Naamkaran Actor Anaya Soni Face Financial Crisis As Her Suffers Kidney Failure - Sakshi
Sakshi News home page

Actress Anaya Soni: నటికి కిడ్నీ ఫెయిల్యూర్‌, సాయం కోసం వేడుకోలు!

Published Mon, Jul 12 2021 11:04 AM | Last Updated on Mon, Jul 12 2021 12:22 PM

Actress Anaya Soni Face Financial Crisis As Her Suffers Kidney Failure - Sakshi

Actress Anaya Soni: బుల్లితెర నటి అనయ సోని అస్వస్థతకు గురైంది. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె ఇటీవలే ముంబైలోని హోలీ స్పిరిట్‌ ఆస్పత్రిలో చేరింది. ప్రస్తుతం తన దగ్గర ట్రీట్‌మెంట్‌ చేయించుకోవడానికి కూడా డబ్బుల్లేవని వాపోయింది. కాగా అనయకు ఆరేళ్ల క్రితం ఒక కిడ్నీ పాడైంది. దీంతో ఆమెకు కిడ్నీ దానం చేసేందుకు అనయ తండ్రి ముందువచ్చాడు. అలా ఆమె తండ్రి కిడ్నీని అనయకు అమర్చారు. కానీ ఇప్పుడది ఫెయిల్‌ అవడంతో నటి మంచానపడింది. దీంతో మరో కిడ్నీ అమర్చాల్సిన పరిస్థితి ఏర్పడింది.

తన పరిస్థితి గురించి అనయ వివరిస్తూ.. "మా అమ్మకు గార్మెంట్స్‌ బిజినెస్‌ ఉంది. కానీ కొంతకాలం క్రితం ఇంటికి నిప్పంటుకోవడంతో బట్టలు, మెషీన్లు అన్నీ బూడిదయ్యాయి. ఇప్పుడు మేం తినడానికి కూడా తిండి లేని దయనీయ పరిస్థితిలో ఉన్నాం. మరోపక్క నాకింకా డయాలిసిస్‌ కూడా మొదలు పెట్టలేదు. ఇప్పుడు అర్జంట్‌గా ఓ కిడ్నీ దాత కోసం ఎదురు చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితి వస్తుందని అస్సలు ఊహించలేదు, దయచేసి నాకు సాయం చేయండి" అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో రిలీజ్‌ చేసింది.  చిన్నపాటి సాయమైనా చేయడానికి ముందు రమ్మని అభిమానులకు పిలుపునిస్తూ తన బ్యాంకు ఖాతా వివరాలను సైతం పోస్ట్‌లో పొందు పరిచింది. కాగా అనయ క్రైమ్‌ పెట్రోల్‌, అదాలత్‌, ఇష్క్‌ మేన్‌ మార్జవాన్ వంటి పలు షోలలో నటించింది. అలాగే తెలుగులో రుద్రమదేవి సీరియల్‌లోనూ ఓ పాత్రలో కనిపించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement