జ్యూరిచ్: ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఓటమి తర్వాత తాను పాల్గొన్న రెండో టోర్నమెంట్‌లోనూ భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌కు నిరాశ ఎదురైంది. లండన్ క్లాసిక్ చెస్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లో నిష్ర్కమించిన ఈ ప్రపంచ మాజీ చాంపియన్... మంగళవారం ముగిసిన జ్యూరిచ్ క్లాసిక్ టోర్నీలో ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
ఆరుగురు అగ్రశ్రేణి గ్రాండ్‌మాస్టర్‌ల మధ్య క్లాసిక్, ర్యాపిడ్ విభాగాల్లో జరిగిన ఈ టోర్నీలో ఆనంద్ ఐదు పాయింట్లతో ఐదో స్థానాన్ని దక్కించుకున్నాడు. ప్రపంచ చాంపియన్ కార్ల్‌సన్ (నార్వే) 10 పాయింట్ల తో విజేతగా నిలువగా... ఫాబియానో (ఇటలీ), అరోనియన్ (అర్మేనియా) తొమ్మిది పాయింట్లతో ఉమ్మడిగా రెండో స్థానాన్ని సంపాదించారు. ర్యాపిడ్ విభాగంలో ఆనంద్ ఐదు గేమ్‌లు ఆడగా... అరోనియన్, నకముర, ఫాబియానో చేతిలో ఓడిపోయి... కార్ల్‌సన్, గెల్ఫాండ్‌లతో ‘డ్రా’ చేసుకున్నాడు.
ఆనంద్‌కు నిరాశ
Published Thu, Feb 6 2014 1:34 AM | Last Updated on Sat, Sep 2 2017 3:22 AM
Advertisement
Advertisement