నేనెక్కడికీ పారిపోలేదు: లీనా | I am not an absconder, says leena | Sakshi
Sakshi News home page

నేనెక్కడికీ పారిపోలేదు: లీనా

Published Sun, Feb 16 2014 9:11 AM | Last Updated on Sat, Sep 2 2017 3:46 AM

I am not an absconder, says leena

తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తానెక్కడికి పారిపోలేదని కోట్ల రూపాయల మోసానికి పాల్పడిన నటి లీనా వాపోయింది. కర్ణాటక ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు పరచడానికి వ్యాపారవేత్తలు కావాలంటూ నకిలీ డాక్యుమెంట్స్‌తో వందకోట్లకు పైగా మోసానికి పాల్పడిన మోసగాడు సుహాస్ చంద్రశేఖర్. బెంగళూరుకు చెందిన ఇతను తన ప్రియురాలు నటి లీనాతో కలిసి ఈ మోసాలకు పాల్పడ్డారని నేర పరిశోధన శాఖ పోలీసుల విచారణలో తేలింది. దీంతో వీరిద్దరిని కొన్ని నెలల క్రితం అరెస్టు చేసి జైలుకు తరలించారు. కాగా నిబంధనలతో కూడిన బెయిలుపై విడుదలైన వీరు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు వార్తలు వెలువడ్డాయి.

 

అయితే ఈ ప్రచారాన్ని నటి లీనా ఖండించింది. తనపై వేసి న కేసును చట్టబద్ధంగా ఎదుర్కొంటానని అంది. తాను ప్రతినెలా మొదటివారంలో పోలీసుస్టేషన్‌లో హాజరై సంతకం చేస్తున్నట్లు చెప్పింది. ఇందు కుగాను తాను చెన్నైలోనే ఉంటున్నట్టు వెల్లడించింది. అలాంటిది తాను ప్రేమికుడితో కలసి అజ్ఞాతంలోకి పోయినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని వాపోయింది. తానెక్కడికి పారిపోలేదని తన ఎదుగుదలను ఓర్వలేని వారు ఇలా అసత్య ప్రచారం చేస్తున్నట్లు ఆరోపించింది. ప్రస్తుతం తాను తమిళ సినిమాల్లో నటించడానికి సిద్ధం అవుతున్నట్టు నటి లీనా తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement