అవయవాల్లో కిడ్నీలకు చాలా ముఖ్యమైన పాత్ర ఉంది. శుద్దిచేసిన రక్తాన్ని గుండెకి పంపి మనిషి జీవన ప్రమాణాన్ని పెంచేవి కిడ్నీలు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 85 కోట్ల మంది కిడ్నీ జబ్బుతో బాధపడుతున్నారని అంచనా. మనదేశంలో ప్రతి 10 మందిలో ఒకరు దీర్ఘకాలిక కిడ్నీజబ్బు బారినపడుతున్నారు. చాలామందికి దీనిపై అవగాహన లేకపోవడం వల్ల చివరిదశకు చేరుకునేంతవరకూ సమస్యను గుర్తించలేకపోతున్నారు. ఇది చివరకు కిడ్నీ పాడవడానికి దారితీస్తుంది. వరల్డ్ కిడ్నీ సందర్భంగా కిడ్నీల పాత్ర, కిడ్నీ సమస్య తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇప్పుడు చూద్దాం.
కిడ్నీలు రక్తాన్ని శుద్దిచేయడమే కాదు, విటవిన్‌డి ని ప్రేరేపించి ఎముకపుష్టికి తోడ్పడతాయి. ఎరిత్రోపాయిటిన్‌ను ఉత్పత్తి చేస్తూ హిమోగ్లోబిన్ రక్తకణాల తయారీలో పాలు పంచుకుంటాయి. రక్తంలో సోడియం, పొటాషియం వంటి ఎలక్రోలైట్ల మోతాదులను తగు స్థాయిల్లో ఉండేల్లా చేస్తాయి. ఏ కారణంచేతైనా కిడ్నీలు చతికిలపడితే మన శరీరం మెత్తం వ్యర్థపదార్థాలతో నిండుతుంది ఈ పరిస్థితి చివరకు ప్రాణాపాయానికి దారితీస్తుంది. ఈ విపత్కర పరిస్థితి నుంచి బయటపడటానికి కిడ్నీల్లాగా పనిచేసే కృత్రిమ యంత్రాల సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియనే డయాలసిస్ అంటారు.
ప్రస్తుత జీవన ప్రమాణంలో వయసుతో సంబంధం లేకుండా కిడ్నీవ్యాధి బారిన పడుతున్నారు. యువతతో పాటు చిన్నపిల్లల్లోనూ ఈ సమస్య కనిపిస్తుంది. గ్యాస్ర్టిక్, పెయిన్‌కిల్లర్ మందులు ఎక్కువగా వాడటం, కలుషిత నీరు తాగడం, తగినంత నీరు తీసుకోకపోవడంతో కిడ్నీ సమస్యలు వాటిల్లుతాయని డాక్టర్లు చెబుతున్నారు. అంతేకాకుండా పొగతాగడం వల్ల రక్తపోటు పెరిగి అది కిడ్నీలపై తీవ్ర ప్రభావాన్ని చూపతాయి. యాంత్రిక జీవనంలో శారిరక శ్రమ లేకపోవడం వల్ల ఊబకాయానికి దారితీస్తుంది. అందుకే క్రమం తప్పకుండా నడక, జాగింగ్ లాంటివి దైనందిన జీవనంలో భాగం చేసుకోవాలి. రోజుకు కనీసం 10 వేల అడుగులైనా నడవడం చాలా ముఖ్యం. వీటితో పాటు నొప్పి నివారణకు అవసరమైతేనే మాత్రలను వేసుకోవడం, రక్తహీనత తలెత్తకుండా చూసుకోవడం లాంటి జాగ్రత్తలు పాటించాలి.
Comments
Please login to add a commentAdd a comment