leena
-
రూ. 30వేల కోట్ల సంపదకు అధిపతి - ఎవరీ లీనా తివారీ?
ఫోర్బ్స్ (Forbes) యాన్యువల్ బిలినియర్స్ జాబితాను 2023 ఏప్రిల్ 04న విడుదల చేసింది. ఇందులో రిలయన్స్ సంస్థ ఛైర్మన్ ముఖేష్ అంబానీ భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో ఒకరుగా ఉన్నారు. ఈ లిస్ట్‌లో మొత్తం 16 మంది భారతీయలు ఉండటం గమనార్హం. ఫోర్బ్స్ జాబితా ప్రకారం, భారతదేశంలో అత్యంత సంపన్నులైన మహిళలుగా ఐదు మందిని గుర్తించారు. వీరిలో సావిత్రి జిందాల్, రోహికా సైరస్ మిస్త్రీ, రేఖా జున్‌జున్‌వాలా, వినోద్ రాయ్ గుప్తాతో పాటు 'లీనా తివారీ' కూడా ఉన్నారు. భారతదేశంలోని సంపన్న మహిళల జాబితాలో ఒకరుగా నిలిచినా 'లీనా' గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ ఆమె ప్రముఖ ఫార్మా కంపెనీకి వారసురాలు. అంతే కాకుండా ఈమె ప్రైవేట్ కంపెనీ USV ఇండియా చైర్పర్సన్ కూడా. లీనా ప్రస్తుత నికర సంపద విలువ 3.7 బిలియన్ డాలర్లు (భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 30,000 కోట్లకంటే ఎక్కువ). (ఇదీ చదవండి: చిన్న గ్రామం.. చెట్ల కింద చదువు: ఇప్పుడు అమెరికాలో సంపన్న భారతీయుడు!) కార్డియోవాస్కులర్ అండ్ డయాబెటిక్ మెడిషన్స్ విభాగాలలో లీనా ఫార్మా కంపాంట్ భారతదేశంలో మొదటి ఐదు స్థానాల్లో ఒకటిగా ఉంది. ఇది యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రేడియంట్స్, ఇంజెక్టబుల్స్ అండ్ బయోసిమిలర్ ఔషధాలను కూడా తయారు చేస్తుంది. గ్లైకోమెంట్ అని పిలువబడే USV యాంటీ-డయాబెటిక్ ఫార్ములేషన్ దేశీయ పరిశ్రమలో టాప్-3లో ఉంది. ముంబై యూనివర్సిటీ నుంచి బీకామ్, బోస్టన్ యూనివర్సిటీ నుంచి MBA పూర్తి చేసిన లీనా తివారీ ఎక్కువగా బుక్స్ చదవటానికి ఆసక్తి చూపుతారు. అంతే కాకుండా ఈమె 'బియాండ్ పైప్స్ & డ్రీమ్స్ - ది లైఫ్ ఆఫ్ విఠల్ బాలకృష్ణ గాంధీ' పేరుతో బుక్ కూడా రాసింది. లీనా యుఎస్‌వి ఎండి ప్రశాంత్ తివారీని వివాహం చేసుకుంది. ఈయన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), యుఎస్‌లోని కార్నెల్ యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ చదివారు. వీరికి అనీషా గాంధీ తివారీ అనే కుమార్తె కూడా ఉంది. -
మాకు కావాలి.. జెండర్ బడ్జెటింగ్
ముంబైకి చెందిన శ్రీజ సైన్స్ గ్రాడ్యుయేట్. ‘బడ్జెట్’ లేదా ‘బడ్జెట్‌కు సంబంధించిన విశేషాలు’ ఆమెకు ఏమంత ఆసక్తిగా ఉండేవి కావు. ఆరోజు బడ్జెట్ రోజు. ఒకప్పుడు తనతోపాటు కలిసి చదువుకున్న రూప తనను అడిగింది... ‘ఇది జెండర్ బడ్జెటే అంటావా?’ అని. శ్రీజకు ఏం జవాబు చెప్పాలో తెలియలేదు. నిజం చెప్పాలంటే ‘జెండర్ బడ్జెట్’ అనే మాట వినడం తనకు తొలిసారి. దీని గురించి ఫ్రెండ్‌ను అడిగి తెలుసుకుంది. ఆరోజు మొదలైన ఆసక్తి తనను పబ్లిక్బడ్జెట్ను విశ్లేషిస్తూ జెండర్ బడ్జెటింగ్‌పై ప్రత్యేకంగా నోట్స్ రాసుకునేలా చేసింది. ‘బడ్జెట్ అనేది ఆర్థికవేత్తలు, ఎకనామిక్స్ స్టూడెంట్స్ వ్యవహారం అన్నట్లుగా ఉండేది నా ధోరణి. ఇది తప్పని, బడ్జెట్ అనేది మన జీవితానికి ముడిపడి ఉన్న విషయమని తెలుసుకోవడంలో కాస్త ఆలస్యం అయింది. ఇప్పుడు మాత్రం బడ్జెట్ విషయాలపై చాలా ఆసక్తి చూపుతున్నాను’ అంటుంది శ్రీజ. ప్రతి సంవత్సరం బడ్జెట్‌ను ప్రవేశపెట్టే ముందు, ప్రవేశ పెట్టిన తరువాత మహిళా పారిశ్రామికవేత్తలు, ఉద్యమకారుల నుంచి తరచుగా వచ్చే మాట... జెండర్ బడ్జెటింగ్ లేదా జెండర్ సెన్సిటివ్ బడ్జెటింగ్. ఏమిటిది? స్థూలంగా చెప్పాలంటే బడ్జెట్‌ను జెండర్ దృక్పథం నుంచి పరిశీలించి, విశ్లేషించడం. దీనివల్ల ఏమవుతుంది? నిపుణుల మాటల్లో చెప్పాలంటే...అసమానతలు, పక్షపాతధోరణులు లేకుండా చేయగలిగే మందు ఇది. స్త్రీ, పురుష ఉద్యోగులలో జీతభత్యాల మధ్య వ్యత్యాసం నుంచి వనరుల పంపకం వరకు తేడా లేకుండా చేయడానికి మార్గనిర్దేశం చేస్తుంది. సంస్థాగత స్థాయిలో ప్రభుత్వసంస్థల విధానాలను పదునుగా విశ్లేషిస్తుంది. రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక, ఆర్థిక సంక్షేమం, భద్రత, విద్య... మొదలైన వాటిలో లింగవివక్షతకు తావు ఇవ్వని విధానం రూపుదిద్దుకునేలా తోడ్పడుతుంది. ‘లింగ వివక్ష’కు కారణమయ్యే రాజకీయ, ప్రాంతీయ, సాంస్కృతిక పరిమితులను ప్రశ్నిస్తుంది. మహిళలకు సంబంధించిన సోషల్ రీప్రొడక్షన్ రోల్స్ పబ్లిక్ బడ్జెట్లో గుర్తింపుకు నోచుకోవనే విమర్శ ఉంది. ఈ నేపథ్యంలో ‘జెండర్ బడ్జెటింగ్’కు ప్రాధాన్యత పెరిగింది. కోవిడ్ మహమ్మారి సృష్టించిన ప్రతికూలతల నేపథ్యంలో గతంతో పోల్చితే ‘జెండర్ బడ్జెటింగ్’ కు మరింత ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్ పెరిగింది. ‘కోవిడ్ సృష్టించిన కల్లోలం ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలు, స్టార్టప్‌ను మొదలు పెట్టాలనుకునేవారికి శాపంలా మారింది. ఎంతో కష్టపడి కంపెనీలు నిర్వహిస్తున్నవారు నష్టాలతో పాలుపోలేని స్థితిలో ఉన్నారు. అలాంటి వారికి పన్ను మినహాయింపు ఇవ్వాలి. జెండర్ బడ్జెటింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి’ అంటారు ఫ్లోరెన్స్ క్యాపిటల్ సీయీవో పోషక్ అగర్వాల్. ‘ఎన్నికలలో రాజకీయ పార్టీలు మహిళలను ఆకట్టుకోవడానికి రకరకాల వాగ్దానాలు చేస్తుంటాయి. అయితే వారి ఎన్నికల మ్యానిఫెస్టోలో జెండర్ బడ్జెటింగ్ అనే మాట కనిపించదు. ఇప్పటికైనా ఈ ధోరణిలో మార్పు రావాలి’ అంటారు తిరువనంతపురం (కేరళ)కు చెందిన లీనా. కొన్ని యూనిట్లు రకరకాల కారణాల వల్ల నాన్–పెర్ఫార్మింగ్ అసెట్స్(ఎన్పీఏఎస్) జాబితాలోకి వెళ్లిపోతున్నాయి. ఒక్కసారి ‘ఎన్పీఏఎస్’ ముద్ర పడిన తరువాత మహిళా పారిశ్రామికవేత్తల పరిస్థితి మరింత దిగజారుతుంది. దాంతో ఆ పారిశ్రామిక వేత్తలు