Karishma Tanna says people thought she was pregnant because she rubbed her belly - Sakshi
Sakshi News home page

Karishma Tanna: అందువల్లే అలా చేశా.. కానీ అందరూ ప్రెగ్నెన్సీ అనుకున్నారు: కరిష్మా

Published Fri, Jun 2 2023 10:59 AM | Last Updated on Fri, Jun 2 2023 12:35 PM

Karishma Tanna says people thought she was pregnant because she rubbed her belly - Sakshi

బుల్లితెర నటి కరిష్మా తన్నా ప్రధానంగా హిందీ సినిమాలు, టెలివిజన్ షోలతో గుర్తింపు తెచ్చుకుంది. ఆమె 2001లో క్యుంకీ సాస్ భీ కభీ బహు థీతో టెలివిజన్‌లోకి అడుగుపెట్టింది. ఆమె నాగిన్ 3, ఖయామత్ కీ రాత్‌లలో తన పాత్రలకు బాగా ఫేమ్ సాధించింది. దాదాపు రెండు దశాబ్దాల పాటు బుల్లితెర నటిగా రాణిస్తోంది. ఇదిలా ఉండగా ఆమె ప్రస్తుతం గర్భవతి  అంటూ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన కరిష్మా ఆశ్చర్యకరమైన ప్రశ్న ఎదురైంది. గతంలో మీరు ప్రెగ్నెంట్ అని మీడియాలో వార్తలొచ్చాయని ప్రశ్నించగా.. వాటికి సమాధానమిచ్చింది. సోషల్ మీడియాలో వైరలవుతున్న వార్తలపై నటి క్లారిటీ ఇచ్చింది. మీరంతా తనను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ రూమర్లకు చెక్ పెట్టింది. 

(ఇది చదవండి: పెళ్లయిన నాలుగు నెలలకేనా?.. నటిపై దారుణ ట్రోల్స్..!)

నటి కరిష్మా తన్నా మాట్లాడుతూ.. 'నేను ఓ రెస్టారెంట్‌లో బాగా తిని బయటికొచ్చా. అదే సమయంలో బాగా ఎక్కువగా తిన్నట్లు అనిపించింది. అందుకే నా చేతితో అలా ఒక్కసారి బెల్లీని తాకా. దీంతో నేను ప్రెగ్నెంట్ అని భావించారు. దీనికి నేను ఆశ్చర్యపోయా. ఒకసారి నా పొట్ట వైపు చూసుకున్నందుకు అలా అనుకోవడమేనా?' అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది కరిష్మా తన్నా. ప్రస్తుతం స్కూప్ ‍అనే వెబ్ సిరీస్‌లో ప్రధాన పాత్రలో కనిపించనుంది. దీనికి  హన్సల్ మెహతా దర్శకత్వం వహిస్తున్నారు. ఆమె నటిస్తున్న స్కూప్ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో జూన్ 2న విడుదల కానుంది.

(ఇది చదవండి: లైవ్ షోలో సింగర్‌కు బుల్లెట్‌ గాయం.. ఆస్పత్రికి తరలింపు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement