భారతదేశంలో అత్యంత సంపన్నులైన వ్యాపారవేత్తల జాబితాలో 'లీనా తివారీ' ఒకరు. బహుశా ఈ పేరు కొంతమందికి పరిచయమే అయినా.. ఈమె కుమార్తె 'అనీషా గాంధీ తివారీ' (Aneesha Gandhi Tewari) గురించి బహుశా తెలుసుండకపోవచ్చు. ఈ కథనంలో ఆమె గురించి తెలుసుకుందాం.
అనీషా గాంధీ బ్రౌన్ యూనివర్శిటీ నుంచి బయోకెమిస్ట్రీ, మాలిక్యులర్ బయాలజీలో డిగ్రీ పూర్తి చేశారు. ఆ తరువాత ప్రతిష్టాత్మకమైన మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) నుంచి మాలిక్యులర్ బయాలజీలో పీహెచ్‌డీ(PhD) పట్టా పొందారు. చదువు పూర్తయిన తరువాత అనీషా యూఎస్‌వీ బోర్డ్‌కు డైరెక్టర్‌లలో ఒకరుగా చేరారు.
యూఎస్‌వీ (USV) అనేది పార్మాస్యుటికల్ కంపెనీ. దీనిని లీనా తివారీ తన తండ్రి 'విఠల్ గాంధీ' 1961లో రెవ్లాన్ సహకారంతో ప్రారంభించారు. ఇది లీనా సారథ్యంలో గణనీయమైన వృద్ధి సాధించింది. నేడు, ఈ కంపెనీ కార్డియోవాస్కులర్, డయాబెటిక్ ఔషధాల విభాగంలో భారతదేశంలోని మొదటి ఐదు సంస్థలలో ఒకటిగా నిలిచింది.
లీనా తివారీ
ముంబై యూనివర్సిటిలో గ్రాడ్యుయేట్, బోస్టన్ విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పూర్తి చేసిన 'లీనా తివారీ' USV ఇండియాకు నాయకత్వం వహిస్తున్నారు. ఈమె రూ. 11వేలకోట్ల కంటే ఎక్కువ నికర విలువతో.. భారతదేశంలోని అత్యంత సంపన్న మహిళా పారిశ్రామికవేత్తలలో ఒకరుగా నిలిచారు. ఈమె అనేక దాతృత్వ కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొంటారు. ఇందులో భాగంగానే వెనుకబడిన మహిళలకు సాధికారత కల్పించే విద్యా కార్యక్రమాలపై దృష్టి సారించారు.
Comments
Please login to add a commentAdd a comment