సాక్షి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ మరోసారి సోషల్ మీడియా స్టార్‌గా అవతరించారు. 68 ఏళ్ల వయసులో కూడా 20 ఏళ్ల కుర్రాడిలా చాలా చురుగ్గా ఉండే స్టాలిన్ ఫిట్‌నెస్ మంత్రాతో అందర్నీమెస్మరైజ్ చేస్తున్నారు. తాజాగా ఆయన కసరత్తుల వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. తలైవర్ ఫిట్‌నెస్ వర్కౌట్స్ చూసి అంతా ఫిదా అవుతున్నారు. మరోవైపు టీఐ సైకిల్స్ సంస్థ స్టాలిన్ ఒక కొత్త సైకిల్‌ను కూడా ప్రెజెంట్ చేయడం విశేషం.
ఎంత బిజీగా ఉన్నా శారీరక వ్యాయామానికి ప్రాధాన్యత ఇచ్చే రాజకీయ ప్రముఖుల్లో సీఎం స్టాలిన్ ఒకరు. త్వరగా నిద్ర లేవడం, నడక, సైక్లింగ్, యోగా తన దినచర్యలో ఒక భాగమనీ ఇదివరకే డీఎంకే నేత స్టాలిన్ ప్రకటించారు. ఏ పనిలోఉన్న పది రోజులకోకసారి సైకిల్ తొక్కుతానని, కర్ణాటక సంగీతం వినడం కూడా తనకు చాలా ఇష్టమని ఆయన చెప్పారు.
ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం మామల్లాపురం రోడ్డుపై ఉదయాన్నే సైక్లింగ్ చేస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ, వారితో సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కాగా ఏప్రిల్-మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోఅద్భుత విజయంతో స్టాలిన్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. వెంటనే కుటుంబాలకు ఆర్థిక సహాయం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పాల ధర తగ్గింపు, కరోనా ఆర్ధిక సహాయం లాంటి కీలక పథకాలపై సంతకం చేశారు. అలాగే ఇటీవల లీటరు పెట్రోలుపై రూ.3 తగ్గింపు, అర్చకత్వంలో అందరికీ సమాన హక్కులు కల్పిస్తూ ముఖ్యమంత్రి స్టాలిన్ సంచలన నిర్ణయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment