CM MK Stalin Helps 14 Yr Girl with 2 Kidneys Failed- Sakshi
Sakshi News home page

CM MK Stalin: ఒక్క వీడియో కదిలించింది.. 14 ఏళ్ల బాలికకు సీఎం స్టాలిన్‌ సాయం

Published Tue, Sep 28 2021 8:59 AM | Last Updated on Tue, Sep 28 2021 10:01 AM

CM Stalin Visits Hopitsl And Keeps Word To Salem Girl, Assures Support - Sakshi

సాక్షి, చెన్నై: రెండు కిడ్నీలు దెబ్బతినడంతో నరకాన్ని అనుభవిస్తున్న ఓ బాలిక సామాజిక మాధ్యమాల్లో పెట్టిన ఓ వీడియో సీఎం ఎంకే స్టాలిన్‌ను కదిలించింది. సోమవారం ఆస్పత్రికి వెళ్లి మరీ ఆ బాలికను పరామర్శించారు. వివరాలు.. సేలం జిల్లా అరిసియాపాళయంకు చెందిన విజయకుమార్, రాజ నందిని దంపతులకు జనని(14) కుమార్తె  పదో తరగతి చదువుతోంది. పదేళ్ల వయస్సులోనే  కర్రసాము, విలువిద్య, స్కేటింగ్‌ రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించింది. 2019లో హఠాత్తుగా ఈ బాలిక ఇంట్లో స్పృహ తప్పింది.


చదవండి: CM MK Stalin: ఒక మహిళ చమత్కారం.. స్టాలిన్‌ నవ్వులు

రెండు కిడ్నీలు దెబ్బతిన్నట్లు వైద్యులు తేల్చారు. దీంతో బిడ్డను రక్షించుకునేందుకు ఆ తల్లి తన కిడ్నీని దానం చేసింది. శస్త్రచికిత్స జరిగిన 15 రోజుల్లో తల్లి దానం చేసిన కిడ్నీ కూడా దెబ్బతింది. ప్రస్తుతం రెండు కిడ్నీలు పాడైపోవడంతో పాటుగా కాలేయం కూడా చెడిపోయింది.  దీంతో తన బిడ్డ ప్రాణాల్ని రక్షించుకునేందుకు ఆ తల్లి సీఎం సెల్‌ను ఆశ్రయించింది. చెన్నై స్టాన్లీ ఆస్పత్రిలో ఆ బాలికకు వైద్యానికి ఏర్పాట్లు చేశారు. ఈ పరిస్థితుల్లో ఆదివారం ఆ బాలిక సామాజిక మాధ్యమాల్లో పెట్టిన ఓ వీడియో సీఎం స్టాలిన్‌ను కదిలించింది.
చదవండి: ఒకవైపు వర్షం మరోవైపు బంద్: క్యాబ్‌, ఆటోల చార్జీల మోత!


ఆస్పత్రిలో జనని తల్లి రాజనందినిని ఓదారుస్తున్న సీఎం 

‘‘సీఎం సార్‌, నమస్తే...రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి..రెండేళ్లుగా నరకం చూస్తున్నాను.. డయాలసిస్‌ చేస్తున్నారు ..నొప్పి భరించలేకున్నాను.. నన్ను రక్షించండి..ప్లీజ్‌ ’’ అని ఆ బాలిక పెట్టిన వీడియోతో సీఎం చలించిపోయారు. సోమవారం మంత్రులు సుబ్రమణియన్, శేఖర్‌బాబుతో కలిసి స్టాన్లీ ఆస్పత్రికి సీఎం చేరుకున్నారు. ఆ బాలికను పరామర్శించారు. మెరుగైన వైద్యానికి చర్యలు తీసుకోవాలని వైద్యులను ఆదేశించారు. బాలిక తల్లి రాజనందిని ఓదార్చారు. ఈ సమయంలో ఆమె ఉద్వేగానికి లోనయ్యారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement