న్యూఢిల్లీ: భారత సూపర్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ వేసే ఎత్తుకు పైఎత్తులు, విజయాలు, గెలుపోటములకు సంబంధించిన పోరాటాన్ని తెలుసుకునే అవకాశం వచ్చింది. ఆనంద్ తన అనుభవాలకు అక్షర రూపమిచ్చాడు. ఇదే పుస్తకంగా మార్కెట్లోకి రానుంది. ‘మైండ్‌మాస్టర్’– విన్నింగ్ లెసన్స్ ఫ్రమ్ ఎ చాంపియన్స్ లైఫ్ (విజేత జీవితంలోని విజయ పాఠాలు) అనే పేరుతో డిసెంబర్ నెలలో మార్కెట్లోకి రానుంది.
అదే నెల 11న అధికారికంగా ‘మైండ్‌మాస్టర్’ పుస్తకాన్ని లాంఛనంగా విడుదల చేయనున్నట్లు పబ్లికేషన్ సంస్థ తెలిపింది. జర్నలిస్ట్ సుశాన్ నినన్‌కు తెలిపిన తన కెరీర్ అనుభవాలను ఆ విలేకరి అక్షరగ్రంథంగా మలచగా... దీన్ని హాచెట్ ఇండియా సంస్థ ముద్రించింది.
Comments
Please login to add a commentAdd a comment