్లో కనిపించట్లే.. అవకాశాలు రావడం లేదా?

Mar 4 2024 12:14 PM | Updated on Mar 4 2024 12:51 PM

Ritika Singh About Not Getting Offers In Telugu - Sakshi

టాలీవుడ్‌లో పరభాషా నటీమణులే ఎక్కువగా ఉన్నారు. మరి మీరు తెలుగులో ఎక్కువగా కనిపించడం లేదు. మీకు తెలుగులో ఆఫర్స్‌ రావడం లేదా? అని ఓ విలేఖరి ప్రశ్నించాడు

'గురు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది హీరోయిన్‌ రితికా సింగ్‌. స్వతాహాగా కిక్‌ బాక్సర్‌ అయిన ఆమె ఈ చిత్రంలో కూడా బాక్సింగ్‌ చేస్తూ కనిపించింది. తర్వాత నీవెవరో అనే సినిమా చేసింది కానీ అంతగా క్లిక్‌ అవలేదు. ఆ తర్వాత తెలుగులో మరే సినిమాలోనూ కనిపించలేదు. అయితే తమిళ, హిందీ భాషల్లో మాత్రం సినిమాలు చేసింది. దుల్కర్‌ సల్మాన్‌ కింగ్‌ ఆఫ్‌ కొత్త మూవీలో ఐటం సాంగ్‌ కూడా చేసింది.

ఆఫర్స్‌ రావడం లేదా?
ప్రస్తుతం రజనీకాంత్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న వేటయ్య అనే సినిమాలో ముఖ్యపాత్ర పోషిస్తోంది. అలాగే వళరి అనే హారర్‌ మూవీలోనూ యాక్ట్‌ చేసింది. ఈ సినిమా ట్రైలర్‌ ఈవెంట్‌లో రితికాకు ఓ ఇబ్బందికర ప్రశ్న ఎదురైంది. 'టాలీవుడ్‌లో పరభాషా నటీమణులే ఎక్కువగా ఉన్నారు. మీరు మాత్రం తెలుగులో ఎక్కువగా కనిపించడం లేదు. మీకు తెలుగులో ఆఫర్స్‌ రావడం లేదా?' అని ఓ విలేఖరి ప్రశ్నించాడు.

మనసుకు నచ్చితేనే..
ఇందుకు రితికా స్పందిస్తూ.. 'నాకు మనస్ఫూర్తిగా నచ్చితేనే సినిమా చేస్తాను. లేదంటే ఎట్టిపరిస్థితుల్లో చేయను. మలయాళం, మరాఠి, హిందీ.. ఏ భాష అయినా సరే కథ, పాత్ర నచ్చితేనే చేశాను. కాంబినేషన్‌ కరెక్ట్‌గా కుదిరితేనే సినిమా ఒప్పుకుంటాను' అని చెప్పుకొచ్చింది.

చదవండి: అదే రాళ్లపల్లి వీక్‌నెస్‌! జీవితంలో అత్యంత విషాదకర సంఘటన ఇదే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement