బుల్లితెర నటిపై ప్రెగ్నెన్సీ రూమర్స్.. కానీ! | Dipika Kakar-Shoaib Ibrahim Expecting Second Child? - Sakshi
Sakshi News home page

Dipika Kakar: బుల్లితెర నటికి రెండోసారి ప్రెగ్నెన్సీ..!

Apr 16 2024 4:56 PM | Updated on Apr 16 2024 5:58 PM

Dipika Kakar Once Again pregnant with her second baby Goes Viral - Sakshi

బాలీవుడ్ బుల్లితెర భామ దీపికా కక్కర్ బీటౌన్‌లో సుపరిచితమే. ససురాల్ సిమర్ కాలో సిమార్, కహాన్ హమ్ కహాన్ తుమ్‌ సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత రియాలిటీ షో బిగ్ బాస్- 12లో కంటెస్టెంట్‌గా పాల్గొని విజేతగా నిలిచింది. అయితే 2018లో రెండో పెళ్లి చేసుకున్న ముద్దుగుమ్మ గతేడాది జూన్‌లో బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. 


అయితే ఇదిలా ఉండగా దీపికా మరోసారి ప్రెగ్నెన్సీతో ఉందంటూ సోషల్ మీడియాలో రూమర్స్ మొదలయ్యాయి. మరో బిడ్డ కోసం ప్లాన్ చేస్తున్నారంటూ కొందరు నెటిజన్స్‌ కామెంట్స్‌ చేశారు. అయితే ఆమె ఇటీవలే తన బిడ్డ రుహాన్‌ను తన చేతుల్లో పట్టుకుని వీడియోలో కనిపించింది. అందులో దీపికా వదులుగా ఉన్న తెల్లటి సూట్ ధరించి కనిపించింది. ఇది చూసిన చాలా మంది నెటిజన్స్‌ 'బేబీ బంప్' దుపట్టాతో దాచి ఉంచారంటూ కామెంట్స్‌ చేశారు. అయితే దీపికా కక్కర్ తనపై వస్తున్న రూమర్స్‌పై స్పందించలేదు. కాగా.. దీపికకు ఇప్పటికే రౌనక్ సామ్సన్‌ అనే వ్యక్తితో మొదటి పెళ్లి కాగా.. అతనితో  2015లో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత 2018లో షోయబ్ ఇబ్రహీంను పెళ్లాడింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement