TN CM Stalin Allots House To Schoolboy Family Who Appealed Against Hate - Sakshi
Sakshi News home page

కలాం వైరల్‌ వీడియోకు ఫిదా అయిన స్టాలిన్‌.. ఇంటి స్థలం అందించి మరీ ప్రోత్సాహం

Published Sat, Feb 26 2022 8:09 PM | Last Updated on Sun, Feb 27 2022 9:10 AM

TN CM Stalin Felicitates Kalam Who Appealed Against Hate - Sakshi

మొక్కై వంగనిది.. మానై వంగునా? అందుకే తల్లిదండ్రులు, గురువులు పసిప్రాయంలోనే విద్యాబుద్ధులతో పాటు వీలైనంత మేరకు సమాజం గురించి అవగాహన కల్పించాలి. కలాంను అతని తల్లిదండ్రులు అలానే పెంచారు. అందుకే విశ్వసమానత్వం, మానవత్వం గురించి పసివయసులోనే అవపోసన పట్టేశాడు. 

అబ్దుల్‌ కలాం.. తాజాగా తమిళనాట సోషల్‌ మీడియాలో సెన్సేషన్‌ అయిన పిలగాడు. ఓ ఇంటర్వ్యూలో సమాజం గురించి మాట్లాడిన ఈ స్కూల్‌ పిలగాడు.. మనుషుల మధ్య ఎన్నిరకాల బేధాభిప్రాయాలు ఉన్నా.. అంతిమంగా అంతా సమానమేనని, ఒకరికొకరు సాయపడడం తప్ప విషం చిమ్ముకోవడం ఎంత మాత్రం మంచిది కాదని, అంతా మనుషులమేనని, అంతిమంగా ప్రేమ తప్ప ద్వేషానికి చోటు ఉండకూడదంటూ మాట్లాడాడు. 

కలాం మాట్లాడిన వీడియో సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రెండ్‌ అయ్యింది. యూట్యూబ్‌, ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ ద్వారా విపరీతంగా వైరల్‌ అయ్యింది. సెలబ్రిటీలు, ఇంటర్నెట్‌ యూజర్లు ఆ పిల్లాడి పలుకులకు ఫిదా అయిపోయారు. ఆ వీడియో అటు ఇటు తిరిగి.. చివరికి తమిళనాడు సీఎం స్టాలిన్‌ దగ్గరికి చేరింది. కలాం స్పీచ్‌కు స్టాలిన్‌ సైతం అభిమాని అయిపోయారు. గురువారం ఆ చిన్నారిని, అతని తల్లిదండ్రులను వ్యక్తిగతంగా పిలిపించుకుని.. అభినందించారు స్టాలిన్‌. 

అయితే.. ఓనర్లు తమను ఇల్లు ఖాళీ చేయమంటున్నారని, ఏదైనా సాయం అందించాలని సీఎంను కోరింది ఆ కుటుంబం. కలాం కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకున్న స్టాలిన్‌ తక్షణమే స్పందించారు. చెన్నై కేకే నగర్‌ శివలింగాపురంలోని హౌజింగ్‌ బోర్డు కాలనీలో కలాం కుటుంబానికి స్థలం కేటాయించారు. శనివారం ఆ కుటుంబానికి మరోసారి తన దగ్గరకు ఆహ్వానించి.. ఇంటి స్థలం పత్రాలు అందజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement