
బాలీవుడ్ నటి హీనా ఖాన్ ఆమె ప్రియుడితో బ్రేకప్ చేసుకుందంటూ ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో తాజాగా ఈ వార్తలపై ఆమె స్పందించింది. సోషల్ మీడియాలో అభిమానులు పెద్దఎత్తున కామెంట్స్ చేయడంతో రూమర్లపై క్లారిటీ ఇచ్చింది.
ప్రియుడు రాకీతో బ్రేకప్‌పై హీనా ఖాన్ స్పందిస్తూ.. ' బ్రేకప్ గురించి కొన్ని కథనాలు విన్నా. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు. ప్రస్తుతం మేం ఇద్దరం చాలా సంతోషంగా ఉన్నాం. దేవుడు మా పట్ల దయతో ఉన్నారు. కానీ ఇది విని నా స్నేహితులు చాలా భయపడ్డారు. రాకీ పూర్తిగా భిన్నమైన వ్యక్తి. ఇలాంటి వాటిని పట్టించుకోడు. నా స్నేహితులు చాలామంది ఈ విషయంపై ఆరా తీశారు.' అని అన్నారు.
హీనా ఖాన్, చిత్రనిర్మాత రాకీ చాలా ఏళ్లుగా డేటింగ్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఆమె 'శడ్యంత్ర' అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఆ షో ప్రమోషన్లలో భాగంగా ఇదంతా ప్రచారంలో వ్యూహమని నటి తెలిపింది. వీరిద్దరు యే రిష్తా క్యా కెహ్లతా హై షూటింగ్ సెట్స్‌లో మొదటిసారి కలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment