
అరుణ్ దత్
ముంబై: బాలీవుడ్ ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత గురుదత్ కుమారుడు అరుణ్ దత్ మరణించారు. ఆయన వయస్సు 58 సంవత్సరాలు. గత కొంత కాలంగా ఆయన తీవ్ర అనార్యోగంతో బాధపడుతున్నారు. పునేలో శనివారం మధ్యాహ్నం ఆయన తుది శ్వాస విడిచారని అరుణ్ కుమార్తె గౌరీ దత్ తెలిపారు.
కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంగా ఉన్న ఆయన శనివారం కిడ్నీ ఫెయిల్యుర్ అవడంతో మరణించారని చెప్పారు. నిన్న సాయంత్రమే తన తండ్రి అరుణ్ అంత్యక్రియలు పూర్తి చేసినట్లు గౌరీ వెల్లడించారు. అరుణ్ దత్కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.