kidney failure
-
సిరప్లు తాగి కిడ్నీ సమస్యలతో చిన్నారులు మృతి.. టానిక్లపై బ్యాన్!
ఇటీవలే దగ్గు మందు తాగి చిన్నారులు మృతిచెందిన విషయం తెలిసిందే. భారత్‌కు చెందిన ఫార్మా సంస్థ మైడెన్ ఫార్మాస్యూటికల్స్ సంస్థ తయారు చేసిన నాలుగు దగ్గు, జలుబు మందు తాగి గాంబియాలో 66 మంది చిన్నారులు మృతి చెందారు. కాగా, ఈ ఘటన మరువక ముందే ఇండోనేషియాలో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సిరప్లు తీసుకున్న కారణంగానే నెల రోజుల్లో కిడ్నీ సమస్యలతో 99 మృతి చెందారు. వివరాల ప్రకారం.. ఇండోనేషియాలో అన్ని సిరప్లు, లిక్విడ్ మెడిసిన్స్‌ను నిషేధిస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, నెల రోజుల వ్యవధిలో కిడ్నీ సమస్యలతో 99 మృతి చెందినట్లు సమాచారం. ఈ కారణంగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముందస్తు చర్యల్లో భాగంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా, మృతిచెందిన పిల్లలు.. ఆయా సిరప్లు తీసుకున్న తర్వాతే కిడ్నీలు తీవ్రంగా దెబ్బతిన్నట్టు స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో, పిల్లలకు సంబంధించిన అన్ని సిరప్లు, లిక్విడ్ మెడిసిన్ విక్రయాలను నిలిపివేయాలని ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రతినిధి మొహ్మద్ సయారిల్ మన్సూర్ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు.. ఇండోనేషియాలో ఈ ఏడాది ప్రారంభం నుంచి పిల్లల మరణాల సంఖ్య గణనీయంగా పెరిగింది. The Indonesian government has announced a ban on all syrup and liquid medicine prescription and over-the-counter sales, after the deaths of nearly 100 children from acute kidney injury this year https://t.co/0rVL5yYGwg — RTÉ News (@rtenews) October 19, 2022 -
దీన స్థితిలో సీనియర్ నటి జయకుమారి.. కిడ్నీలు దెబ్బతినడంతో
చెన్నై: రెండు కిడ్నీలు దెబ్బతినడంతో సీనియర్ నటి జయకుమారి (70) చెన్నైలోని ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం చేరారు. వివరాలు.. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో 400కు పైగా చిత్రాల్లో నటించారు. తమిళంలో నాడోడి చిత్రంతో నటిగా పరిచయం అయిన ఆమె ఎంగిరిందో వందాళ్, గౌరవం, నూట్రుక్కు నూరు, అనాథై ఆనందన్ వంటి పలు చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు. జయకుమారి భర్త పేరు నాగపట్టినం అబ్దుల్లా. ఈయన చాలాకాలం క్రితమే కన్నుమూశారు. వీరికి ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. జైయకుమారి చెన్నై, వేలచ్చేరిలోని అద్దె ఇంట్లో నివశిస్తున్నారు. కాగా ఈమెకు కిడ్నీలు దెబ్బతినడంతో చికిత్స చేసుకునే ఆర్థిక స్థోమత లేక చెన్నైలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. చదవండి: పుష్ప భామకు మరో భారీ ఆఫర్.. బాలీవుడ్‌లోనూ తగ్గేదేలే..! -
Langya Virus: చైనాలో లాంగ్యా వైరస్ అలజడి.. అది ప్రమాదకరమా? లక్షణాలు ఇవే!
బీజింగ్: చైనాలో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. షాన్డాంగ్, హెనాన్ ప్రావిన్సుల్లో 35 మందికి లాంగ్యా హెనిపావైరస్ సోకినట్టు అక్కడి అధికారులు గుర్తించారు. ఇది జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే వైరస్.. మరి అసలు లాంగ్యా వైరస్ అంటే ఏంటి? దాని లక్షణాలు ఏంటి? వైరస్ ప్రమాదకరమైనదా? కాదా అనే విషయాలు తెలుసుకుందాం ... ఎప్పుడు బయట పడిందంటే.. లాంగ్యా వైరస్ 2019లో మొదటిసారిగా మనుషుల్లో గుర్తించారు. కానీ లాంగ్యా వైరస్ కేసులు ఈ ఏడాదిలోనే ఎక్కువగా నమోదవుతున్నాయి. అయితే ఒకరి నుంచి మరొరరికి సోకుతుందా? లేదా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ విషయంపై చైనా వైద్య నిపుణులు పరిశోధనలు చేస్తున్నారు. కరోనా ప్రభావం కనిపించిన 2020 జనవరి-జులై నెలల మధ్యలో లాగ్యా వైరస్ ఇన్ఫెక్షన్లు కనిపించలేదని బీజింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రోబయాలజీ అండ్ ఎపిడెమియాలజీ పరిశోధకులు వెల్లడించారు. సంబంధిత వార్త: ఓరి దేవుడో! చైనాను హడలెత్తిస్తున్న కొత్త వైరస్, 35 కేసులు నమోదు లాంగ్యా వైరస్ లక్షణాలు కానీ 2020 జులై తర్వాత 11 లాంగ్యా వైరస్ కేసులను గుర్తించారు. ఈ వైరస్ బారిన పడిన వారిలో లక్షణాలను గమనించిన పరిశోధకులు.. ఎక్కువ మంది జ్వరం బారిన పడినట్లు గుర్తించారు. లాంగ్యా వైరస్ బారిన పడిన 50 శాతం మందిలో దగ్గు, 54 శాతం మందిలో అలసట, సగం మందిలో ఆకలి లేకపోవడం, 46 శాతం మందిలో కండరాల నొప్పులు, 38 శాతం మందిలో వాంతులు వంటి లక్షణాలను గుర్తించారు. అలాగే ప్లేట్ లెట్స్ సంఖ్య పడిపోవడం, కాలేయం, మూత్రపిండాలపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని నిపుణులు వెల్లడించారు. చదవండి: ఆగని ఇజ్రాయెల్ దాడులు.. వెస్ట్‌బ్యాంక్‌లో ముగ్గురు మృతి హెనాన్, షాన్డాంగ్ ప్రావిన్సుల్లోని ఎలుకల్లా ఉండే 262 ష్రూస్‌లపై పరిశోధనలు చేయగా 71 జీవుల్లో ఈ వైరస్‌ను చైనా పరిశోధకులు గుర్తించారు. కుక్కలు (5 శాతం), మేకల్లోనూ (2శాతం) ఈ వైరస్‌ను కనుగొన్నారు. మరో విషయమేంటంటే.. సాధారణంగా గబ్బిలాలలో కనిపించే ప్రాణాంతక నిఫా వైరస్ కుటుంబానికి చెందినదే లాంగ్యా వైరస్. నిఫా కోవిడ్-19 తరహాలోనే లాంగ్యా వ్యాపిస్తుందట! అయితే నిఫా వైరస్ తదుపరి మహమ్మారికి కారణమయ్యే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అంచనా వేస్తోంది. -
చిన్నపాటి నొప్పికి కూడా ఆ మందులు వాడుతున్నారా? అయితే కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే..
సాక్షి,విజయనగరం ఫోర్ట్: గంట్యాడ మండలానికి ఓ మహిళ తలనొప్పి, కాలు నొప్పులకు నొప్పి మాత్రలు (పెయిన్ కిల్లర్స్) ఎక్కువుగా వినియోగించింది. డాక్టర్ సలహా లేకుండా సొంతంగా మెడికల్ షాపుల్లో మాత్రలు కొనుగోలు చేసుకుని వేసుకునేది. కొద్ది కాలానికి ఆమె రెండు కిడ్నీలు పాడయ్యాయి. ప్రస్తుతం ఆమె డయాలసిస్ చేయించుకుంటోంది. అలాగే విజయనగరం మండలానికి చెందిన ఓ వ్యక్తి కూడా పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వినియోగంచడంతో అతని కిడ్నీలు కూడా పాడయ్యాయి. ఇలా వీరిద్దరే కాదు.. ఎంతోమంది ప్రజలు చిన్నపాటి నొప్పికి కూడా పెయిన్‌కిల్లర్స్ వినియోగిస్తూ కోరి కష్టాలు తెచ్చుకుంటున్నారు. తాత్కలికంగా నొప్పి తగ్గడం కోసం వినియోగిస్తున్న ఈ మాత్రలు కొత్త అనారోగ్యాన్ని తెచ్చి పెడుతున్నాయి. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోయే దానికి కూడా చాలా మంది మోతాదుకు మించి మాత్రలు వేసుకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. రూ. 5 కోట్లకు పైగా మాత్రల వినియోగం.. జిల్లా వ్యాప్తంగా క్లినిక్‌లు, కార్పొరేట్ ఆస్పత్రులు, నర్సింగ్‌హోమ్‌లు 350 నుంచి 400 వరకు ఉన్నాయి. అదేవిధంగా ఉమ్మడి విజయనగరం జిల్లాలో 68 పీహెచ్‌సీలు, 20 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 11 సీహెచ్‌సీలు, జిల్లా కేంద్రాస్పత్రి, పార్వతీపురం ఏరియా ఆస్పత్రి, ఘోషా ఆస్పత్రి ఉన్నాయి. అదేవిధంగా ఆర్ఎంపీలు1500 నుంచి 2 వేల వరకు ఉంటారు. ఆయా ఆస్పత్రులు, ఆర్ఎంపీలు, నేరుగా కొనుగోలు ద్వారా ఏడాదికి జిల్లాల్లో రూ. 5 కోట్లకు పైగా పెయిన్ కిల్లర్స్ విక్రయాలు జరుగుతున్నాయి. వైద్యుల సలహాలు పాటించడం లేదు: ఏ జబ్బుకైనా డాక్టర్లు పరీక్ష చేసి మందులు ఇవ్వాల్సి ఉంటుంది. కాని ఇప్పుడు మందుల దుకాణాల్లో ఉండే సేల్స్‌బాయ్స్ వైద్యులైపోయారు. డాక్టర్ల చీటీ లేకుండానే నేరుగా మందులు ఇచ్చేస్తున్నారు. వేసుకోరాదు.. సొంతంగా పెయిన్ కిల్లర్స్ మాత్రలు కొనుగోలు చేసి వేసుకోరాదు. తప్పనిసరిగా డాక్టర్ సలహా మేరకే మందులు వాడాలి. ఎక్కువగా వాడితే కిడ్నీలపై ప్రభావం పడుతుంది. అలాగే కాలేయం, జీర్ణాశయం దెబ్బతింటాయి. డాక్టర్ బోళం పద్మావతి, జనరల్ ఫిజీషియన్ -
రాష్ట్రంలో కొత్తగా 61 డయాలసిస్ సెంటర్లు
సాక్షి, హైదరాబాద్: కిడ్నీ ఫెయిల్యూర్ రోగులకు డయాలసిస్ సౌకర్యాన్ని కల్పించడానికి కొత్తగా 61 డయాలసిస్ సెంటర్లను నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటి ద్వారా రాష్ట్రంలో 515 డయాలసిస్ పరికరాలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో సుమారు 10వేలకు పైగా కిడ్నీ బాధితులుంటారని అంచనా. తాజా నిర్ణయంతో వీరందరికీ లబ్ధి చేకూరనుంది. కొత్తగా మంజూరు చేసిన 61కేంద్రాల్లో ఐదింటిని యుద్ధప్రాతిపదికన అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందులో ఒక్కోదాంట్లో 5 డయాలసిస్ పరికరాల చొప్పున నెలకొల్పనున్నారు. నాగార్జునసాగర్‌లోని కమలానెహ్రూ ప్రాంతీయ ఆసుపత్రి, సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రి, హుస్నాబాద్ సామాజిక ఆరోగ్య కేంద్రం, జగిత్యాల జిల్లాలోని ధర్మపురి ప్రాంతీయ ఆసుపత్రి, రంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్ సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ముందుగా ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అవసరమైన చర్యలు తక్షణమే చేపట్టాలని వైద్య విధాన పరిషత్ కమిషనర్, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీకి వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. -
‘ఆమని’ని ఆదుకోండి.. దాతల సాయం కోసం వేడుకోలు..
సాక్షి, కృష్ణా: ఆడుతూ, పాడుతూ చదువుకునే వయసులో ఆ చిన్నారిని కిడ్నీ వ్యాధి పట్టి పీడిస్తోంది. రెండు కిడ్నీలు పాడైపోయిన ఆ చిన్నారి తల్లిదండ్రులు రెక్కల కష్టం మీద బతుకుబండి లాగిస్తున్నారు. అయితే చిన్న వయసులోనే కుమార్తె మంచానికి పరిమితం కావడం వారి ఆవేదన వర్ణనాతీతం. తమ ఉన్నదంతా కూతురు వైద్యానికి ఖర్చుపెట్టినా ఫలితం లేకపోయింది. కష్ణాజిల్లా గన్నవరం మండలం బుద్ధవరం శివారు రాజీవ్‌నగర్‌కు చెందిన కర్నాటి పోతురాజు చిన్న కుమార్తె వెంకట నాగ ఆమని ఎనిమిదో తరగతి చదువుతోంది. అయితే తరచు అనారోగ్యం పాలవడంతో వైద్యుల్ని సంప్రదించగా రెండు కిడ్నీలు పాడైనట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆమనికి తమిళనాడు రాయవెల్లూరు సీఎంసీ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ఇప్పటివరకూ చికిత్స కోసం రూ.7లక్షల వరకూ ఖర్చు చేశారు. అయితే కిడ్నీ మార్పిడి చేసేందుకు వైద్యులు సిద్ధంగా ఉన్నా ఆర్థిక స్తోమత లేక ఆమని తల్లిదండ్రులు.. దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నారు. కిడ్నీ మార్పిడికి సుమారు 15 లక్షలు అవుతుందని, అవి సమకూరితే తన కిడ్నీ కూతురికి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు పోతురాజు తెలిపారు. మానవతా దృక్ఫదంతో ఆమని చికిత్స కోసం దాతలు సాయం చేసి, తన కుమార్తెను బతికించాలని వేడుకుంటున్నారు. ఎవరైనా సాయం చేయాలనుకునే వారు గూగుల్ పే, ఫోన్ పే నెంబర్లు 9347464615, 9247298421 కు పంపించాలని కోరుతున్నారు. కర్నాటి వెంకటేశ్వరమ్మ ఇండియన్ బ్యాంక్ అకౌంట్ నంబర్: 6284875577 IFSC Code: IDIB000P032 వెంకటాపురం, పశ్చిమ గోదావరి జిల్లా -
కిడ్నీ ఫెయిలై కన్నుమూసిన సల్మాన్ సహనటుడు
బాలీవుడ్ నటుడు అరుణ్ వర్మ(62) కన్నుమూశారు. సల్మాన్‌ఖాన్‌తో కలిసి 'కిక్', 'ముజే షాదీ కరోగే' చిత్రాల్లో నటించిన ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. భోపాల్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన గురువారం(జనవరి 20న) కిడ్నీ ఫెయిలవడంతో తుది శ్వాస విడిచారు. ఆయన గురువారం ఉదయం 2 గంటల ప్రాంతంలో మరణించారని అరుణ్ బంధువు మీడియాకు వెల్లడించాడు. మొదట అతడి బ్రెయిన్లో కొంతభాగం పని చేయడం ఆగిపోయిందని, తర్వాత శరీరంలోని ఇతర భాగాలు పనిచేయకుండా పోగా ఊపిరితిత్తులు, కిడ్నీ ఫెయిలవడంతో ఆయన ప్రాణాలు విడిచారని చెప్పుకొచ్చాడు. కాగా అరుణ్ వర్మ సన్నీడియోల్ నటించిన 'డాకిట్' సినిమాతో బాలీవుడ్లో అడుగు పెట్టారు. నాయక్, ప్రేమ గ్రంథ్, కల్నాయక్, హీరోపంతి వంటి పలు చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నారు. సల్మాన్ ఖాన్, టైగర్ ష్రాఫ్, రిషి కపూర్ వంటి బడా హీరోల పక్కన నటించారు. -
చావు బతుకుల్లో పావని.. రెండు కిడ్నీలకు ఇన్ఫెక్షన్
ఒక కష్టం గుండె దిగక ముందే దేవుడు ఆ అమ్మాయిని మరో కొలిమిలోకి నెట్టేశాడు. అమ్మ అయ్యే క్షణం కోసం తొమ్మిది నెలలు ఎదురు చూస్తే.. పుట్టీ పుట్టగానే ఆ బిడ్డను దూరం చేశాడు. ఆ బాధ కంటి గడప దాటక ముందే ఆమె ప్రాణాన్ని ప్రమాదంలో పడేసి చోద్యం చూస్తున్నాడు. ఇరవై ఏళ్ల వయసులో రెండు కిడ్నీలు పాడైపోయి ఆ అమ్మాయి బతుకు కోసం పోరాడుతోంది. తల్లిదండ్రులు, భర్త అందరిదీ కూలి బతుకులే కావడంతో వైద్యానికి వారి ఆర్థిక స్థోమత సరిపోవడం లేదు. ఆ యువతి బతకాలంటే సాయం అవసరం. గత్యంతరం లేని పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు కూడా సమాజం నుంచి కాస్త ఆసరా ఆశిస్తున్నారు. వంగర: వంగర మండలం శివ్వాం గ్రామానికి చెందిన తొగరాపు త్రినాథ, పద్మల కుమార్తె పావని రెండు కిడ్నీలు కోల్పోయి ప్రాణాపాయ స్థితిలో ఉంది. త్రినాథ, పద్మలు విశాఖలో కూలి పనులు చేస్తుంటారు. గత ఏడాదే బిడ్డను రణస్థలంకు చెందిన పైడిపల్లి గోవిందరావుకు ఇచ్చి వివాహం చేశారు. గోవిందరావు పైడిభీమవరంలోని ఓ కంపెనీలో పనిచేస్తున్నారు. మూడు నెలల కిందట తొమ్మిది నెలల గర్భిణిగా ఉన్న పావనిని విశాఖలోని అగనంపూడి ప్రభు త్వ ఆస్పత్రికి ప్రసవం కోసం తీసుకెళ్లారు. కానీ ప్రసవ సమయంలోనే శిశువు మరణించింది. అమ్మ అయ్యాననే ఆనందం అనుభవించకుండానే ఆవిరైంది. ఆ కష్టం భరిస్తుండగానే మరో పిడుగు లాంటి వార్త వారి చెవిన పడింది. నీరసంగా ఉన్న పావనికి కిడ్నీ సమస్య ఉందని వైద్యులు నిర్ధారించారు. వెంటనే కేజీహెచ్‌కు తరలించారు. రెండు కిడ్నీలు పోయినట్లు వైద్యులు నిర్ధారించి డయాలసిస్ చేపట్టారు. అనంతరం ఆమె శివ్వాంలో ఉంటున్న అమ్మానాన్న ల వద్దకు చేరుకుంది. భర్త గోవిందరావు కూడా కూ లి పనులు చేస్తూ జీవనం సాగించడంతో పావని వైద్యం కోసం వారు నానా అగచాట్లు పడుతున్నారు. ఇరవై ఏళ్ల వయసులో కూతురు మంచానికి పరిమితం కావడం చూసి తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. కూలి పనులు చేస్తూనే ఆమెను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ఆమె బాగోగులు చూసుకోవడానికి ఇప్పుడు ఆ పనులకు కూడా వెళ్లడం లేదు. దీంతో ఆ కుటుంబానికి ఆర్థిక భారం అధికమవుతోంది. ఇలాంటి ఆపత్కాలంలో ఎవరైనా సాయం చేస్తే తమకు మేలు చేసిన వారవుతారని వారు కోరుతున్నారు. పింఛన్ కూడా ఇంకా మంజూరు కాలేదని, అధికారులు దయ చూపాలని కోరుతున్నారు. సాయం చేయాలనుకునే వారు 89781 63664 నంబర్‌ను సంప్రదించాలని కోరుతున్నారు. -
రెండు కిడ్నీలు ఫెయిల్.. ఆదుకుంటే చదువుకుంటా
చండూరు: నిరుపేద కుటుంబానికి పెద్ద కష్టం వచ్చింది. పెద్ద చదువులు చదివి ఉన్నత ఉ ద్యోగం చేయాలన్న ఆ విద్యార్థిని కోరికకు అనారోగ్య సమస్యలు అడ్డంకిగా మారాయి. వివరాలు.. నల్లగొండ జిల్లా చండూరు మండల పరిధిలోని కస్తాల గ్రామానికి చెందిన దోనాల భూపాల్‌రెడ్డి, ప్రేమలత దంపతులు 15 ఏళ్ల కిందట బతుకుదెరువు నిమిత్తం చండూరు పట్టణానికి వలస వచ్చారు. బ్యాంక్ రుణం సహాయంతో ఇక్కడే ఓ చిన్న ఇల్లు తీసుకున్నారు. చదవండి: మరుగుదొడ్డిలో నివాసం.. ‘సాక్షి’ చొరవతో సుజాతకు పక్కా ఇల్లు రైతుల నుంచి పాలు కొనుగోలు చేసి పట్టణంలో ఇంటింటికి తిరుగుతూ పాలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు సంతానం. ఇటీవల పెద్ద కుమార్తె పెళ్లి చేయగా, కుమారుడు చదువుకుంటున్నాడు. కాగా రెండో కుమార్తె గాయత్రి 8 ఏళ్ల క్రితం అనారోగ్యంపాలైంది. హైదరాబాద్‌లోని అనేక కార్పొరేట్ ఆస్పత్రుల్లో చూపించారు. రూ.18 లక్షలకు పైగా ఖర్చు చేసిన తర్వాత గాయత్రి రెండు కిడ్నీలు చెడిపోయినట్లు వైద్యులు చెప్పారు. చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద ఎకో అర్బన్ పార్క్ ‘తెలంగాణలో..’ దీంతో మందులు వాడుతూ కాలం వెళ్లదీస్తోంది. ప్రతినెలా రూ.15 వేల నుంచి రూ.18 వేల వరకు మందులకు ఖర్చవుతుందని, పాల వ్యాపారంలో వచ్చే ఆదాయం ఇల్లు గడవడానికే సరిపోతోందని తల్లిదండ్రులు చెబుతున్నారు. మందులు తెచ్చేందుకు అప్పు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు లేక రెండు నెలలుగా మందులు వాడడం లేదని, దీంతో గాయత్రి ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుందని, దాతలు ఆదుకోవాలని వేడుకుంటున్నారు. కిడ్నీల మార్పిడికి లక్షలు ఖర్చువుతుందని వైద్యులు చెబుతుండడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉంది. అనారోగ్యంతోనే డిగ్రీ పూర్తి నడవలేని స్థితిలో ఉండి కూడా గాయత్రి నల్లగొండలోని ఎన్జీ కళాశాలలో డిగ్రీ మైక్రో బయాలజీ పూర్తి చేసింది. వారంలో రెండు, మూడు రోజులు బస్సులో కళాశాలకు వెళ్లి వచ్చేది. తీవ్ర జ్వరం ఉన్నా సరే పరీక్షలు రాసి మొదటి ర్యాంకులో పాస్ అయ్యింది. ఉన్నత చదువులు చదువుతా నాకు ఉన్నత చదువులు చదువుకోవాలనే కోరిక ఉంది. కానీ ఆరోగ్యం బాగోలేక ఇబ్బంది పడుతున్నా. డబ్బులు లేక ఇటీవల మందులు కూడా వాడడం మానేశా. అక్క పెళ్లికి చేసిన అప్పు అలానే ఉండటంతో అమ్మానాన్న ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థిక పరిస్థితి సరిగా లేక తమ్ముడు చదువు మానేసి కొన్ని రోజులు ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. ఎవరైనా దాతలు స్పందించి ఆర్థికసాయం చేస్తే మా కుటుంబ కష్టాల నుంచి బయటపడుతుంది. - గాయత్రి -
సీఎం సార్ రక్షించండి ప్లీజ్..! కదిలించిన చిన్నారి వీడియో
సాక్షి, చెన్నై: రెండు కిడ్నీలు దెబ్బతినడంతో నరకాన్ని అనుభవిస్తున్న ఓ బాలిక సామాజిక మాధ్యమాల్లో పెట్టిన ఓ వీడియో సీఎం ఎంకే స్టాలిన్‌ను కదిలించింది. సోమవారం ఆస్పత్రికి వెళ్లి మరీ ఆ బాలికను పరామర్శించారు. వివరాలు.. సేలం జిల్లా అరిసియాపాళయంకు చెందిన విజయకుమార్, రాజ నందిని దంపతులకు జనని(14) కుమార్తె పదో తరగతి చదువుతోంది. పదేళ్ల వయస్సులోనే కర్రసాము, విలువిద్య, స్కేటింగ్ రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించింది. 2019లో హఠాత్తుగా ఈ బాలిక ఇంట్లో స్పృహ తప్పింది. చదవండి: CM MK Stalin: ఒక మహిళ చమత్కారం.. స్టాలిన్ నవ్వులు రెండు కిడ్నీలు దెబ్బతిన్నట్లు వైద్యులు తేల్చారు. దీంతో బిడ్డను రక్షించుకునేందుకు ఆ తల్లి తన కిడ్నీని దానం చేసింది. శస్త్రచికిత్స జరిగిన 15 రోజుల్లో తల్లి దానం చేసిన కిడ్నీ కూడా దెబ్బతింది. ప్రస్తుతం రెండు కిడ్నీలు పాడైపోవడంతో పాటుగా కాలేయం కూడా చెడిపోయింది. దీంతో తన బిడ్డ ప్రాణాల్ని రక్షించుకునేందుకు ఆ తల్లి సీఎం సెల్‌ను ఆశ్రయించింది. చెన్నై స్టాన్లీ ఆస్పత్రిలో ఆ బాలికకు వైద్యానికి ఏర్పాట్లు చేశారు. ఈ పరిస్థితుల్లో ఆదివారం ఆ బాలిక సామాజిక మాధ్యమాల్లో పెట్టిన ఓ వీడియో సీఎం స్టాలిన్‌ను కదిలించింది. చదవండి: ఒకవైపు వర్షం మరోవైపు బంద్: క్యాబ్, ఆటోల చార్జీల మోత! ఆస్పత్రిలో జనని తల్లి రాజనందినిని ఓదారుస్తున్న సీఎం ‘‘సీఎం సార్, నమస్తే...రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి..రెండేళ్లుగా నరకం చూస్తున్నాను.. డయాలసిస్ చేస్తున్నారు ..నొప్పి భరించలేకున్నాను.. నన్ను రక్షించండి..ప్లీజ్ ’’ అని ఆ బాలిక పెట్టిన వీడియోతో సీఎం చలించిపోయారు. సోమవారం మంత్రులు సుబ్రమణియన్, శేఖర్‌బాబుతో కలిసి స్టాన్లీ ఆస్పత్రికి సీఎం చేరుకున్నారు. ఆ బాలికను పరామర్శించారు. మెరుగైన వైద్యానికి చర్యలు తీసుకోవాలని వైద్యులను ఆదేశించారు. బాలిక తల్లి రాజనందిని ఓదార్చారు. ఈ సమయంలో ఆమె ఉద్వేగానికి లోనయ్యారు. -
ఆస్పత్రిపాలైన బుల్లితెర నటి, చిల్లిగవ్వ లేక దయనీయ స్థితి!
Actress Anaya Soni: బుల్లితెర నటి అనయ సోని అస్వస్థతకు గురైంది. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె ఇటీవలే ముంబైలోని హోలీ స్పిరిట్ ఆస్పత్రిలో చేరింది. ప్రస్తుతం తన దగ్గర ట్రీట్మెంట్ చేయించుకోవడానికి కూడా డబ్బుల్లేవని వాపోయింది. కాగా అనయకు ఆరేళ్ల క్రితం ఒక కిడ్నీ పాడైంది. దీంతో ఆమెకు కిడ్నీ దానం చేసేందుకు అనయ తండ్రి ముందువచ్చాడు. అలా ఆమె తండ్రి కిడ్నీని అనయకు అమర్చారు. కానీ ఇప్పుడది ఫెయిల్ అవడంతో నటి మంచానపడింది. దీంతో మరో కిడ్నీ అమర్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. తన పరిస్థితి గురించి అనయ వివరిస్తూ.. "మా అమ్మకు గార్మెంట్స్ బిజినెస్ ఉంది. కానీ కొంతకాలం క్రితం ఇంటికి నిప్పంటుకోవడంతో బట్టలు, మెషీన్లు అన్నీ బూడిదయ్యాయి. ఇప్పుడు మేం తినడానికి కూడా తిండి లేని దయనీయ పరిస్థితిలో ఉన్నాం. మరోపక్క నాకింకా డయాలిసిస్ కూడా మొదలు పెట్టలేదు. ఇప్పుడు అర్జంట్‌గా ఓ కిడ్నీ దాత కోసం ఎదురు చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితి వస్తుందని అస్సలు ఊహించలేదు, దయచేసి నాకు సాయం చేయండి" అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో రిలీజ్ చేసింది. చిన్నపాటి సాయమైనా చేయడానికి ముందు రమ్మని అభిమానులకు పిలుపునిస్తూ తన బ్యాంకు ఖాతా వివరాలను సైతం పోస్ట్‌లో పొందు పరిచింది. కాగా అనయ క్రైమ్ పెట్రోల్, అదాలత్, ఇష్క్ మేన్ మార్జవాన్ వంటి పలు షోలలో నటించింది. అలాగే తెలుగులో రుద్రమదేవి సీరియల్లోనూ ఓ పాత్రలో కనిపించింది. View this post on Instagram A post shared by ANAYA T SONI (@theanayasoni) -
పల్నాటి పీఠాధిపతిగా ఎవరినీ అడగలేక..
ఒక వైపు పల్నాటి వీరారాధనోత్సవాల ఏర్పాట్లు.. మరో వైపు అనారోగ్యానికి గురైన తల్లి.. అడుగడుగునా ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందులు.. ఇదీ పల్నాటి వీరాచార పీఠాధిపతి పిడుగు తరుణ్ చెన్నకేశవ పరిస్థితి. పీఠాధిపతిగా ఎవరినీ అడగలేక, వైద్య ఖర్చులకు నగదు అందుబాటులో లేక తల్లడిల్లుతున్నారు. పల్నాటి వీరుల ఆత్మశాంతి కోసం తపించే అతని కుటుంబానికి ప్రస్తుతం మనశ్శాంతి కరవైంది. సాక్షి, కారంపూడి(మాచర్ల): పల్నాటి వీరాచార పీఠాధిపతి పిడుగు తరుణ్ చెన్నకేశవ మాతృమూర్తి సరస్వతికి రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి. ఆమెకు భర్త, పీఠం నిర్వాహకుడు విజయ్‌కుమార్ తన కిడ్నీల్లో ఒకటి ఇచ్చారు. అయితే ఆ కిడ్నీతో జరిగిన ఆపరేషన్ విఫలమైంది. దీంతో వారానికి మూడుసార్లు డయాలసిస్ చేయించాల్సి వస్తోంది. కిడ్నీ ఇచ్చినప్పటి నుంచి విజయ్‌కుమార్ ఆరోగ్యం కూడా దెబ్బతింది. పల్నాటి వీరారాధనోత్సవాల నిర్వహణకు కోవిడ్ వల్ల ఇబ్బందులు రావడం దీనికి మరింత తోడైంది. పీఠాధిపతి తల్లయినా.. విజయ్‌కుమార్, సరస్వతి దంపతులకు ముగ్గురు సంతానం. పీఠాధిపతి తరుణ్ చెన్నకేశవ తొలి సంతానం. ఆయన డిగ్రీ ఆఖరి సంవత్సరం చదువుతున్నారు. పెద్ద కుమార్తె తులసీ ప్రియాంక బీటెక్, చిన్న కుమార్తె కావ్య ఇంటర్ చదువుతున్నారు. కుటుంబ పోషణ కోసం సరస్వతి కూడా కారంపూడిలో సేవా సంస్థ నడుపుతున్న స్కూల్లో టీచర్‌గా పనిచేసేవారు. ఇంటికొచ్చిన ఆచారవంతులను సరస్వతి చాలా బాగా చూసుకునేవారు. ఆచారవంతుల్లో పేదలుంటే వారందరికీ తనే భోజనం చేయించి ఉత్సవాలలో వడ్డించేవారు. ఇబ్బందులతో ఉమ్మడి కుటుంబం నడక.. పీఠాధిపతి తరుణ్ చెన్నకేశవది ఉమ్మడి కుటుంబం. తొమ్మిది మంది సభ్యులు ఉన్నారు. వారి ఇంటి కింది భాగంలో మూడు షాపులపై ఏడాదికి వచ్చే రూ.1.20 లక్షలే వారికి జీవనాధారం. ఉత్సవాలప్పుడు వీరాచారవంతులు ఇచ్చే కానుకలు కొంత ఆదుకుంటున్నాయి. అద్దెలు, కానుకలు చాలక విజయ్‌కుమార్ సోదరి విష్ణు, సరస్వతి ప్రైవేటు టీచర్లుగా పనిచేస్తున్నారు. పాత ఇల్లు పడేసి, షాపులతో కూడిన ఇల్లు నిర్మించకముందు ఉత్సవాల నిర్వహణకు పీఠాధిపతి పిడుగు ఆంజనేయశివప్రసాద్ ఇంకా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బ్రహ్మనాయుడు చాపకూడు సిద్ధాంతం అమలు చేయడానికి ఉన్నత చదువు చదువుకున్న ఆయనకు ఇతరులను సాయం అడగడానికి ప్రాణం ఒప్పలేదు. అప్పట్లో ఆయన మిత్రులుగా ఉన్న తెలుగు విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ వెంకటేశ్వర్లు, తోట చంద్రశేఖర్, ఒక జర్నలిస్టుతో కలసి పులిహోర చేయించి దానితోనే సంప్రదాయాన్ని నెరవేర్చారు. ఆంజనేయశివప్రసాద్కు సంతానం లేకపోవడంతో అప్పట్లో తరుణ్చెన్నకేశవను దత్తత తీసుకున్నారు. ఆయన గుండెపోటుతో మృతి చెందిన తర్వాత ఏడేళ్ల వయస్సు నుంచి తరుణ్ చెన్నకేశవ పీఠాధిపతిగా ఉత్సవ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. -
బాలీవుడ్లో విషాదం: నటి మృతి
సాక్షి, ముంబై : బాలీవుడ్‌ని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. అనారోగ్యంతో టీవీ యాక్టర్ లీనా ఆచార్య (30) మృతిచెందారు. హిందీ టెలివిజన్ సీరియల్స్‌తో తనదైన నటనతో ఆకట్టుకున్న లీనా ఆచార్య .. కిడ్నీ సంబంధ సమస్యతో ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత రెండేళ్లుగా ఆమె కిడ్నీ సమస్యతో బాధపడున్నారు. ఈ క్రమంలోనే ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. లీనా మృతిపై బాలీవుడ్ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మూడు పదుల వయసులో ఈ లోకాన్ని విడిచివెళ్లడాన్ని ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈమె చివరగా ‘క్లాస్ ఆఫ్ 2020’ అనే వెబ్ సిరీస్‌లో నటించించారు. ‘సేట్జీ’, ‘ఆప్ కే ఆ జానే సే’ మరియ ‘మేరీ హానీ కారక్ బీవీ’ వంటి సీరియల్స్ లీనాకు మంచి పేరు తీసుకొచ్చాయి. ఈమె రాణి ముఖర్జీ నటించిన ‘హిచ్కి’ తో పాటు పలు సినిమాల్లో నటించిన ఆకట్టుకున్నారు. మోడలింగ్ నుంచి హిందీ టీవీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈమె అంచలంచెలుగా ఎదిగారు. కాగా ఈ ఏడాది బాలీవుడ్ చిత్రపరిశ్రమలో చాలామంది నటులు వివిధ కారణాలతో మృతి చెందిన విషయం తెలిసిందే. -
నాడు దానం చేసి.. నేడు క్షణమొక యుగంలా
సాక్షి, కంకిపాడు (పెనమలూరు): ఉన్న రెండు కిడ్నీలు పాడై క్షణం ఒక యుగంలా కాలం వెళ్లదీస్తోంది ఓ సోదరి. తన తోబుట్టువుకు చిన్న వయస్సులోనే వచ్చిన కష్టం చూసి తల్లడిల్లిపోతూ కంటికి రెప్పలా కాపాడుకుంటోంది ఆమె సోదరి. చిన్నతనంలోనే తల్లిని, ఊహ తెలిశాక తండ్రిని కోల్పోయారు వారిరువురూ. తండ్రి మరణంతో అవయవాలను దానం చేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. నాడు ఔదార్యం చాటిన చిట్టి మనస్సులు నేడు సాయం కోసం చెమర్చిన కళ్లతో ఎదురుచూస్తున్నాయి. మండలంలోని మద్దూరు గ్రామానికి చెందిన కొప్పనాతి పార్వతి, లక్ష్మీ తిరుపతమ్మ సోదరీమణులు ఎదుర్కొంటున్న కష్టం వారి మాటల్లోనే.... కొప్పనాతి నాగరాజు, వీరకుమారి మా అమ్మానాన్న. మాకు ఉహ కూడా తెలీదు. చిన్నతనంలోనే మా అమ్మ చనిపోయింది. నాన్న కూలీ చేసి మమ్మల్ని పోషించాడు. 2013 లో కృష్ణా కరకట్టపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆగి ఉన్న ఊక లారీని మరో లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో మా నాన్న నాగరాజు తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చేర్చారు. పది మందిలో బతికుంటాడని! గాయాలు తీవ్రంగా అవ్వటంతో డాక్టర్లు బ్రెయిన్ డెడ్‌కేసుగా తేల్చారు. లాభం లేదని చెప్పారు. ఆ సమయంలో వైద్యు లు అవయవ దానం గురించి చెప్పారు. అవయవాలను దానం చేయటం ద్వారా మా నాన్న పది మందిలో బతికి ఉంటారని భావించాం. ఎలాంటి లాభం ఆశించకుండా కళ్లు, గుండె, కిడ్నీలు, పనికి వచ్చే ప్రతి అవయవాన్ని తీసుకున్నారు. మనస్సులో బాధ ఉన్నా సంతోషంగా అవయవాలు దానమివ్వటం జరిగింది. (ముగిసిన రజిత ప్రేమ ప్రయాణం) రెండేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధ! నాన్న చనిపోయాక మద్దూరులో అమ్మమ్మ దగ్గర పెరిగాం. హాస్టల్లో ఉండి పదోతరగతి వరకూ చదువుకున్నాం. రెండేళ్ల కిందట అక్క పార్వతికి వివాహం జరిగింది. ఆమె కు అయిన ఆర్నెల్లకు నాకు వివాహం జరిగింది. అయితే కిడ్నీ సమస్య ఏర్పడటంతో అక్కకు ఆమె భర్త దూరంగా ఉంటున్నారు. అమ్మమ్మ దగ్గరే ఉంచి అక్కను ఆసుపత్రుల చుట్టూ తిప్పాం. కిడ్నీలు రెండూ పాడయ్యాయని, జీవన్ పథకం కింద కిడ్నీ మారి్పడికి రూ.30 లక్షలు వరకూ ఖర్చు అవుతుందని, ఆరోగ్యశ్రీ కిందకు వైద్యం రాదని వైద్యులు చెప్పారు. రూ 30 లక్షలు అంటే మా శక్తికి మించింది. ఎలాంటి ఆధారం లేదు. పింఛనుగా వచ్చే రూ.10 వేలుతో అవసరమైన ఖర్చులు పెట్టి డయాలసిస్ చేయించుకుంటూ అక్క పార్వతి ఆరోగ్యం కాపాడుకుంటూ వస్తున్నా. అక్క ప్రాణాలు కాపాడుకోవాలి’ అంటోంది చెల్లెలు లక్ష్మీ తిరుపతమ్మ. సాయం అందించండి నా ఆరోగ్యం పాడై చాలా ఇబ్బంది పడుతున్నా. డయాలసిస్‌కు, ఇతర ఖర్చులకు పింఛనుతో పాటుగా చెల్లి ఎంతో ఆదుకుంటోంది. కానీ వైద్యం చేయించుకోవాలంటే రూ.30 లక్షలు కావాలంటున్నారు. మాకు వెన్నుదన్నుగా ఎవరూ లేరు. నా కాళ్ల మీద మళ్లీ నేను బతకాలనుంది. అలా జరగాలంటే కిడ్నీ మార్పిడి జరగాలి. సాయం అందించాలని వేడుకుంటున్నా. –కొప్పనాతి పార్వతి -
దానివల్లే కిడ్నీ సమస్యలు..
అవయవాల్లో కిడ్నీలకు చాలా ముఖ్యమైన పాత్ర ఉంది. శుద్దిచేసిన రక్తాన్ని గుండెకి పంపి మనిషి జీవన ప్రమాణాన్ని పెంచేవి కిడ్నీలు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 85 కోట్ల మంది కిడ్నీ జబ్బుతో బాధపడుతున్నారని అంచనా. మనదేశంలో ప్రతి 10 మందిలో ఒకరు దీర్ఘకాలిక కిడ్నీజబ్బు బారినపడుతున్నారు. చాలామందికి దీనిపై అవగాహన లేకపోవడం వల్ల చివరిదశకు చేరుకునేంతవరకూ సమస్యను గుర్తించలేకపోతున్నారు. ఇది చివరకు కిడ్నీ పాడవడానికి దారితీస్తుంది. వరల్డ్ కిడ్నీ సందర్భంగా కిడ్నీల పాత్ర, కిడ్నీ సమస్య తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇప్పుడు చూద్దాం. కిడ్నీలు రక్తాన్ని శుద్దిచేయడమే కాదు, విటవిన్డి ని ప్రేరేపించి ఎముకపుష్టికి తోడ్పడతాయి. ఎరిత్రోపాయిటిన్‌ను ఉత్పత్తి చేస్తూ హిమోగ్లోబిన్ రక్తకణాల తయారీలో పాలు పంచుకుంటాయి. రక్తంలో సోడియం, పొటాషియం వంటి ఎలక్రోలైట్ల మోతాదులను తగు స్థాయిల్లో ఉండేల్లా చేస్తాయి. ఏ కారణంచేతైనా కిడ్నీలు చతికిలపడితే మన శరీరం మెత్తం వ్యర్థపదార్థాలతో నిండుతుంది ఈ పరిస్థితి చివరకు ప్రాణాపాయానికి దారితీస్తుంది. ఈ విపత్కర పరిస్థితి నుంచి బయటపడటానికి కిడ్నీల్లాగా పనిచేసే కృత్రిమ యంత్రాల సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియనే డయాలసిస్ అంటారు. ప్రస్తుత జీవన ప్రమాణంలో వయసుతో సంబంధం లేకుండా కిడ్నీవ్యాధి బారిన పడుతున్నారు. యువతతో పాటు చిన్నపిల్లల్లోనూ ఈ సమస్య కనిపిస్తుంది. గ్యాస్ర్టిక్, పెయిన్‌కిల్లర్ మందులు ఎక్కువగా వాడటం, కలుషిత నీరు తాగడం, తగినంత నీరు తీసుకోకపోవడంతో కిడ్నీ సమస్యలు వాటిల్లుతాయని డాక్టర్లు చెబుతున్నారు. అంతేకాకుండా పొగతాగడం వల్ల రక్తపోటు పెరిగి అది కిడ్నీలపై తీవ్ర ప్రభావాన్ని చూపతాయి. యాంత్రిక జీవనంలో శారిరక శ్రమ లేకపోవడం వల్ల ఊబకాయానికి దారితీస్తుంది. అందుకే క్రమం తప్పకుండా నడక, జాగింగ్ లాంటివి దైనందిన జీవనంలో భాగం చేసుకోవాలి. రోజుకు కనీసం 10 వేల అడుగులైనా నడవడం చాలా ముఖ్యం. వీటితో పాటు నొప్పి నివారణకు అవసరమైతేనే మాత్రలను వేసుకోవడం, రక్తహీనత తలెత్తకుండా చూసుకోవడం లాంటి జాగ్రత్తలు పాటించాలి. -
తాగినా.. టాబ్లెట్ తీసుకున్నా కిడ్నీ గోవిందా..!
మూత్రపిండాల ఆరోగ్యాన్ని దెబ్బతీసే వాటిల్లో ప్రధానమైనవి కొందరు తాము రోజూ అలవాటుగా తీసుకునే మద్యం. దాంతో పాటు మనం డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా తీసుకునే ఆన్ కౌంటర్ మందులు కూడా. ఈ రెండిటిలోనూ చీప్‌లిక్కర్ అన్నది కిడ్నీలను దెబ్బతీస్తుందని మనం చాలాసార్లు వింటూనే ఉంటాం. చాలా మంది కిడ్నీ బాధితుల్లో ఇదో ప్రధానమైన కారణం. సాధారణంగా మన రక్తంలోని మలినాలను శుభ్రపరచడం అన్నది కిడ్నీల పని కదా. చీప్లిక్కర్లో మత్తును సమకూర్చడానికి వేసే వివిధ రకాల రసాయనాలు, యూరియా వంటి వాటిని రక్తం నుంచి ఒంట్లోంచి తొలగించడానికి కిడ్నీలు తమ సామర్థ్యానికి మించి కష్టపడతాయి. అవెంతగా కష్టపడతాయంటే... అలా మలినాలనూ, కాలుష్యాలనూ తొలగిస్తూ, తొలగిస్తూ, తమ సామర్థ్యాన్ని క్రమంగా కోల్పోతుంటాయి. దాంతో ఒక దశలో అవి కాలుష్యాలనే తొలగించలేని స్థితికి చేరుకుంటాయి. దీన్నే కిడ్నీ ఫెయిల్యూర్‌గా చెబుతుంటారు. ఇదే పరిణామం మద్యం వల్ల కూడా వస్తుంది. వాస్తవానికి మద్యం అంటేనే కూడా బాటిలెత్తు కాలుష్యం. దాంతో ఆ కలుషిత పదార్థాలను తొలగించే ప్రక్రియను నిరంతరాయం చేస్తూ చేస్తూ కిడ్నీలు అలసిపోతాయి. ఇక ఆన్ కౌంటర్ డ్రగ్స్‌గా మనం పేర్కొనే మందులతోనూ ఇదే అనర్థం కలుగుతుంది. ఆ మందులలోని మలినాలను తొలగించడానికి కిడ్నీలు కష్టపడతాయి. మందులలోని ఆ మాలిన్యాలను తొలగించేలోపే మళ్లీ వేసుకున్న మందులలోని కాలుష్యాలు మూత్రపిండాలను దెబ్బతీస్తాయి. గంటకు 12 లీటర్లను మాత్రమే శుభ్రపరచగలిగే ఈ కిడ్నీలు మరి అంతటి కాలుష్యాల పోగులను శుభ్రం చేయాలంటే ఎంత కష్టం? అందుకే అంతటి కష్టాన్ని భరించలేనంతటి భారం వాటిమీద పడుతున్నప్పుడు మూత్రపిండాలకు ‘క్రానిక్ కిడ్నీ డిసీజ్’ (సీకేడీ) లాంటి జబ్బులు వస్తాయి. అవి కిడ్నీ ఫెయిల్యూర్ లాంటి కండిషన్లకు దారితీస్తాయి. అలాంటప్పుడు కృత్రిమంగా కేవలం కొద్దిమేరకు అంటే మనిషి జీవించి ఉండగలిగే మేరకు మాత్రమే ఒంట్లోని కాలుష్యాలను యంత్రాల సహాయంతో తొలగించే ప్రక్రియ అయిన ‘డయాలసిస్’తో నిత్యం నరకబాధలను చూస్తూ రోజులు రోజుల ప్రాతిపదికన రోగులు తమ ప్రాణాలను దక్కించుకుంటూ ఉంటారు. ఇలాంటి బాధలేమీ పడకుండా నిండా ఆరోగ్యంతో నిండు నూరేళ్లు జీవితం గడపాలంటే మద్యం అలవాటు మానేయాలి. అలా రెండంటే రెండు కిడ్నీలను పదిలంగా చూసుకోవాలి. ఇక నొప్పి భరించలేనంతగా ఉండటమో లేదా మర్నాడు డాక్టర్ దగ్గరికి వెళ్లేలోపు కాస్త ఉపశమనంగానో తప్ప... అలవాటుగా ఆన్ కౌంటర్ డ్రగ్స్ వాడనేకూడదని గుర్తుంచుకోండి. -
కొద్ది రోజుల్లో పెళ్లి..కానీ అంతలోనే
సాక్షి, లావేరు(శ్రీకాకుళం) : మరికొద్ది రోజుల్లో తన పెద్ద కుమార్తెకు పెళ్లి జరిపించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆనందంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇంతలోనే ఆ ఇంటి యజమాని వైఎస్సార్సీపీ నాయకుడు పడాల వెంకన్న(43) మృతి చెందడంతో ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ సంఘటన లావేరు గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఈయన పెద్ద కుమార్తెకు విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం కందివలస గ్రామానికి చెందిన తన బావమరిదితో ఈ నెల 25న వివాహం చేసేందుకు ముహూర్తం నిశ్చయించాడు. ఈ నేపథ్యంలో కిడ్నీ, లివర్ సంబంధిత వ్యాధులతో వెంకన్న బాధపడుతున్నాడు. గురువారం రాత్రి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించడంతో తన ఇంటి వద్దే మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెళ్లికార్డులు పంచడంతోపాటు పెళ్లి పనుల్లో నిమగ్నమైన సమయంలో ఇంటి యజమాని మరణించడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఇక మాకు దిక్కెవరూ అంటూ మృతదేహంపై పడి రోదిస్తున్న తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. వైఎస్సార్సీపీ నాయకులు పరామర్శ వైఎస్సార్సీపీ నాయకుడు పడాల వెంకన్న మృతి చెందడంతో పార్టీ సీనియర్ నాయకులు మహదాసు రాంబాబు, లంకలపల్లి గోపి, లంకలపల్లి నారాయణరావు, వట్టి సత్యనారాయణ, పడాల పాపారావు, లంకలపల్లి చిన్నారావు, సగరపు విశ్వనాథం, లంకలపల్లి భాస్కరరావు, తలారి నాగయ్య, ఇనుకోటి చిన్న, పైడి దాము, ఇనపకురి చలపతి, కొండక ప్రసాద్, తదితరులు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలియజేశారు. -
పేదింటి బిడ్డకు పెద్ద కష్టం
సాక్షి, విశాఖపట్నం : విధి ఎప్పుడు ఎవరితో ఎలా ఆడుకుం టుందో ఎవరికీ తెలీదు. విధి మూలంగా కొందరు ప్రాణాలు కోల్పోతే మరికొందరు మంచానికే పరిమితమవుతున్నారు. ఇప్పుడు చదువుతున్న ధనోజ్(ఆరేళ్లు) కన్నీటి గాధ అటువంటిదే. నిత్యం ఆటపాటలతో తోటివారితో సరదాగా గడపాల్సిన లేత వయసులో రెండు కిడ్నీలు పాడవడంతో మంచానికే పరిమితమయ్యాడు. తనకేం కష్టం వచ్చిందో కూడా తెలి యని వయసు. తన బాధను చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులను చూసి తనకేదో అయిపోందనుకే చిన్నారి ఆవేదన వర్ణనాతీతం. పూర్తి స్థాయిలో వైద్యం చేయించుకుందామంటే ఆర్థిక పరిస్థితి అడ్డుపడుతోంది. ఆటో డ్రైవర్‌గా ఉన్న దనోజ్ తండ్రి రెండు నెలల కిందట తన ఇద్దరు పిల్లల వైద్యం కోసం సుమారు రూ.2 లక్షలు, ధనోజ్ కోసం గత నాలుగు రోజుల్లో మరో రూ.2 లక్షలు ఖర్చుచేశాడు. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం ప్రస్తుతం చేతిలో చిల్లి గవ్వ లేకపోవడంతో ఆపన్నులు సాయం కోసం ఎదురుచూస్తోంది.అనకాపల్లి రేబాక గ్రామానికి చెందిన ముమ్మన సత్యనారాయణ ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిం చుకుంటున్నాడు. భార్య లలిత గృహిణి. వీరికి ప్రదీప్, ధనోజ్, నితిన్ సంతానం. ధనోజ్, నితిన్‌కు రెండు నెలల క్రితం డెంగ్యూ వ్యాధి సోకడంతో రూ.2 లక్షల వరకూ ఖర్చయ్యింది. జ్వరం తగ్గిందనుకున్న పది రోజల్లోనే ధనోజ్‌కు మొహం పొంగింది. వెంటనే సమీపంలో ఉన్న లండన్ చిల్డ్రన్స్ హాస్పటల్లో చేర్చారు. వైద్యులు పరీక్షలు నిర్వహించారు. అకస్మాత్తుగా ఓ రోజు రోడ్డుపై సొమ్మసిల్లి పడిపోయాడు. తర్వాత రోజు నిద్రలో మూర్చపోయినట్టు నాలుక కరుచుకోవడం చూసి ఆస్పత్రికి తీసుకువెళ్లారు. బాలుడికి వైద్య పరీక్షలు నిర్వహించిన లండన్ చిల్డ్రన్స్ హాస్పటల్ వైద్యులు విశాఖలోని ఓమ్నీ ఆర్కే ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించగా రెండు కిడ్నీలు పాడైనట్లు చెప్పారు. ప్రస్తుతం బాలునికి డయాలసిస్ చేస్తున్నారు.ఆర్థికంగా చితికిపోయామని, సాయం చేసి తన బిడ్డను కాపాడాలని సత్యనారాయణ వేడుకుంటున్నాడు. సాయం చేసే దాతలు 9949718928 నంబరుకు ఫోన్ చేయాలని అభ్యర్థించాడు. ఖాతాదారుని పేరు ముమ్మన లలిత, భారతీయ స్టేట్‌బ్యాంక్, అకౌంట్ నంబరు 38316378836, గవరపాలెం బ్రాంచ్, అనకాపల్లి, ఐఎఫ్ఎస్సీ కోడ్ ఎస్బీఐఎన్0011112లో డబ్బులు వేసి సాయం చేయవచ్చు. -
సారీ..మా వద్ద మందుల్లేవు..!
సాక్షి, హైదరాబాద్ : బోడుప్పల్‌కు చెందిన ఈఎస్ఐ లబ్ధిదారుడు రమేశ్ కొంతకాలంగా కిడ్నీ వైఫల్యంతో బాధపడుతున్నారు. ఆయన ఈఎస్ఐ కార్డుపై డయాలసిస్ చేయించుకుంటున్నప్పటికీ...నెలకు 2 ‘ఐరన్ సుక్రోస్ 5ఎంజీ ఇంజక్షన్స్‌తో పాటు పన్నెండు ‘4కే బ్లడ్ ఇంజక్షన్లు’అవసరం. కానీ గత 2 నెలలుగా ఆయనకు ఆ మందులు అందడం లేదు. దీంతో ఆయన వాటిని ప్రైవేటుగా కొనుగోలు చేస్తున్నారు. వీటి కోసం నెలకు రూ.25 వేలకుపైగా ఖర్చు చేస్తున్నారు. అసలే ఆయనది ప్రైవేటు సంస్థలో చిరుద్యోగం.. చాలీచాలని జీతం..ఆపై మందుల కొనుగోలుకు అప్పులు చేయాల్సి వస్తోంది. ఇది ఒక్క రమేశ్ ఎదుర్కొంటున్న సమస్య కాదు...ఈఎస్ఐ పరిధిలో ఉన్న వెయ్యి మందికిపైగా కిడ్నీబాధితులు ఇదే సమస్యతో అవస్థలు పడుతున్నారు. రోగులకు మందులు సరఫరా చేయాల్సిన ఈఎస్ఐ తనకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. రెండు నెలల నుంచి సరఫరా కానీ మందులు వివిధ ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల్లో పని చేస్తున్న రూ.25 వేల లోపు వేతనం ఉన్న చిరుద్యోగులంతా ఈఎస్ఐ పరిధిలోకి వస్తారు. ప్రతీనెలా వీరంతా ఈఎస్ఐ ఖాతాలో తమ వాటాను జమ చేస్తుంటారు. ఏవైనా ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు వారికి ఈఎస్ఐ కార్డుపై ఉచితంగా వైద్యసేవలు అందాలి. వీరికి సనత్‌నగర్, నాచారం ఈఎస్ఐ ఆస్పత్రుల్లో చికిత్సలు అందిస్తుంటారు. వీటిలో ఆయా చికిత్సలు అందుబాటులో లేక పోతే వారిని ప్రైవేటు ఆస్పత్రులకు సిఫార్సు చేస్తుంటారు. లబ్ధిదారుల్లో వెయ్యి మందికిపైగా కిడ్నీ బాధితులు ఉండగా, మరో వెయ్యి మంది వరకు కాలేయ, కేన్సర్ సంబంధ బాధితులు ఉన్నారు. సాధారణ రోగుల మందులతో పోలిస్తే వీరి మందులు చాలా ఖరీదు. వీటిని కొనుగోలు చేయడం భారం. దీంతో ఆయా మందులను కూడా ఈఎస్ఐ సరఫరా చేస్తుం ది. దీనికోసం సనత్‌నగర్ ఈఎస్ఐలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసింది. బాధితులకు స్థానికంగా ఉన్న డిస్పెన్సరీల్లో మందులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దీంతో వారంతా తమ పరిధిలోని డిస్పెన్సరీలకు వెళ్లినప్పటికీ..గత 2 నెలల నుంచి మందులు ఇవ్వడం లేదు. తాము ఇండెంట్ పెడుతున్నా మందుల సరఫరా చేయడంలేదని వారి సమాధానం. దీంతో వీటిని రోగులే సమకూర్చుకుంటున్నారు. వీటి ఖరీదు ఎక్కువగా ఉండటం, వాటిని కొనుగోలు చేసే స్థోమత కార్మికులకు లేక పోవటంతో బాధితుల ఆరోగ్యం మరింత దెబ్బతిని కొందరు మృత్యువాతపడుతున్నారు. ఆరోగ్యశ్రీ రోగులది అదే దుస్థితి.. ఈఎస్ఐ లబ్ధిదారుల పరిస్థితి ఇలా ఉంటే..ఆరోగ్యశ్రీ లబ్ధిదారుల పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. మూత్రపిండాల వైఫల్యం, కాలేయం పనితీరు దెబ్బ తినడం, కేన్సర్ సహా హృద్రోగ సమస్యలతో బాధపడుతూ ఆరోగ్యశ్రీ కార్డుపై చికిత్స కోసం ప్రతిష్టాత్మాక నిమ్స్, ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న రోగులకు తీరా ఆయా ఆస్పత్రుల్లో చేదు అనుభవమే ఎదురవుతోంది. చికిత్సలు జరుగుతున్నప్పటికీ..వారికి ఉచితంగా అందాల్సిన మందులు మాత్రం ఇవ్వడం లేదు. అదేమంటే వీటి ఖరీదు ఎక్కువగా ఉందని, అందుకే వీటిని ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని సిబ్బంది స్పష్టం చేస్తున్నారు. ఆర్థిక స్థోమత ఉన్న రోగులు వీటిని సమకూర్చుకోగలిగినప్పటికీ..నిరుపేదలు మందులకు నోచుకోవడం లేదు. శస్త్రచికిత్సల అనంతర వైద్యం కోసం వస్తున్న రోగులకు మందులు అంద డం లేదు.అసలే పేదరికం ఆపై ఈ ఖరీదైన మందు లు కొనుగోలు చేసే స్థోమత లేక అనేక మంది ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నా పట్టించుకున్నవారు లేని దుస్థితి నెలకొంది. అటు ఈఎస్ఐ, మరో వైపు ప్రభుత్వ ఆరోగ్యశాఖ దీనిపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. -
ప్రాణభిక్ష పెట్టండి
ఆ కుటుంబానికి అతడే ఆధారం.. కాయకష్టం చేసి కుటుంబాన్ని పోషించేవాడు.. ఏ చిన్న కష్టం వచ్చినా అన్నీ తానై కుటుంబానికి అండగా నిలిచేవాడు.. అలాంటి వ్యక్తిపై విధి పగబట్టింది. తొలుత అనారోగ్యం చేయడంతో ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నాడు. ఆపరేషన్ అవసరమని డాక్టర్లు సూచించడంతో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఆపరేషన్ చేయించుకున్నాడు. ఆరోగ్యం కుదుటపడిందని అనుకుంటున్న సమయంలో మరోసారి కిడ్నీ సంబంధిత సమస్యతో ఆస్పత్రికి చేరాడు. రెండు కిడ్నీలు చెడిపోయాయని డాక్టర్లు చెప్పడంతో ఏం చేయాలో దిక్కుతోచక మంచానికే పరిమితమయ్యాడు. కిడ్నీ దానం చేసేందుకు అతని మాతృమూర్తి ముందుకువచ్చినా ఆపరేషన్ చేయించుకునేందుకు ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదని బాధితుడు మైనంపాటి నాగేంద్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దాతలు సహకరించి తనకు ప్రాణభిక్ష పెట్టాలని వేడుకుంటున్నాడు. నెల్లూరు, అల్లూరు: అల్లూరు మండలం ఇందుపూరు గ్రామానికి చెందిన మైనంపాటి వెంకటేశ్వర్లు(లేట్), నాగమ్మల కుమారుడు నాగేంద్ర. వయస్సు 31 సంవత్సరాలు. అల్లూరు రామకృష్ణ డిగ్రీ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన నాగేంద్ర నృత్య కళాకారుడు కూడా. వీరిది నిరుపేద కుటుంబం. కుటుంబాన్ని పోషించుకునేందుకు చెన్నైలో దినసరి కూలీగా పనిచేసేవాడు. నాగేంద్రకు భార్య కస్తూరి, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. అంతాబాగుందనుకుంటున్న సమయంలో విధి పగబట్టింది. నాగేంద్రకు తరచూ కడుపునొప్పి వస్తుండడంతో హాస్పిటల్ చూపించుకుంటే కడుపులో 3 కిలోల కణిత ఉందని డాక్టర్లు చెప్పారు. వెంటనే ఆపరేషన్ చేసి తీసివేయాలని చెప్పగా ఎలాగోలా తన వద్ద ఉన్న డబ్బుతో ఆపరేషన్ చేయించుకున్నాడు. డాక్టర్లు కణితి తొలగించారు. కానీ సమస్య అంతటితో అయిపోలేదు. నాగేంద్ర కిడ్నీ సంబంధిత వ్యాధికి గురయ్యాడు. రెండు కిడ్నీలు పూర్తిగా చెడిపోయి దీనస్థితిని అనుభవిస్తున్నాడు. ఇప్పటివరకు వైద్య చేయించుకునేందుకు రూ.3 లక్షల వరకు ఖర్చయింది. వారానికి రెండుసార్లు డయాలసిస్ చేయించుకోవాలని వైద్యులు సూచించారు. అందుకోసం నెలకు రూ.10 వేల వరకు మందులతో సహా ఖర్చవుతోంది. అసలే నిరుపేద కుటుంబం అంత పెద్ద మొత్తం ఖర్చు చేసే ఆర్థిక స్థోమత లేక నానాఅవస్థలు పడుతున్నారు. కిడ్నీ దాతలు ముందుకు వచ్చి కిడ్నీ దానం చేస్తే తప్ప నాగేంద్ర బతకడని వైద్యులు తెలిపారు. ఆçపరేషన్ చేస్తే బతికే అవకాశం ఉందని వైద్యులు చెప్పడంతో నాగేంద్ర తల్లి నాగమ్మ తన కుమారుడు పడుతున్న అవస్థను చూసి తట్టుకోలేక తన ఒక కిడ్నీని కుమారుడికి ఇవ్వడానికి సిద్ధమైంది. కానీ కిడ్నీ మార్పిడి చేయించుకునే ఆర్థిక స్థోమత వీరికి లేదు. కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌కు దాదాపుగా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచక నాగేంద్ర కుటుంబసభ్యులు కొట్టుమిట్టాడుతున్నారు. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి తన బిడ్డను బతికించాలని నాగేంద్ర తల్లి, తన భర్తను బతికించాలని కస్తూరి ప్రార్థిస్తున్నారు. నాగేంద్ర మాత్రం తన కుటుంబానికి తానే ఆధారమని, తనను బతికించాలని పరిచయమున్న ప్రతిఒక్కరినీ వేడుకుంటున్నాడు. సాయం చేయదలచుకున్న దాతలు పూర్తి వివరాలకు సంప్రదించండి పేరు – మైనంపాటి నాగేంద్ర సెల్ – 75501 74783 బ్యాంక్ అకౌంట్ నంబర్: 34015307025 ఐఎఫ్ఎస్సీ కోడ్ : ఎస్బీఐఎన్0015069 బ్రాంచ్ పేరు: ఎస్బీఐ – అల్లూరు శాఖ ఫోన్ పే: 70970 83008 -
క్షీణిస్తున్న షరీఫ్ ఆరోగ్యం
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు కిడ్నీలు ఫెయిల్ అయ్యే అవకాశం ఉందని, వెంటనే అతన్ని చికిత్స కొరకు హాస్పిటల్‌కు తరలించాలని జైలు వైద్య సిబ్బంది తెలిపారు. పనామా పత్రాలు కుంభకోణం కేసులో ఈ నెల 13న అరెస్ట్ అయిన షరీఫ్ ప్రస్తుతం అదీలా జైల్లో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. జైలు వైద్య సిబ్బంది ఆదివారం ఆయనకు పరీక్షలు నిర్వహించిన ఆనంతరం షరీఫ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించాలని పేర్కొన్నారు. డీహైడ్రేషన్, రక్తహీనత ప్రమాదకర స్థాయికి పెరిగాయని, మరింత ఆలస్యం చేస్తే హార్ట్ రేటు కూడా పెరిగే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. పనామా పత్రాల కుంభకోణం కేసులో షరీఫ్, ఆయన కుమార్తె మరియమ్ లండన్ నుంచి పాక్ వచ్చిన వెంటనే లాహోర్‌లో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం విధితమే. -
మెదక్‌లో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు
సాక్షి, మెదక్ : జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాలు కిడ్నీ సంబంధిత రోగులకు వరంగా మారాయి. గతంలో డయాలసిస్ కోసం హైదరాబాద్ వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. అపుడు దూరాభారంతో పాటు ఒక్కో సెట్టింగ్‌కు రూ.1500 నుంచి రూ.1900 చెల్లించాల్సివచ్చేంది. ప్రభుత్వం డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో ఆ బాధలు తొలిగిపోయాయి. జిల్లా కేంద్రంలో గత ఏడాది డిసెంబర్లో డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించారు. దీంతో కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఆనందంతో అందరూ ఇక్కడే రక్త శుద్ధి చేయించుకుంటున్నారు. ఆరోగ్యశ్రీలో భాగంగా ఈ సేవలను ఉచితంగా అందజేస్తున్నారు. ఈ కేంద్రంలో ఒకే సారి ఐదుగురికి రక్తశుద్ధి చేసేందుకు మిషన్లు ఏర్పాటు చేశారు. అలాగే ఒక్కబెడ్ హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దీంతోపాటు ప్రత్యేకమైన వైద్యులు, సిబ్బంది ఉండటంతో రోగులకు ఇబ్బందులు తొలిగిపోవడంతో వారు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 35 మందికిపైగా డయాలసిస్ అవసరమయ్యే రోగులు ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గుర్తించారు. కిడ్నీలు సరిగా పనిచేయని పక్షంలో డయాసిస్(రక్తశుద్ధి) ప్రక్రియ అవసరం ఉంటుంది. ఈ రకమైన సమస్య ఉన్న వారు, మూత్రపిండాల మార్పిడి సమయంలో రక్తశుద్ధి (డయాలసిస్) తప్పనిసరి. గతంలో ఆరోగ్యశ్రీలో డయాలసిస్ సేవలు అందించినప్పటికీ హైదరాబాద్ వెళ్లడంతో చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. దీంతో దూరభారంతో పాటు ఆర్థిక పరమైన ఇబ్బందులు పడేవారు. ఉచితంగా మందులు ఇవ్వాలి.. జిల్లాలోని 35 మంది రోగులకు గడిచిన ఆరు నెలల్లో 180 సార్లు డయాలసిస్ చేశారు. డయాలసిస్ చేయించుకునే పేషెంట్ 4 గంటల నుంచి వ్యాధి తీవ్రతను బట్టి 8 గంటల వరకు బెడ్‌పై ఉండాల్సి వస్తోంది. వైద్యులు, సిబ్బంది మంచిగా సేవలు అందజేస్తున్నట్లు వారు చెబుతున్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయంతో ఇబ్బందులు పడుతున్నట్లు రోగులు చెబుతున్నారు. కరెంటు పోయిన సమయంలో వెంటనే జనరేటర్ పనిచేయకపోవటం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నట్లు చిన్నశంకరంపేటకు చెందిన ఓ రోగి తెలిపారు. డయాలసిస్ సెంటర్‌కు నిరంతర విద్యుత్ సరఫరా అయ్యేలా చూడాలని రోగులు కోరుతున్నారు. అలాగే ఉచితంగా మందులు అందజేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత డయాలసిస్ మెదక్‌లో పొందే సౌకర్యం కల్పించడం హర్షనీయం. అయితే నర్సాపూర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేస్తే మరింత సౌలభ్యంగా ఉంటుందని పలువురు రోగులు కోరుతున్నారు. నర్సాపూర్ ప్రాంతంలో 6మంది వ్యాధిగ్రస్తులు డయాలసిస్ చేయించుకుంటున్నారు. ప్రస్తుతం డయాలసిస్ కోసం మెదక్‌కు వస్తున్నారు. కొన్ని సందర్భాల్లో హైదరాబాద్‌కు కూడా వెళ్తున్నారు. అయితే నర్సాపూర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయాలని, తద్వారా అక్కడి రోగులకు సౌలభ్యంగా ఉంటుందని శివ్వంపేటకు చెందిన ఆనంద్‌రావు తెలిపారు. బతుకుపై ఆశ కలిగింది నేను 12 ఏళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్నాను. 2006లో కిడ్నీ మార్పిడి జరిగింది. తర్వాత అది విఫలమై రెండు కిడ్నీలూ చెడిపోయాయి. అప్పటినుంచి డయాలసిస్ కోసం లక్షల రూపాయాలు ఖర్చు పెట్టాను. డయాలసిస్ కోసం ప్రతివారం హైదరాబాద్ వెళ్లే వాడిని. ఇప్పటివరకు రూ.15 లక్షల వరకు ఖర్చుయ్యాయి. దీంతో ఎంత కాలం చేయించుకోను.. ఇక అనుకున్న సమయంలో మెదక్ ఆస్పత్రిలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేశారు. అప్పుడు బతుకుపై ఆశ కలిగింది. దీంతో ఇక్కడే వారానికి రెండు సార్లు చేయించుకుంటున్నాను. దూరభారం తగ్గడంతో పాటు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయాయి. –ఎర్రగొల్ల సత్యం, రామాయంపేట -
ఎంత కష్టమొచ్చే నర్సింహా...
అతడు స్టీరింగ్ తిప్పితేనే ఆ ఇంటి బండి నడుస్తుంది. వచ్చే కొద్ది సంపాదనతోనే భార్య, పిల్లలకు ఏ లోటు లేకుండా చూసుకునే వ్యాన్ డ్రైవర్ నర్సింహారావుకు రెండు కిడ్నీలు చెడిపోగా.. ఆ కుటుంబం పరిస్థితి దయనీయంగా తయారైంది. ఒకవైపు రోజు విడిచి రోజుకు డయాలసిస్ చేయించేందుకు డబ్బులు లేక.. మరోవైపు ఇళ్లు గడవక దాతల కోసం ఎదురు చూస్తోంది. ఖమ్మంఅర్బన్ : నగరంలోని గోపాలపురం కాల్వ కట్టపై నివాసం ఉంటూ వ్యాన్ డ్రైవర్‌గా పనిచేస్తున్న సురుగుల నర్సింహారావుకు ముగ్గురు బిడ్డలు, భార్య ఉన్నారు. రెండు నెలలు క్రితం అతడికి కాళ్లు వాపులు రావడంతో డాక్టరు వద్దకు వెళ్లాడు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు రెండు కిడ్నీలు చెడిపోయినట్లు నిర్దారించారు. నర్సింహారావుతో సహా కుటుంబ సభ్యులు పిడుగు లాంటి వార్త విని తట్టుకోలేకపోయారు. దుఖ:సాగరంలో మునిగిపోయారు. నర్సింహారావు వ్యాన్ నడిపితేనే ఇల్లు గడుస్తుంది. అతడు అనార్యోగం బారిన పడటంతో కుటుంబంలో ఆర్థిక సమస్యలు ప్రారంభమయ్యాయి. నర్సింహారావుకు రోజు విడిచి రోజు డయాలసిస్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే కిడ్నీలను మార్పిడి చేయాలి. చికిత్సకు, ఇల్లు గడవడానికి కుటుంబం ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితి నెలకొంది. నర్సింహారావు భార్య, అక్క తమ బంగారం అభరణాలు తాకట్టు పెట్టి నెల రోజులుగా రోజు డయాలసిస్ చేయిస్తున్నారు. ఇప్పటికే ఖమ్మం, హైదరాబాద్ ఆస్పత్రుల్లో సుమారు రూ. లక్షా 50 వేలపైగా ఖర్చు చేశారు. మందులకు నెలకు రూ. 10వేలు కన్న బిడ్డపై మమకారంతో నర్సింహారావుకు తల్లి వెంకటరావమ్మ కిడ్నీ ఇవ్వడానికి ముందుకు వచ్చింది. వైద్యులు అన్ని పరీక్షలు చేసి తల్లి కిడ్నీ సరిపోతుందని చెప్పారు. అయితే ఆపరేషన్ ఆరోగ్య శ్రీలో ఉచితంగానే చేస్తామని వైద్యులు వివరించారు. కాని ఆపరేషన్ తర్వాత మూడు నెలలు వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి ఉంటుంది. అలాగే జీవితాంతం నెలకు సుమారు రూ.10 వేల విలువైన మందులను వాడాల్సి ఉంటుంది. అందుకు అయ్యే ఖర్చులు లేక కుటుంబ సభ్యులు దాతలకోసం ఎదురు చూస్తున్నారు. చావు బతుకుల మధ్య కొట్టు మిట్లాడుతున్న నర్సింహారావు.. అతడిపై ఆధారపడిన భార్యా పిల్లల బాధను అర్థం చేసుకొని దాతలు ఆదుకోవాలని బంధువులు వేడుకుంటున్నారు. ప్రస్తుతం అతడు మమత రోడ్డులో ఒక అపార్టు మెంట్లో వాచ్‌మన్‌గా పని చేస్తున్న తన అక్క, బావ వద్ద ఉంటున్నాడు. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9603443486 -
బతకాలనే కోరిక.. సాటి మనుషులపై నమ్మకం
ఫ్లోరిడా : అడగనిదే అమ్మ అయినా అన్నం పెట్టదంటారు. అదే అడిగితే ఎవరో ఒకరు స్పందిస్తారు. తమకు తోచిన సాయం చేస్తారు. అందుకు ఈ ఘటన చక్కటి ఊదాహరణగా నిలుస్తోంది. సహాయాన్ని ఒక్కొక్కరు ఒక్కో రీతిలో కోరతారు. కొత్త ఆలోచనతో సరికొత్త పద్థతిలో సహాయాన్ని కోరి విజయం సాధించాడు లీబౌట్జ్. శరీరంలో అతి ముఖ్యమైన భాగం కిడ్నీ సక్రమంగా పనిచేయక, కొన్ని రోజుల్లోనే మరణిస్తామని తెలిసినప్పుడు ఎవరైనా కుంగిపోతారు. కానీ లీబౌట్జ్ మాత్రం తన కిడ్నీ 5 శాతమే పనిచేస్తుందని తెలిసినా.. ఏ మాత్రం ధైర్యం కోల్పోలేదు. కిడ్నీ దాతల కోసం ఎన్నో చోట్ల ప్రయత్నించాడు. లాభం లేకపోయింది. బతకాలనే కోరిక చావలేదు. చివరికి సాటి మనుషులపై ఉన్న నమ్మకంతో వినూత్న ప్రయత్నం చేశాడు. తన బాధను ఇతరులతో పంచుకోవాలని, వారి నుంచి సహాయం పొందాలని భావించాడు. ఇందుకు ఎల్లప్పుడూ సందర్శకులతో రద్దీగా ఉండే డిస్నీ వరల్డ్‌ని ఎంచుకున్నాడు. తన అవస్థని ఇతరులకు తెలుపడానికి విభిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. తన టీషర్ట్ పైన బ్లడ్ గ్రూపు 'ఒ' పాజిటివ్ అని, తనకు కిడ్నీ కావాలని సందేశాన్ని తెలుపుతూ తన ఫోన్ నెంబర్ని రాశాడు. ఆ టీషర్ట్‌నే వేసుకుని, అక్కడే వారం రోజులపాటు తిరుగుతూ ఉన్నాడు. దీనిని గమనించిన కొందరు సందర్శకులు అతని ఫోటోలను తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అప్పుడే అతని ప్రయత్నానికి ముందడగు పడింది. ఒక్క రోజులోనే ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక్క రోజులో 32వేల షేర్లు, వారం రోజుల్లో 90వేల షేర్లు వచ్చాయి. మానవత్వం బతికే ఉందటూ లీబౌట్జ్కు కిడ్నీ ఇవ్వడానికి వందలాది మంది దాతలు ముందుకొచ్చారు. వారిలో నలుగురికి వైద్య పరీక్షలు నిర్వహించగా... అందులో రిచీ సల్లీ అనే వ్యక్తి శాంపిల్స్ మ్యాచ్ అయినట్టు డాక్టర్లు చెప్పారు. కిడ్నీ ఫెయిల్ అవ్వడం వల్ల ఎంతో మంది చనిపోతున్నారు. కానీ జీవితంపై ఆశతో లీబౌట్జ్ చేసిన ప్రయత్నం విజయం సాధించింది. కాగ, లిబౌట్జ్ దాదాపు 15 ఏళ్లుగా ఈ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. -
బతకాలని ఒకరు.. బతికించుకోవాలని మరొకరు
► కిడ్నీ ఫెయిల్యూర్‌తో చావుబతుకుల్లో యువకుడు ► ఆర్థిక సాయం కోసం ఎదురుచూపు సాక్షి, హైదరాబాద్: భర్తను పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆమెకు కొడుకే ఓ ధైర్యం అనుకుంది. కానీ విధి ఆమెపట్ల మరోలా ఆలోచించింది. తోటి స్నేహితుల మధ్య సరదాగా గడపాల్సిన ఆ యువకుడు అకస్మాత్తుగా అనారోగ్యంతో మంచం పట్టాడు. కడుపు తీపికి కడుపు కోతకు మధ్య జీవచ్ఛవంలా కన్నకొడుకు కళ్లముందే కదల్లేక మంచానికి పరిమితం కావడంతో చూడలేక ఆ తల్లి తల్లడిల్లిపోతోంది. కన్నకొడుకుని బతికించుకు నేందుకు వైద్యం చేయించే స్తోమత లేక సాయం కోసం ఆ తల్లి ఆశగా ఎదురు చూస్తోంది. హైదరాబాద్ రాయదుర్గానికి చెందిన గోపాలకృష్ణ, ఈశ్వరమ్మ దంపతుల చిన్న కుమారుడు కందాళ రజినీకాంత్ డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. 2014లో ఉన్నట్టుండి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. అప్పటికే తండ్రి గోపాలకృష్ణ కూడా చనిపోయాడు. తల్లి ఈశ్వరమ్మ తన కుమారుడిని చికిత్స కోసం నిమ్స్‌లో చేర్పించగా, పరీక్షించిన వైద్యులు కిడ్నీ పనితీరు దెబ్బతిన్నట్లు గుర్తించారు. దీంతో తల్లి ఈశ్వరమ్మ తన రెండు కిడ్నీల్లో ఒక కిడ్నీని కుమారుడికి దానం చేసేందుకు ముందుకు వచ్చింది. 2015లో నిమ్స్‌లోని డాక్టర్ గంగాధర్ ఆయనకు కిడ్నీ మార్పిడి చికిత్స చేశారు. ఇందుకోసం రూ.15 లక్షల వరకు ఖర్చు చేశారు. ఇన్ఫెక్షన్ కావడం, సర్జరీ సక్సెస్ కాకపోగా రజినీకాంత్ సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. దీంతో ఏడాది క్రితం ఆయన మరోసారి నిమ్స్ వైద్యుడు డాక్టర్ గంగాధర్‌ను సంప్రదించాడు. మరోసారి కిడ్నీ మార్పిడి చేయాలని సూచించారు. ప్రస్తుతం వారానికి 3 సార్లు డయాలసిస్ నిర్వహిస్తున్నారు. ఆయన అక్క వినోద తన రెండు కిడ్నీల్లో ఒక కిడ్నీని తమ్ముడు రజినీకాంత్‌కు దానం చేసేందుకు అంగీకరించింది. ఇప్పటికే కొడుకు వైద్యం కోసం తల్లి ఉన్న ఆస్తినంతా అమ్మేయడంతో ప్రస్తుతం ఆమె ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. బిడ్డ ఆరోగ్య పరిస్థితి చూడలేక, వైద్యం చేయించే స్తోమత లేక ఆ తల్లి విలవిల్లాడిపోతోంది. ఎవరైనా దాతలు ఆర్థిక సాయం చేస్తే తన కుమారుడిని కాపాడుకుంటానని వేడుకుంటోంది. మరిన్ని వివరాల కోసం 79897 57052 ఫోన్ నంబర్లో సంప్రదించవచ్చు.