ఆనంద్‌కు చావోరేవో! | Viswanathan Anand Faces Must-Win Situation Against Magnus Carlsen | Sakshi
Sakshi News home page

ఆనంద్‌కు చావోరేవో!

Published Sun, Nov 23 2014 12:24 AM | Last Updated on Sat, Sep 2 2017 4:56 PM

ఆనంద్‌కు చావోరేవో!

ఆనంద్‌కు చావోరేవో!

సోచి (రష్యా): పాయింట్ తేడాతో వెనుకంజ.. మిగిలినవి మరో రెండు గేమ్‌లు మాత్రమే... ఎలాంటి ఎత్తుగడ వేసినా ప్రత్యర్థి వద్ద నుంచి వస్తున్న దీటైన సమాధానం... మొత్తానికి ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. ఆదివారం జరిగే కీలకమైన 11వ గేమ్‌లో కార్ల్‌సన్ తెల్లపావులతో ఆడనుండటం ఆనంద్‌కు ప్రతికూలాంశమే.

ఈ గేమ్‌లో గనుక ఆనంద్ ఓడితే కథ ముగిసినట్టే. ఒకవేళ ‘డ్రా’ చేసుకున్నా... టైటిల్ ఆశలు సజీవంగా ఉండాలంటే చివరిదైన 12వ గేమ్‌లో ఆనంద్ తప్పనిసరిగా గెలవాలి. ఈ నేపథ్యంలో ఆనంద్‌కు 11వ గేమ్ తాడోపేడో లాంటిది. ‘డ్రా’గా ముగిసిన చివరి నాలుగు గేముల్లో ఆనంద్ పైచేయి సాధించినా వాటిని తనకు అనుకూలంగా మల్చుకోలేకపోయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement