World Kidney Day
-
మణిపాల్ హాస్పిటల్ సాధించిన విజయాలు ఓ మైలురాయి: వైద్యులు
-
విశాఖ ఆర్కే బీచ్ లో కిడ్నీ వాక్
-
దానివల్లే కిడ్నీ సమస్యలు..
అవయవాల్లో కిడ్నీలకు చాలా ముఖ్యమైన పాత్ర ఉంది. శుద్దిచేసిన రక్తాన్ని గుండెకి పంపి మనిషి జీవన ప్రమాణాన్ని పెంచేవి కిడ్నీలు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 85 కోట్ల మంది కిడ్నీ జబ్బుతో బాధపడుతున్నారని అంచనా. మనదేశంలో ప్రతి 10 మందిలో ఒకరు దీర్ఘకాలిక కిడ్నీజబ్బు బారినపడుతున్నారు. చాలామందికి దీనిపై అవగాహన లేకపోవడం వల్ల చివరిదశకు చేరుకునేంతవరకూ సమస్యను గుర్తించలేకపోతున్నారు. ఇది చివరకు కిడ్నీ పాడవడానికి దారితీస్తుంది. వరల్డ్ కిడ్నీ సందర్భంగా కిడ్నీల పాత్ర, కిడ్నీ సమస్య తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇప్పుడు చూద్దాం. కిడ్నీలు రక్తాన్ని శుద్దిచేయడమే కాదు, విటవిన్డి ని ప్రేరేపించి ఎముకపుష్టికి తోడ్పడతాయి. ఎరిత్రోపాయిటిన్‌ను ఉత్పత్తి చేస్తూ హిమోగ్లోబిన్ రక్తకణాల తయారీలో పాలు పంచుకుంటాయి. రక్తంలో సోడియం, పొటాషియం వంటి ఎలక్రోలైట్ల మోతాదులను తగు స్థాయిల్లో ఉండేల్లా చేస్తాయి. ఏ కారణంచేతైనా కిడ్నీలు చతికిలపడితే మన శరీరం మెత్తం వ్యర్థపదార్థాలతో నిండుతుంది ఈ పరిస్థితి చివరకు ప్రాణాపాయానికి దారితీస్తుంది. ఈ విపత్కర పరిస్థితి నుంచి బయటపడటానికి కిడ్నీల్లాగా పనిచేసే కృత్రిమ యంత్రాల సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియనే డయాలసిస్ అంటారు. ప్రస్తుత జీవన ప్రమాణంలో వయసుతో సంబంధం లేకుండా కిడ్నీవ్యాధి బారిన పడుతున్నారు. యువతతో పాటు చిన్నపిల్లల్లోనూ ఈ సమస్య కనిపిస్తుంది. గ్యాస్ర్టిక్, పెయిన్‌కిల్లర్ మందులు ఎక్కువగా వాడటం, కలుషిత నీరు తాగడం, తగినంత నీరు తీసుకోకపోవడంతో కిడ్నీ సమస్యలు వాటిల్లుతాయని డాక్టర్లు చెబుతున్నారు. అంతేకాకుండా పొగతాగడం వల్ల రక్తపోటు పెరిగి అది కిడ్నీలపై తీవ్ర ప్రభావాన్ని చూపతాయి. యాంత్రిక జీవనంలో శారిరక శ్రమ లేకపోవడం వల్ల ఊబకాయానికి దారితీస్తుంది. అందుకే క్రమం తప్పకుండా నడక, జాగింగ్ లాంటివి దైనందిన జీవనంలో భాగం చేసుకోవాలి. రోజుకు కనీసం 10 వేల అడుగులైనా నడవడం చాలా ముఖ్యం. వీటితో పాటు నొప్పి నివారణకు అవసరమైతేనే మాత్రలను వేసుకోవడం, రక్తహీనత తలెత్తకుండా చూసుకోవడం లాంటి జాగ్రత్తలు పాటించాలి. -
ఒబెసిటీతో కిడ్నీలకు ప్రమాదమే
మారుతున్న జీవన విధానం, ఫ్లోరైడ్ నీరు, రసాయన ఆహార పదార్థాలతో జన్యు సంబంధ వ్యాధులు పెరుగుతున్నాయి. ప్రధానంగా కిడ్నీ వ్యాధుల బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది. జిల్లాలో 2 నుంచి 3 లక్షల మంది వరకు వివిధ రకాల కిడ్నీ వ్యాధులకు గురైన వారు ఉన్నారు. వీరిలో కిడ్నీ వ్యాధి ముదిరిపోయి చివరి దశలో డయాలసిస్ చేయించుకుంటున్న వారు నెలకు 1,500 నుంచి 2 వేల మంది వరకు ఉన్నట్లు అంచనా. అధిక బరువుతో అనర్థాలు తప్పడం లేదు. ప్రధానంగా ఊబకాయం(అధిక బరువు)తో మూత్ర పిండాలకు చేటు తప్పదని వైద్యులు అంటున్నారు. శనివారం వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. నెల్లూరు(బారకాసు): ఊబకాయం కిడ్నీ ఆర్యోగాన్ని దెబ్బతీస్తోంది. రాష్ట్రంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్యలో నెల్లూరు జిల్లా నాల్గో స్థానంలో ఉంది. జిల్లాలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు రోజురోజుకు పెరుగుతున్నారు. నేటి ఆధునిక కాలంలో చిన్నచిన్న పిల్లలు కూడా దీని బారిన పడుతున్నారు. బీపీ, షుగర్ ఉన్న వారి సంఖ్య రోజు రోజుకు అధికంగా పెరగడం వల్ల కూడా ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ముఖ్యంగా కనిగిరి, వింజమూరు, అనంతసాగరం, ఆత్మకూరు, కొండాపురం, పొదలకూరు, వెంకటగిరి, వరికుంటపాడు, ఉదయగిరి మండలాల్లో ఫ్లోరైడ్ నీరు లభ్యతతో ఆ నీటిని తాగినవారు కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నందున ఇతర చుట్టు పక్కల జిల్లాల కంటే జిల్లాలోనే కిడ్నీ వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్నారని వైద్యులు చెబుతున్నారు. కిడ్నీ వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు - షుగర్ (డయాబెటీస్) ఉన్న వారిలో 40 శాతం మందికి కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం. - మూత్రంలో ప్రొటీన్ పోతున్న కారణంగా కిడ్నీ సమస్య ఏర్పడుతుంది. - ఫ్లోరైడ్ నీరు తాగడం వల్ల కిడ్నీ వ్యాధుల బారిన పడతారు. - నొప్పుల మాత్రలు అధికంగా వాడటం వల్ల, యూరిన్ ఇన్ఫెక్షన్, కిడ్నీలో రాళ్లు ఏర్పడటం వల్ల కిడ్నీ సమస్యలు వస్తాయి. - వంశపారపర్యంగాను, జన్యు లోపం వల్ల కిడ్నీ సమస్యలు తలెత్తుతాయి. - కిడ్నీ వ్యాధులకు గురైన వారిలో మొదట్లో పాదాలు వాపు, ఆ తర్వాత కాళు మొత్తం వాపు రావడం, కళ్లు చుట్లూ వాపు, బీపీ అధికంగా ఉండటం, మూత్రం తగ్గిపోవడం, మూత్రంలో నురగ రావడం, రక్తహీనత (అనీమియా) ఏర్పడటం, చిన్నపనికి అలిసిపోవడం, ఎముకలు నొప్పులు ఉండటం వంటి లక్షణాలు ఉంటాయి. - షుగర (డయాబెటీస్) వచ్చిన వెంటనే ఒకసారి కిడ్నీ పరీక్ష చేయించుకోవాలి. ఆ తర్వాత సంవత్సరానికి ఒకసారి విధిగా కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలి. - వీలైనంత వరకు నొప్పుల మాత్రల వాడకం తగ్గించుకోవాలి. - ప్రతి రోజు 3లీటర్ల మంచి నీటిని తాగాలి. - అధిక బరువు అంటే ఒబెసిటి, ఊబకాయం లేకుండా చూసుకోవాలి. - పొగతాగడం మానేయాలి. నిత్యం పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి. నాన్ వెజిటేరియన్ ఫుడ్‌ను తగ్గించాలి. లేదా వీలైతే మానేయడం మంచిది. కిడ్నీ వ్యాధులు రావడానికి కారణాలు లక్షణాలు – డాక్టర్ మాధవ్దేశాయి, చీఫ్ నెఫ్రాలజిస్ట్, సింహపురి హాస్పిటల్ ప్రాథమిక దశలో గుర్తిస్తే మేలు. కిడ్ని వ్యాధిని ప్రాధమిక దశలో గుర్తిస్తే ఎంతో మేలు. లేకుంటే చాలా ప్రమాదం ఉంది. కిడ్నీ వ్యాధి ముదిరితే గుండెపోటు లేక, పక్షవాతంతో మరణించే ప్రమాదం ఉంది. జిల్లాలోని 2 నుంచి 3లక్షల మందికి వివిధ రకాల కిడ్నీ వ్యాధులు ఉండే అవకాశం ఉంది. అయితే వీరిలో కేవలం 20 వేల మంది మాత్రమే ముందస్తుగా సంబంధిత వైద్యుడిని కలిసి తగిన వైద్యం పొందుతున్నారు. మిగిలిన వారంతా కిడ్నీ వ్యాధి ముదిరిన తర్వాత చివరి దశలో మాత్రమే వైద్యుడిని కలవడం జరుగుతోంది. -
వడపోయని కిడ్నీలు..
పాతికేళ్లకే పాడవుతున్న వైనం నిమ్స్ వైద్యుల సర్వేలో వెల్లడి.. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం నేడు వరల్డ్ కిడ్నీ డే.. సిటీబ్యూరో/గాంధీ ఆస్పత్రి: ఇనుప కండలు.. ఉక్కు నరాలతో రాళ్లను సైతం పిండి చేయగల యువత నేడు పాతికేళ్లకే కిడ్నీ జబ్బుల బారిన పడుతోంది. దేశవ్యా ప్తంగా ఏటా 2.5 లక్షల కేసులు నిర్థారణ అవుతుంటే.. రాష్ట్రంలో ప్రతి పదిమందిలో ఒకరు కిడ్నీ సంబంధిత సమస్యతో బాధ పడుతుండడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. వీటిలో గ్రేటర్ హైదరాబాద్‌లోనే ఏటా 15 వేలకు పైగా కేసులు వెలుగు చూస్తుండటం గమనార్హం. దేశంలోని ప్రధాన మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో 10-15 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్లు వెల్లడైంది. నగరంలోని ప్రస్తుతం 15 వేల మంది డయాలసిస్ చేయించుకుంటుండగా, ఏటా 150-200కు పైగా మూత్రపిండాల మార్పిడి శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయి. ఒక్క నిమ్స్‌లోనే ఏటా 70-80 శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయి. ఆందోళన కలిగించే అంశం.. తమకు కిడ్నీ సంబంధిత సమస్య ఉన్నట్టు వీరిలో చాలా మందికి తెలియదు. బాధితుల్లో ఎక్కువ శాతం 40 ఏళ్లలోపు వారే కావడం విశేషం. ఐసీఎంఆర్ సర్వే.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎంత మంది కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు..? ఏ ప్రాంతంలో ఈ సమస్య ఎక్కువ ఉంది..? ఏ వయసు వారు దీని బారిన పడుతున్నారు..? వంటి ప్రశ్నలకు నిపుణుల వద్ద ఇప్పటి వరకు స్పష్టమైన సమాధానం లే దు. అయితే, ఈ ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాన్ని కనుగొనాలనే ఉద్దేశంతో ‘ది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్)’ నాలుగేళ్ల క్రితం ఢిల్లీ, ముంబయి, గౌహతి, భువనేశ్వర్, కోల్‌కత, చైన్నై, జైపూర్, హైదరాబాద్ పట్టణాల్లో సర్వే చేపట్టింది. ఢిల్లీలోని ఎయిమ్స్‌తో పాటు నిమ్స్‌లోని సీనియర్ వైద్య నిపుణులు, పరిశోధక విద్యార్థులకు ఇందులో భాగస్వామ్యం కల్పించింది. సర్వే దాదాపు ముగింపు దశకు వచ్చింది. పేదల జీవితాల్లో వైఎస్సార్ వెలుగులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా డయాలసిస్ సేవలను ఉచితంగా అందించి వేల మంది జీవితాల్లో వెలుగులు నింపారు. రూ. వేలు ఖర్చుపెట్టి డయాలసిస్ చేయించుకోలేని వారికి ‘ఆరోగ్యశ్రీ’ ద్వారా డయాలసిస్ సేవలను ఉచితంగా అందుబాటులోకి తెచ్చారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో గాంధీ ఆస్పత్రిలో 2009 నవంబర్ 6న ప్రత్యేక సిబ్బంది పర్యవేక్షణలో 20 యూనిట్లతో డయాలసిస్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఇక్కడ 92,210 మందికి ఉచిత డయాలసిస్ సేవలు అందించారు. రోగాలకు కారణాలివే.. మారిన ఆహారపు అలవాట్లు, మధుమేహం, అధిక రక్తపోటు, పెయిన్ కిల్లర్స్ అతిగా వినియోగించడం, యాంటిబయాటిక్స్ ఎక్కువ వాడటం, మలేరియా, టైఫాయిడ్ వ్యాధులు సోకడం, యాంజియోగ్రామ్ పరీక్షల్లో కాంట్రాస్ట్ మందు వాడటం, మరికొన్ని జన్యుపరమైన కారణాలతో పాటు శరీరానికి సరిపడినంత మంచి నీరు తాగకపోవడం వల్ల కిడ్నీ సమస్యలు తలెత్తుతున్నాయి. - చాడ రమేష్, గాంధీ నెఫ్రాలజీ హెచ్‌వోడీ ఏటా స్క్రీనింగ్ పరీక్షలు తప్పనిసరి ఏడాది కోసారైనా ప్రతి ఒక్కరూ విధిగా కిడ్నీ సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి. ఫిట్నెస్ కోసం రోజుకు కనీసం 20 నిమిషాలు వ్యాయామం చేయాలి. శరీరానికి సరిపడు (4 లీటర్లకు తగ్గకుండా) మంచినీరు తాగాలి. లేదంటే కిడ్నీలో రాళ్లు ఏర్పడి, మూత్ర విసర్జన సమయంలో భరించలేని నొప్పి వచ్చి అది క్రమంగా గుండె పోటుకు దారి తీస్తుంది. - ప్రొ. శ్రీభూషణ్ రాజు, నిమ్స్ నెఫ్రాలజీ విభాగాధిపతి గాంధీలో డయాలసిస్ రోగులు.. 2010 13,600 2011 16,300 2012 16,800 2013 20,400 2014 21,270 2015 ఫిబ్రవరి వరకు 3,840