పోరాటస్ఫూర్తిని కోల్పోయి నిస్తేజంగా మారుతున్నారు. ఎన్పీఏఎస్ జాబితాలో చేరిన తరువాత మహిళా వ్యాపారవేత్తలకు రుణాలు ఇవ్వడం లేదు. ఈ ధోరణిలో మార్పు రావాలంటుంది లేడి ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్. మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ (ఎంఎస్ఎంఈ) లేదా చిన్న తరహా వ్యాపారాలలో ఎంతోమంది మహిళలు ఉన్నారు. వారు ‘కేంద్ర బడ్జెట్ 2022’పై ఆశలు పెట్టుకున్నారు. వారి విజ్ఞప్తులలో ప్రధానమైనది బ్యాంక్‌లోన్‌కు సంబంధించిన వడ్డీరేటు తగ్గించాలనేది. ‘స్పెషల్ కోవిడ్ ఇన్సెంటివ్’ ప్రకటించాలని బలంగా కోరుకుంటున్నారు. వేగంగా పుంజుకోవడానికి, దూసుకెళ్లడానికి ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలి. ఈ విషయంలో బ్యాంకులు ఉదారంగా ఉండాలని కోరుకుంటున్నారు. టెక్నాలజీ అప్గ్రేడెషన్కు సంబంధించి ‘ఎంఎస్ఎంఈ’లకు బ్యాంకుల నుంచి తగిన సహకారం అందడం లేదు. ఒక దీపం మరో దీపాన్ని వెలిగించినట్లు, ఒక విజయం మరో విజయానికి స్ఫూర్తి ఇస్తుంది. అయితే కోవిడ్ తుఫాను ఎన్నో దీపాలను ఆర్పేసింది. ఈ నేపథ్యంలో సానుభూతి కంటే చేయూత ముఖ్యం అంటున్నారు మహిళా పారిశ్రామికవేత్తలు. ‘విజయాల మాటేమిటోగానీ, ఉనికే కష్టంగా మారే పరిస్థితి వచ్చింది. అట్టడుగు వర్గాలు, గ్రామీణప్రాంతాలలో ఎంతోమంది మహిళా వ్యాపారులు వడ్డీలు కట్టలేక సతమతమవుతున్నారు. వారు నిలదొక్కువడానికి ప్రభుత్వం పూనుకోవాలి’ అంటుంది ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్. విద్యారంగంపై దృష్టిపెట్టినట్లే పారిశ్రామిక రంగంపై దృష్టిపెట్టాలని, అప్పుడే సక్సెస్ఫుల్ ఫిమేల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ వస్తారనేది అందరి నమ్మకం. పది మందికి ఉపాధి చూపుతూ, వందమందికి ఆదర్శంగా నిలుస్తున్న చిన్నతరహా మహిళా వ్యాపారులకు అండగా ఉండే ఆశావహపరిస్థితిని బడ్జెట్ నుంచి ఆశిస్తున్నవారు ఎంతోమంది ఉన్నారు. ‘ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ ఎలా తయారవుతారు?’ అనే ప్రశ్నకు ‘ఉన్నత విద్యాసంస్థలలో చదువుకున్నవారు, ఉన్నత విద్యను అభ్యసించినవారు’ అనేది సరిౖయెన జవాబు కాదు. అది కాలానికి నిలిచే సమాధానం కూడా కాదు. అయితే, కాలానికి ఎదురీది కూడా నిలదొక్కునేవారే నిజమైన వ్యాపారులు అంటారు. దీనికి ప్రభుత్వ సహకారం కావాలి. ఆ సహకారం వెలుగు బడ్జెట్లో కనిపించాలి. ‘జెండర్ బడ్జెటింగ్’అనేది ఎంత ఆకర్షణీయమైన మాటో, ఆచరణ విషయానికి వచ్చేసరికి రకరకాల దేశాల్లో రకరకాల సవాళ్లు ఎదురవుతుంటాయి. దీనిలో సంప్రదాయ ఆలోచనదే అగ్రభాగం. అయితే ప్రసుత్తం మూస ఆలోచనలకు చెల్లుచీటీ పాడే కాలం వస్తుంది. ‘నిజంగానే మహిళాలోకం నిండు హర్షం వహిస్తుందా?’ అనే ప్రశ్నకు నేటి బడ్జెట్ సమాధానం చెప్పనుంది. పన్ను మినహాయింపుల ద్వారా మహిళ వ్యాపారవేత్తలను ప్రోత్సహించి నిలదొక్కుకునేలా చేయాలి. అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించాలి. – శ్రేయ సబర్వాల్, స్కైర్–ఫోర్క్ సీయీవో -
Leena Gandhi Tewari: మర్యాద ఇచ్చిపుచ్చుకుంటాం.. 3.28 లక్షల కోట్లతో మూడోస్థానంలో
Leena Gandhi Tewari Inspirational Story: ముంబైలోని ఫార్మస్యూటికల్ అండ్ బయోటెక్నాలజి కంపెని యుఎస్వీ ప్రధాన కార్యాలయం దగ్గర ఒక తోట ఉంటుంది. ఆ తోటలోనే కాదు కార్యాలయంలో కూడా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఎక్కడా అరుపులు, కేకలు వినబడవు. ప్రశాంతమైన వాతావరణంలో పని జరుగుతుంటుంది. ‘నేను నీ కంటే ఎక్కువ. నువ్వు నా కంటే తక్కువ... అనే వాతావరణం మా సంస్థలో కనిపించదు. మర్యాద ఇచ్చిపుచ్చుకునే ధోరణికి ప్రాధాన్యత ఇస్తాం’ అంటుంది లీనా గాంధీ తివారి. యుఎస్వీ చైర్పర్సన్ లీనా తివారీ తాజాగా ఫోర్బ్స్ ‘100 రిచెస్ట్ ఇండియన్స్’ జాబితాలో చోటు దక్కించుకుంది. మహిళలలో రూ.3.28 లక్షల కోట్లతో మూడోస్థానంలో నిలిచింది. చదవండి : Divya Gokulnath: ఫోర్బ్స్ లిస్ట్‌లో.. సంపద ఎంతో తెలుసా? ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్, సోషల్ రెస్పాన్స్‌బిలిటీ భిన్న ధృవాలుగా కనిపిస్తాయి. కానీ మనసు ఉన్న వాళ్లకు రెండు వేరు వేరు కావు. లీనా తివారి ఇలాంటి వ్యక్తే. వ్యాపార నైపుణ్యం, సామాజిక బాధ్యతను మిళితం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తుంది లీనా. ‘డా. సుశీలగాంధీ– సెంటర్ ఫర్ అండర్ ప్రివెలేజ్డ్ ఉమెన్’ తరఫున అట్టడుగు వర్గాల మహిళలకు అనేక రకాలుగా సహాయంగా నిలుస్తుంది. పేద గ్రామీణ విద్యార్థులకు విద్య చెప్పించడం నుంచి కంప్యూటర్లో శిక్షణ ఇప్పించడం వరకు ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది. ‘మహిళలు తమ సొంతకాళ్ల మీద నిలబడేలా చేయడానికి సహకరించడం అనేది ఒక ఎత్తు అయితే, ఆడవాళ్లు ఎంత చదువుకున్నా పురుషులతో సమానం కాదు అనే ఆధిపత్య భావజాలాన్ని తొలగించడం మరో ఎత్తు. మొదటి లక్ష్యం సులభమేకాని రెండోది మాత్రం క్లిష్టమైనది. దానికి నిరంతర కృషి కావాలి. క్లిష్టమైన వాటిని దారికి తేవడం ఎంటర్ప్రెన్యూర్ చేసే పనుల్లో ఒకటి. ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా నేను అదే చేయాలనుకుంటున్నాను’ అంటున్న లీనా మాటల్లోనే కాదు చేతల్లోనూ తన మాట నిలబెట్టుకుంటుంది. యుఎస్వీలో ఉన్నతస్థానాల్లో మహిళలు ఉన్నారు. వారి ప్రతిభ, కృషి సంస్థ విజయానికి ఇంధనంగా పనిచేస్తుంది. ‘మొదట్లో ఏ మహిళలకైనా ఏదైనా కీలక బాధ్యత అప్పగిస్తే...నేను చేయలేనేమో అన్నట్లుగా మాట్లాడేవారు. నువ్వు తప్పకుండా చేయగలవు. నీలో ఆ ప్రతిభ ఉంది...అని ప్రోత్సహిస్తే కీలక బాధ్యతలను భుజాన వేసుకోవడం మాత్రమే కాదు తమను తాము నిరూపించుకున్న మహిళలు మా సంస్థలో ఎంతోమంది ఉన్నారు’ అంటుంది లీనా. 1961లో యుఎస్వీ ఏర్పాటయింది. అప్పటి నుంచి వ్యాపార విలువలతో పాటు స్త్రీలను గౌరవించే సంస్కృతికి కూడా సంస్థ ప్రాధాన్యం ఇచ్చింది. పెద్దలు పాదుకొల్పిన ఈ విలువలను మరింత ముందుకు తీసుకువెళుతుంది లీనా. ‘యూనివర్శిటీ ఆఫ్ ముంబై’లో బి.కామ్ చేసిన లీనా బోస్టన్ యూనివర్శిటీ నుంచి ‘బిజినెస్ అడ్మిన్‌స్ట్రేషన్’లో పట్టా పుచ్చుకుంది. వ్యాపార పాఠాలు మాత్రమే కాదు జీవితపాఠాలను కూడా చదువుకుంది లీనా. అందుకే ‘ఫోర్బ్స్’ మాత్రమే కాదు ఫిలాంత్రోపి జాబితాలోనూ ఆమె అగ్రస్థానంలో ఉంటుంది. లినా మంచి రచయిత్రి కూడా. తాత విఠల్ బాలక్రిష్ణ గాంధీ జీవితంపై ఆమె రాసిన ‘బియాండ్ పైప్స్ అండ్ డ్రీమ్స్’ ఎంతోమందికి స్ఫూర్తినిచ్చిన పుస్తకం. దీనిలో ఒక వాక్యం... ‘నువ్వు గెలవడమే కాదు ఇతరుల గెలుపు గురించి కూడా ఆలోచించు' లినా తివారీ గాంధీ వ్యక్తిత్వానికి అద్దం పట్టే వాక్యం ఇది అనడంలో ఎలాంటి సందేహం లేదు. చదవండి: World Post Day: జ్ఞాపకాల మూట -
బాలీవుడ్లో విషాదం: నటి మృతి
సాక్షి, ముంబై : బాలీవుడ్‌ని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. అనారోగ్యంతో టీవీ యాక్టర్ లీనా ఆచార్య (30) మృతిచెందారు. హిందీ టెలివిజన్ సీరియల్స్‌తో తనదైన నటనతో ఆకట్టుకున్న లీనా ఆచార్య .. కిడ్నీ సంబంధ సమస్యతో ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత రెండేళ్లుగా ఆమె కిడ్నీ సమస్యతో బాధపడున్నారు. ఈ క్రమంలోనే ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. లీనా మృతిపై బాలీవుడ్ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మూడు పదుల వయసులో ఈ లోకాన్ని విడిచివెళ్లడాన్ని ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈమె చివరగా ‘క్లాస్ ఆఫ్ 2020’ అనే వెబ్ సిరీస్‌లో నటించించారు. ‘సేట్జీ’, ‘ఆప్ కే ఆ జానే సే’ మరియ ‘మేరీ హానీ కారక్ బీవీ’ వంటి సీరియల్స్ లీనాకు మంచి పేరు తీసుకొచ్చాయి. ఈమె రాణి ముఖర్జీ నటించిన ‘హిచ్కి’ తో పాటు పలు సినిమాల్లో నటించిన ఆకట్టుకున్నారు. మోడలింగ్ నుంచి హిందీ టీవీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈమె అంచలంచెలుగా ఎదిగారు. కాగా ఈ ఏడాది బాలీవుడ్ చిత్రపరిశ్రమలో చాలామంది నటులు వివిధ కారణాలతో మృతి చెందిన విషయం తెలిసిందే. -
మహిళా దర్శకురాలిపై పరువు నష్టం దావా
మహిళా దర్శకురాలు లీనా మణిమేఘలపై మరో దర్శకుడు సుశీగణేశన్ పరువు నష్టం దావా పిటిషన్‌ను దాఖలు చేశారు. వివరాల్లోకి వెళ్లితే మీటూ సామాజిక మాధ్యమం ద్వారా లైంగిక వేధింపుల ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ కోవలో తిరుట్టుప్పయలే, కందస్వామి చిత్రాల దర్శకుడు సుశీగణేశన్ లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. వాణిజ్య ప్రకటనల దర్శకురాలు లీనామణిమేఘల దర్శకుడు సుశీగణేశన్ కారులో వెళుతుండగా తనను లైంగిక వేధింపులకు గురి చేశారని ఆరోపణలు గుప్పించారు. ఆమె ఆరోపణలు ఖండించిన సుశీగణేశన్, లీనా మణిమేఘల తన వద్ద సహాయదర్శకురాలిగానూ, రచయితగానూ అవకాశాలు కోరిందన్నారు. తాను ఆమెకు అవకాశం కల్పించకపోవడంతో ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని వివరించారు. తన పేరు, ప్రతిష్టలకు కళంకం ఏర్పరచే చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దీంతో ఆయన ఆన్లైన్ ద్వారా స్థానిక సెయింట్ థామస్ మౌంట్ అసిస్టెంట్ పోలీస్ కమీషనర్‌కు దర్శకురాలు లీనా మణిమేఘలపై ఫిర్యాదు చేశారు. తనపై నిరాధార ఆరోపణలు చేసిన ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా బుధవారం సుశీగణేశన్ స్థానిక సైదాపేట మేట్రోపాల్టిన్ కోర్టులో దర్శకురాలు లీనా మణిమేఘలపై పరువు నష్టం దావా కేసు వేశారు. అందులో దర్శకురాలు లీనా మణిమేఘల తన పేరు, ప్రతిష్టలకు కళంకం ఆపాదించేలా నిరాధార ఆరోపణలు చేశారని, దీని వల్ల తాను మనస్తాపానికి గురైనట్లు పేర్కొన్నారు. కాబట్టి భారతీయ చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నెల 22వ తేదీన ఈ కేసు విచారణకు రానుంది. కాగా దర్శకురాలు లీనా మణిమేఘల కూడా తాను సుశీగణేశన్ బెదిరింపులకు భయపడనని, ఆయన్ని న్యాయపరంగానే ఎదుర్కొంటానని తన ట్విట్టర్లో పేర్కొన్నారు. -
నేనెక్కడికీ పారిపోలేదు: లీనా
తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తానెక్కడికి పారిపోలేదని కోట్ల రూపాయల మోసానికి పాల్పడిన నటి లీనా వాపోయింది. కర్ణాటక ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు పరచడానికి వ్యాపారవేత్తలు కావాలంటూ నకిలీ డాక్యుమెంట్స్‌తో వందకోట్లకు పైగా మోసానికి పాల్పడిన మోసగాడు సుహాస్ చంద్రశేఖర్. బెంగళూరుకు చెందిన ఇతను తన ప్రియురాలు నటి లీనాతో కలిసి ఈ మోసాలకు పాల్పడ్డారని నేర పరిశోధన శాఖ పోలీసుల విచారణలో తేలింది. దీంతో వీరిద్దరిని కొన్ని నెలల క్రితం అరెస్టు చేసి జైలుకు తరలించారు. కాగా నిబంధనలతో కూడిన బెయిలుపై విడుదలైన వీరు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే ఈ ప్రచారాన్ని నటి లీనా ఖండించింది. తనపై వేసి న కేసును చట్టబద్ధంగా ఎదుర్కొంటానని అంది. తాను ప్రతినెలా మొదటివారంలో పోలీసుస్టేషన్లో హాజరై సంతకం చేస్తున్నట్లు చెప్పింది. ఇందు కుగాను తాను చెన్నైలోనే ఉంటున్నట్టు వెల్లడించింది. అలాంటిది తాను ప్రేమికుడితో కలసి అజ్ఞాతంలోకి పోయినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని వాపోయింది. తానెక్కడికి పారిపోలేదని తన ఎదుగుదలను ఓర్వలేని వారు ఇలా అసత్య ప్రచారం చేస్తున్నట్లు ఆరోపించింది. ప్రస్తుతం తాను తమిళ సినిమాల్లో నటించడానికి సిద్ధం అవుతున్నట్టు నటి లీనా తెలిపింది.