
తిరువళ్లూరు: తమ పాఠశాల ఆవరణలో ఆక్రమణల ను తొలగించి, తరగతి గదులకు మరమ్మతులు చేయాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ఓ బాలిక రాసిన లేఖపై మంగళవారం విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ పొయ్యామెళి స్పందించారు. సీఎం ఆదేశాలతో సదరు పాఠశాలను ఆయన పరిశీలించారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా మీంజూరులో ప్రభుత్వ అప్పర్ ప్రైమరీ పాఠశాల ఉంది. ఇక్కడ 140 మంది విద్యార్థులు చదువుతున్నారు.
ఇదే పాఠశాలలో 2019 వరకు చదివిన అధిగైముత్తరసి ఆక్రమణలను తొలగించి, పాడుబడిన తరగతి గదులను బాగు చేయాలనీ అప్పటి సీఎం, గవర్నర్‌తో పాటు ఇతర ఉన్నత అధికారులను కలిసి వినతిపత్రం సమర్పించింది. అయితే ఫలితం లేకపోవడంతో అధికారుల తీరుకు నిరసనగా టీసీ తీసుకుని ప్రైవేటు పాఠశాలలో చేరింది. తరావ్త ఏకంగా హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన కోర్టు పాఠశాల చుట్టూ ఉన్న అక్రమణలను తొలగించాలని అధికారులను ఆదేశించింది.
అయినా క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో ఇటీవల ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన స్టాలిన్‌కు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన ఆయన సంబంధిత మంత్రి మహేష్‌ను పిలిచి పాఠశాలను తనిఖీ చేయాలని ఆదేశించారు. దీంతో మంత్రి పాఠశాల కోసం పోరాడిన ముత్తురసిని అభినందించి తిరుక్కురల్ పుస్తకాన్ని అందజేశారు.
ప్లస్‌టూ పరీక్షలపై త్వరలో నిర్ణయం : పాఠశాలను తని ఖీ చేసిన అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్లస్‌టూ పరీక్షల నిర్వాహణపై త్వరలో ఉన్నాతాధికారులు, విద్యార్థులు తల్లిదండ్రులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.