
సాక్షి, ముంబై : బాలీవుడ్‌ని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. అనారోగ్యంతో టీవీ యాక్టర్ లీనా ఆచార్య (30) మృతిచెందారు. హిందీ టెలివిజన్ సీరియల్స్‌తో తనదైన నటనతో ఆకట్టుకున్న లీనా ఆచార్య .. కిడ్నీ సంబంధ సమస్యతో ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత రెండేళ్లుగా ఆమె కిడ్నీ సమస్యతో బాధపడున్నారు. ఈ క్రమంలోనే ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. లీనా మృతిపై బాలీవుడ్ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మూడు పదుల వయసులో ఈ లోకాన్ని విడిచివెళ్లడాన్ని ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఈమె చివరగా ‘క్లాస్ ఆఫ్ 2020’ అనే వెబ్ సిరీస్‌లో నటించించారు. ‘సేట్‌జీ’, ‘ఆప్ కే ఆ జానే సే’ మరియ ‘మేరీ హానీ కారక్ బీవీ’ వంటి సీరియల్స్ లీనాకు మంచి పేరు తీసుకొచ్చాయి. ఈమె రాణి ముఖర్జీ నటించిన ‘హిచ్కి’ తో పాటు పలు సినిమాల్లో నటించిన ఆకట్టుకున్నారు. మోడలింగ్ నుంచి హిందీ టీవీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈమె అంచలంచెలుగా ఎదిగారు. కాగా ఈ ఏడాది బాలీవుడ్ చిత్రపరిశ్రమలో చాలామంది నటులు వివిధ కారణాలతో మృతి చెందిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment