ప్రముఖ బుల్లితెర నటి రాజశ్రీ ఠాకూర్.. సాత్ ఫేరే: సలోని కా సఫర్ సీరియల్‌తో ఫేమ్ తెచ్చుకుంది. మోడలింగ్‌పై ఆసక్తితో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన భామ కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన బాలీవుడ్ భామ.. కాస్టింగ్ కౌచ్ గురించి నోరు విప్పింది. ఇండస్ట్రీలో ప్రారంభ రోజుల్లో క్యాస్టింగ్ కౌచ్‌కు గురయ్యానని తెలిపింది. బాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ జరుగుతుందని.. దానికి ఎవరూ అతీతులు కాదన్నారు.
(ఇది చదవండి: నవదీప్‌తో వివాదం.. అందువల్లే తీవ్ర ఒత్తిడికి ఫీలయ్యా: ఎన్టీఆర్ హీరోయిన్)
రాజశ్రీ ఠాకూర్ మాట్లాడుతూ..' నాకు మోడలింగ్‌పై చాలా ఆసక్తి ఉండేది. అందుకే టీవీ ప్రకటనలు, ప్రెస్ షూట్‌లు చేసేదాన్ని. మనల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నించే కొంతమంది వ్యక్తులను నేను చూశా. అప్పుడు నాది చాలా చిన్న వయసు. అవతలి వ్యక్తి ఉద్దేశాలు ఏమిటో గుర్తించలేకపోయా. వాటి నుంచి అప్రమత్తంగా ఉంటే తప్పించుకోవచ్చు. ఎందుకంటే ఈ వృత్తిలో చాలా అలర్ట్‌గా ఉండాలి.. అసలు ఈ రోజుల్లో ఏ వృత్తిలోనైనా మనల్ని వాడుకోవడానికి రెడీగా ఉన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో పోటీ చాలా ఎక్కువ. ఒకరినొకరు తొక్కేసేందుకే ప్రయత్నిస్తున్నారు.' అన్నారు.
కాగా.. రాజశ్రీ తన షో 2005 సాత్ ఫేరే: సలోని కా సఫర్‌తో ఫేమ్ తెచ్చుకుంది. అంతకు ముందు ఆమె ఆల్ ఇండియా రేడియోలో మరాఠీ న్యూస్ రీడర్‌గా పనిచేసి.. యాడ్స్ కూడా చేసింది. ఆమె సప్నా బాబుల్ కా...బిదాయి, అగ్లే జనమ్ మోహే బితియా హి కిజో, భారత్ కా వీర్ పుత్ర – మహారాణా ప్రతాప్, షాదీ ముబారక్, అప్నాపన్ - బదల్తే రిష్టన్ కా బంధన్ వంటి ఇతర షోలలో కూడా నటించింది.
(ఇది చదవండి: ప్రియుడిని పెళ్లాడిన హీరోయిన్, వీడియో వైరల్)
Comments
Please login to add a commentAdd a comment